Saturday, April 13, 2024
Saturday, April 13, 2024

మనుస్మృతి-మెదుస-మగసంస్కృతి

సంగిరెడ్డి హనుమంతరెడ్డి

అమెరికాలో న్యూయార్క్‌ కౌంటీ (జిల్లా) క్రిమినల్‌ కోర్టు వద్ద గ్రీకు దేవత మెదుస విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇది మీటూ ఉద్యమ (నేను సైతం-మహిళల లైంగిక హింస, వేధింపుల వ్యతిరేక సామాజిక ఉద్యమం) సంకేతం. ఈ కోర్టు రెండు ఘోరమైన లైంగిక నేరాలకు అమెరికా సినీ నిర్మాత, ఒకనాటి హాలీవుడ్‌ దేవుడు హార్వే విన్స్టీన్‌కు శిక్ష విధించింది. ఇది మహిళలపై హింస, అత్యాచార నేరాల న్యాయస్థానం. ఏడడుగుల ఈ మెదుస కాంస్య విగ్రహ శిల్పి అర్జెంటైన్‌ ఇటాలియన్‌ కళాకారుడు లూసియానొ గార్బతి, ప్రతిమపై ‘పర్సియస్‌ తలతో మెదుస’ అని చెక్కారు. ఈ శిల్పం మహిళల న్యాయ చిహ్నం.

మనుస్మృతి దళితులను దస్యులుగా, ఉన్నత కుల స్త్రీలతో సహా మొత్తం స్త్రీలను బానిసలుగా పరిగణించింది. గ్రీసు గణిత, విజ్ఞాన శాస్త్రవేత్తలకు, తత్వవేత్తలకు, పాశ్చాత్య నాగరికతకు పుట్టినిల్లు. అట్టి గ్రీకు పురాణాల్లోనూ స్త్రీ దేవతలు వివక్షకు గురయ్యారు. మొత్తానికి ప్రపంచమంతా మగసంస్కృతి నేటికీ రాజ్యమేలుతోంది. అందుకే అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి.
క్రీ.పూ. 2వ శతాబ్దం నుండి క్రీ.శ.3వ శతాబ్దం వరకు ప్రచారంలో ఉన్న 50కి పైగా వైదిక ధర్మశాస్త్రాల్లో మనుస్మృతి సనాతన ధర్మ శాస్త్రం, వైదికమత ప్రమాణ నీతి గ్రంథం. ఇది ‘‘ఎక్కువ’’ కులస్తుల హక్కులు, ‘‘తక్కువ’’ కులస్తుల బాధ్యతలు, శూద్రుల నియంత్రణ చట్టాలు, ప్రవర్తన నీతినియమాల సూత్ర గ్రంథం. దీనిని స్వయంభువు మను, బ్రహ్మ మానసిక పుత్రుడు భృగు రాశారని వైదికవాద విశ్వాసం. పురుషహంకార ఆధిపత్య పైత్యం, ఛాందస భావాలను తమ కల్పిత దేవుళ్ళకు అంటగట్టారు. సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక యుద్ధ విద్యల ప్రపంచ తొలి నీతిసూత్ర గ్రంథంగా, భారత ప్రాచీన రాజ్యాంగంగా సంఫ్‌ు తాత్వికులు మనుస్మృతిని ప్రచారం చేశారు. బ్రిటిష్‌ న్యాయమూర్తి సర్‌ విలియం జోన్స్‌ 1776లో దీన్ని సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించారు. బ్రిటిష్‌ వలసవాద ప్రభుత్వం దీన్ని హిందు-చట్ట సూత్రీకరణకు వాడిరది. ‘‘మగాళ్లను అవినీతిపరులను చేయడం స్త్రీనైజం. స్త్రీలు సహజంగా వేశ్యలు. అంగ ప్రదర్శనతో మగాళ్లను ఆకర్షించి, శృంగారానికి ప్రేరేపించి నరకానికి దారితీస్తారు.’’ అని మనుస్మృతి స్త్రీలను అవమానించింది. మనుధర్మంతో స్ఫూర్తి పొందిన క్రైస్తవ, ఇస్లాం, బౌద్ధ గ్రంథాలూ స్త్రీలను సంభోగవస్తువులు, బుద్ధి హీనులు, మోసగత్తెలు, రహస్యంగా బోనులోకినెట్టే కుట్రదారులుగా చిత్రించాయి. స్త్రీలు బానిసలు, వారిని సమానత్వ భావనతో చూడవద్దని మగాళ్లను హెచ్చరించాయి. ‘‘స్త్రీలు తమ ఇంట్లోకూడా సొంతంగా ఏ పనీచేయరాదు.బాల్యంలోతండ్రి, యౌవనంలో భర్త,ముసలితనంలో కొడుకుల అధీనంలోఉండాలి.’’అని మనుస్మృతిస్త్రీల స్వాతంత్రాన్ని హరించింది. మహిళాహింస, అణచివేత, బానిసత్వాలను స్త్రీల గౌరవ, రక్షణలుగా సూత్రీకరించింది. స్త్రీలనూ ఒప్పించి, మెప్పించింది. సాంకేతికత, యాంత్రికతలతో అభివృద్ధి చెందిన ఆధునిక సమాజాన్ని, రాజకీయాలను కూడా మనుస్మృతి ప్రభావితం చేస్తోంది. దేశాన్ని నిట్టనిలువుగా చీలుస్తోంది.
అమెరికాలో న్యూయార్క్‌ కౌంటీ (జిల్లా) క్రిమినల్‌ కోర్టు వద్ద గ్రీకు దేవత మెదుస విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇది మీటూ ఉద్యమ (నేను సైతం-మహిళల లైంగిక హింస, వేధింపుల వ్యతిరేక సామాజిక ఉద్యమం) సంకేతం. ఈ కోర్టు రెండు ఘోరమైన లైంగిక నేరాలకు అమెరికా సినీ నిర్మాత, ఒకనాటి హాలీవుడ్‌ దేవుడు హార్వే విన్స్టీన్‌కు శిక్ష విధించింది. ఇది మహిళలపై హింస, అత్యాచార నేరాల న్యాయస్థానం. ఏడడుగుల ఈ మెదుస కాంస్య విగ్రహ శిల్పి అర్జెంటైన్‌ ఇటాలియన్‌ కళాకారుడు లూసియానొ గార్బతి, ప్రతిమపై ‘పర్సియస్‌ తలతో మెదుస’ అని చెక్కారు. ఈ శిల్పం మహిళల న్యాయ చిహ్నం. ఇటలీ, ఫ్లారెన్స్‌ నగరంలో ఇటలీ పునరుజ్జీవన ఉద్యమ కళాకారుడు బెన్వెనుటో సెలిని చెక్కిన శిల్పం దీనికి మూలం. స్త్రీ ద్వేష శిల్పులు, మూల శిల్పంలో క్రూర జంతువు ముఖాన్ని స్త్రీ మర్మాంగంలా చెక్కారని, (ఆడువారిని అవమానించారని) ఆస్ట్రియా నాడీమండల వైద్యుడు, మానసిక శాస్త్రజ్ఞుడు సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌ వ్యాఖ్యానించారు. గార్బతి విగ్రహం పౌరాణిక సంప్రదాయాలను తలకిందులు చేసింది. లైంగిక దాడుల్లో శేషజీవులైన మహిళల విజయ చిహ్నంగా నిలిచింది. 2,500 ఏళ్ల నాటి గ్రీకు పురాణ గాథ ప్రకారం శక్తివంతుడైన దేవుడు పొసీడాన్‌ సాటి దేవత మెదుసాను మరొక స్త్రీ దేవత ఎథేన్‌ గుడిలో మానభంగం చేశాడు. ఎథేన్‌ మగ దేవుడు పొసీడాన్‌ను శిక్షించలేదు. నీతిని ఉల్లంఘించిందని మెదుసాను నిందించింది. ఆమెను వెంట్రుకలకు బదులు తల నిండా పాములున్న క్రూర జంతువుగా మార్చింది. మెదుస చూపులతో మగాళ్ళు రాళ్ళుగా మారతారని శపించింది. గ్రీకు పురాణాల్లో ఆడ దేవతలూ మగ పక్షపాతులే. తర్వాత మెదుసాను వెలేశారు. వేటాడారు. పర్సీద్‌ రాజ వంశస్తుడు పర్సియస్‌ ఆమె తల నరికి తలను విజయ చిహ్నంగా ప్రదర్శించాడు. అందుకే ఫ్లారెన్స్‌ లోని మూల శిల్పంలో మెదుసా తల పర్సియస్‌ చేతిలో ఉంటుంది. కళాశిల్పి గార్బతి తన శిల్పంలో మెదుస చేతిలో పర్సియస్‌ తలను చెక్కారు. చూపుతో మగాళ్ళను శిల లుగా మార్చగల మెదుసా చేతిలో లింగాధిపత్య విజయ ఖడ్గం ఎందుకని ఆలో చించలేదు. మెదుస శిల్పంలో స్త్రీలను ప్రతీకాత్మక శక్తివంతులుగా సృష్టించారు. మహిళల మూగ గొంతుకలకు మాటనిచ్చారు. కట్టేసిన చేతులకు శక్తినిచ్చారు.
సంస్థలు తమ కాలం, నిధులను చరిత్ర నొక్కిన గొంతుల శోధనకు ఖర్చు పెట్టాలి. ప్రత్యేకించి అణచివేతకు గురైన మహిళా సమూహాలకు సాయపడాలి. పురాణాలను తిరగతిప్పి రాయలేము. పురాణ ప్రతిమలను తలకిందులుగా చిత్రించవచ్చు. ఇవి భావి తరాలకు కొత్త కథనాలను అందిస్తాయి. పౌరాణిక దేవుళ్ళతో మానభంగాలు చేయించేది పురాణ రచయితలైన పురుషుల మగ తత్వమే. స్త్రీ శీలమే కాదు, మగ మానమూ పవిత్రమే. ఐతే గియితే అత్యా చారంలో రెండూ చెడతాయి. పెళ్ళికి పనికిరాని తక్కువ కులంవారు సంభోగానికి పనికొస్తారా? ఈ సంగతులు మగ పిల్లలకు చెప్పం. అందుకే అబ్బాయిలు అత్యా చారాలకు పాల్పడుతూనే ఉన్నారు. మగ పిల్లలను అదుపు చేయాలి. ఆడపిల్ల లను పురుష సమానులుగా పెంచాలి. అపుడే అత్యాచారహత్యలు తగ్గగలవు. సమాజంలోసగమైన స్త్రీలుహింస, అణచివేత, అసమానతలకు గురైతే సమాజం, దేశం నాశనమౌతాయి. స్త్రీలు బానిసత్వం నుండి బయటపడాలి. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ భావాలను సమానంగా పెంచుకోవాలి. తప్పుడు భావజాలం సమస్యలకుమూలం. సమస్యల్లో స్త్రీలదోపిడి, అణచివేత, అత్యాచారాలూ ఉంటాయి. మగాళ్ళ ఆలోచన, ఆధిపత్య తాత్వికత మారాలి. మహిళలను మనుషులుగా గుర్తించాలి. సమాజ సృష్టికర్తలు, నిర్మాతలు ఐన స్త్రీల సమా నత్వాన్ని మన్నించాలి. ప్రగతిశీలురమనుకునేవారు కూడా సహజాత భావ జాల అవశేషాలనువదలుకోవాలి.సంఘసంస్కర్తలు ముందుతమనుతాము సంస్కరించు కోవాలి. కులమతాల వారసత్వ అణచివేతను నిరోధించాలి. మగాళ్ళు మానసికంగా మారకుండా సమాజ సంస్కృతి మారదు. సోవియట్‌ రష్యా, క్యూబా వగైరా సోషలిస్టు దేశాల్లో, చైనాలో స్త్రీల హక్కులను, సమానత్వాన్ని గుర్తించారు. ఆ దేశాలు సమున్నత ప్రగతిశీల సమసమాజాలుగా మారాయి.
‘‘పిల్లి నుండి ఎలుకకు, యజమాని నుండి పనివారికి, బ్రాహ్మణుల నుండి బ్రాహ్మణేతరులకు, పురుషుల నుండి స్త్రీలకు స్వాతంత్య్రం దొరకదు. సంఘ ర్షించి సాధించాలి. బ్రాహ్మణులను దైవాంశ సంభూతులుగా కాక మామూలు మనుషులుగా భావిస్తే మనుషులంతా ఒకటేనన్నభావం బలపడుతుంది. స్త్రీలు తమ బానిస మనస్తత్వం వదిలినపుడే సమాజంలో సమానత్వం సాధించగలం’’ ` పెరియార్‌. పెరియార్‌, మహాత్మా జ్యోతిరావు, సావిత్రిబాయి ఫూలేలతో పాటు న్యూయార్క్‌ కౌంటీ క్రిమినల్‌ కోర్టులో ప్రగతిశీల శిల్పి గార్బతి విప్లవీకరించిన మెదుస విగ్రహంతో ప్రేరణ పొందాలి. స్త్రీ స్వాతంత్య్రం కోసం మనుస్మృతిపై పోరాడాలి. మగ సంస్కృతిని మార్చాలి.
వ్యాస రచయిత ప్రోగ్రెసివ్‌ ఫోరం జాతీయ కార్యదర్శి, 9490204545

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img