Wednesday, May 22, 2024
Wednesday, May 22, 2024

మోదీ పాలనలో భారమైన విద్య

బీజేపీ నాయకుడు నరేంద్ర మోదీ పాలనలో విద్య చాలా ఖరీదైంది. అదే సమయంలో గత పదేళ్లుగా ఉద్యోగాల స్థితి కేవలం మోదీ హామీలు, మాటలగారడీకే పరిమితమైంది. చదువు ఖరీదుకావడంతో అత్యధిక సాధారణ కుటుంబాలలో విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరమవుతున్నారు. నిరుద్యోగం ఏనాడూ లేనంతంగా పెరిగి యువతను భయపెడుతోంది. అనేక లక్షల మంది గడచిన దశాబ్దిలో ఉద్యోగాలు లభించక జీవితమే భారంగా గడుపు తున్నారు. అలాగే లక్షలాదిమంది ఉద్యోగాలు లభించక ఉద్యోగ అర్హతకు అవసరమైన వయస్సుకూడా మించిపోయి ఏమి చేయాలో తోచకుండా ఉన్నారు. యువత బాధలు దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయ దృష్టికి కూడా వెళ్లింది. ఇటీవల విడుదలైన ఐఎల్‌ఓ`ఐహెచ్‌డీ సంయుక్త నివేదిక నిరుద్యోగిత దుస్థితిని వెల్లడిరచింది. అధికారిక ఆధారాల ప్రకారం, నిరుద్యోగులలో 83శాతం యువతే ఉన్నారు. వీరిలో దాదాపు చిన్న చితక పనులుచేసి జీవిస్తున్నవారు 90శాతం మంది ఉన్నారు. 82శాతం మంది అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. 2022 గణాంకాల ప్రకారం, 55.8శాతం స్వయంఉపాధి ద్వారా జీవిస్తున్నారు. కాజువల్‌ ఉద్యోగులు 22.7శాతం ఉండగా, రెగ్యులర్‌ ఉద్యోగం చేసేవారు 21.5శాతం ఉన్నారు. మోదీ ప్రభుత్వం జాతీయ ఉద్యోగ విధానాన్ని రూపొందించడానికి అంగీక రించడంలేదు. ఇండియన్‌ లేబర్‌ కాన్ఫరెన్స్‌ జాతీయ విద్యా విధానాన్ని రూపొందించాలని సిఫారసు చేసింది. ఇది దేశంలోని కార్మికులు, నిరుద్యోగ సమస్యలపై చర్చించి పరిష్కారాలను సూచించే ద్వైపాక్షిక ఉన్నతస్థాయి సంస్థ. ప్రతి సంవత్సరం 16వేల మిలియన్ల మంది యువత స్థాయి పొందుతున్నారు. మొత్తం జనాభాలో 27శాతం యువత ఉన్నారు. 2022లో వెల్లడైన సమాచారం ప్రకారం, వీరిలో నిరుద్యోగం 18.4శాతం ఉంటోంది. నిరుద్యోగులైన గ్రాడ్యుయేట్లు నిరుద్యోగ ంటుకంటే ఎక్కువగా 29.1శాతం ఉంటున్నారు. అందువల్ల ప్రతిపక్ష పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికలో యువత సమస్యలు,నిరుద్యోగ సమస్య ప్రధానంగా చేర్చాలి. బీజేపీ యువత 2024 లోకసభ ఎన్నికల ప్రణాళికను రూపొందిం చేందుకు సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరింది. యువత కీలకమైన ఓటు బ్యాంకుగా బీజేపీ గుర్తించింది. అదే సమయంలో వారికి ఉద్యోగాలు కల్పించాలన్న యోచన ఉండటంలేదు. ఎన్నికల ప్రణాళికలో ఈ అంశం చేర్చినప్పటికీ ఏ ప్రయోజనం ఉండదు. 2014లో ప్రతిసంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామని హామీఇచ్చిన మోదీ ఇప్పుడు యువత ఉద్యోగాలు కోరేవారుగా ఉండకుండా ఉద్యోగాలు ఇవ్వడానికి పరిశ్రమలను ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. ఇండియా కూటమిలో ప్రధానపార్టీ కాంగ్రెస్‌ ఎన్నికల ప్రణాళికలో తాము అధికారంలోకి వస్తే 30 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఉద్యోగాలులేని యువత సమస్యలను ప్రధానంగా చర్చించింది. అయిదు న్యాయ గ్యారంటీలను ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నది. ఇందులో యువ న్యాయ (యువతకు న్యాయం), నారీ న్యాయ (మహిళలకు న్యాయం), కిసాన్‌ న్యాయ (రైతులకు న్యాయం) కార్మిక న్యాయ (కార్మికులకు న్యాయం), హిస్సేదారి న్యాయ(సమానమైన అవకాశాలు ఇచ్చే న్యాయం).యువత సగటు వయసు 28ఏళ్లు ఉన్న యువభారతంలో యువత భవిష్యత్తు కీలకఅంశం అయింది. దేశంలో యువతకు ఉద్యోగాలు లేవు. అదే సమయంలో వారి పరిస్థితి తీవ్ర నిరాశాజనకంగా ఉంది. కాంగ్రెస్‌ యువన్యాయ కార్యక్రమం కింద యుద్ధప్రాతిపదికపైన యువత సమస్యను పరిష్కరిస్తుందని కాంగ్రెస్‌ ఎన్నికల ప్రణాళిక పేర్కొంది. గ్రాడ్యుయేషన్‌ లేదా డిప్లమో చదివిన వారికి సంవత్సరంపాటు అప్రెంటిస్‌ శిక్షణ ఇస్తామని ప్రైవేటు కంపెనీ అయినా లేదా ప్రభుత్వరంగ కంపెనీ అయినా శిక్షణ ఇస్తామని కాంగ్రెస్‌ హామీలలో ఒకటిగా పేర్కొన్నారు. గ్రాడ్యుయేషన్‌ చేసి 25ఏళ్ల లోపు వయసున్నవారికి శిక్షణ ఉంటుంది. 30లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని వీటిని తప్పనిసరిగా భర్తీ చేస్తామని ప్రణాళిక పేర్కొంది. రాష్ట్రప్రభుత్వాల సమ్మతితో గడువుప్రకారం మున్సిపాలిటీలు, పంచాయితీలలో ఉన్న ఖాళీలను కూడా భర్తీ చేస్తామని ప్రణాళిక తెలిపింది. స్టార్టప్‌లకు నిధులు లభ్యతప్రకారం 50శాతం నిధులను కేటాయిస్తామని, వీలైనంత మేరకు అన్ని జిల్లాలలోనూ 40ఏళ్లలోప ుఉన్న యువతకు సొంత వ్యాపారాలు పెట్టుకునేందుకు నిధులు సమకూరుస్తామని ప్రణాళికలో పొందు పరచారు. అలాగే విద్యకు ఖర్చును తగ్గిస్తామని అన్ని స్థాయిల్లో నాణ్యమైన విద్యను బోధించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. సీపీఎం తన ఎన్నికల ప్రణాళికలో పనిహక్కు రాజ్యాంగహక్కుగా రూపొందించేందుకు కృషిచేస్తామని పేర్కొంది. సార్వత్రిక విద్యాహక్కును పటిష్టం చేస్తామని, ప్రైవేటు ఉన్నత విద్యను నిలిపి వేస్తామని కూడా ప్రణాళికలో పేర్కొన్నారు. బీజేపీతో సహా ఇంకా కొన్ని పార్టీలు ఎన్నికల ప్రణాళికను విడుదల చేయవలసి ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img