Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

యూపీలో రైతు ఉద్యమంపై బీజేపీ బెంబేలు

అరుణ్‌ శ్రీవాస్తవ

రైతులు సంయుక్త కిసాన్‌ మోర్చా ఆధ్వర్యాన ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించ తలపెట్టిన ఉద్యమంపై బీజేపీ బెంబేలు పడుతోంది. సెప్టెంబరు 5న యూపీ రాజధాని లక్నోకు వెళ్లే అన్ని మార్గాలను దిగ్బంధం చేయాలని కిసాన్‌ మోర్చా నిర్ణయించింది. రైతు ఉద్యమాన్ని విఫలం చేయాలని అవసరమైతే రైతులతో తలపడాలని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు సిద్ధం అవుతున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలవటంతో పాటు 2024లో జరగవలసిన లోక్‌సభ ఎన్నికల్లోనూ విజయం సాధించేందుకు సంఘ పరివార్‌ వ్యూహం పన్నింది. యూపీలో యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం అధ్వాన్నమైన పాలన కారణంగా బీజేపీ ఆశలు నెరవేరటం కష్టమే. ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ ఈ అంశాన్ని పసిగట్టే హిందువులు, ముస్లింల డిఎన్‌ఏ ఒకటే అంటూ ఎత్తుగడ వేశారు. ముస్లింలను ఎలాగైనా బుజ్జగించి కొంత శాతం ఓట్లనైనా రాబట్టుకోవాలనే వ్యూహంలో భాగమే భగవత్‌ ప్రకటన. హిందువుల ఓట్లన్నీ ఈసారి బీజేపీకి పడతాయన్న హామీ లేదు. 2017లో అగ్ర వర్ణాల, ఓబిసీల, దళితుల ఓట్లను పొందేందుకు అనేక మాయోపాయాలు చేసింది. ప్రస్తుతం ఈ ఓట్లు చెల్లాచెదురైపోయే పరిస్థితి ఏర్పడిరది. యోగీకి చెందిన అగ్రవర్ణం రాజ్‌పుత్‌లు భీతావహం సృష్టించారు. అందువల్ల ఇతర కులాల ఓట్లు ఈసారి బీజేపీకి ఎక్కువగా వచ్చే అవకాశాలు లేవు.
యోగి ప్రభుత్వంపై ఆగ్రహం, విద్వేషం ప్రజలలో నెలకొని ఉన్నందున కిసాన్‌ సంయుక్త మోర్చా యూపీ ఎన్నికలపై కేంద్రీకరించినట్లయితే బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల అనుభవం ఇక్కడ కూడా ఎదురవుతుందని సంఘ పరివార్‌ ఆందోళన చెందుతోంది. రైతు ఉద్యమనాయకుడు రాకేష్‌ తికైత్‌ను ప్రముఖమైన వ్యక్తిగా రాష్ట్రంలో ప్రజలు పరిగణిస్తున్నారు. ప్రజల ఆకాంక్షలకు, ప్రత్యామ్నాయ రాజకీయాలకు సూచికగా ఆయనను భావిస్తున్నారు. సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ మార్గం సైతం అంత తేలికగా ముందుకు వెళ్లే స్థితి లేదు. ప్రతికూల వాతావరణాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ వెనక్కి మళ్లించే అవకాశం తక్కువే. నరేంద్రమోదీ, యోగీలను అనుసరించే బీజేపీలోని గ్రూపుల మధ్య సఖ్యత ఏర్పడటం కూడా కష్టమే. రాష్ట్రంలో వెనుకబడిన తరగతులలో గల ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు కేంద్రనాయకత్వం తమపై చిన్నచూపుచూస్తున్నదని విమర్శిస్తున్నారు. కేంద్ర నాయకత్వం ఇక్కడ పరిణామాలను పట్టించుకుని ఉన్నట్లయితే నేడీ దుస్థితి ఉండేది కాదని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
లక్నోను దిగ్బంధం చేయటం ఒక్కరోజు మాత్రమే కాదు. ఈ ఉద్యమాన్ని అసెంబ్లీ ఎన్నికలు జరిగే వరకు కొనసాగించాలని కిసాన్‌ మోర్చా ప్రణాళిక రూపొందించారు. ‘‘లక్నో కూడా దిల్లీ అవుతుంది’’ అని రాకేష్‌ తికైత్‌ ఇప్పటికే ప్రకటించారు. రైతుల ఉద్యమం దిల్లీ నుంచి లక్నో సరిహద్దులకు మారనున్నది. వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో జరగనున్న యూపీ ఎన్నికలపైన అలాగే ఉత్తరాఖండ్‌ పైన రైతులు తమ దృష్టిని కేంద్రీకరించారు. పశ్చిమ యూపీలోని ముజఫర్‌ నగర్‌లో సెప్టెంబరు 5న జరగనున్న కిసాన్‌ మహా పంచాయత్‌ సమావేశం ముగిసిన తరవాత ఆందోళనను తీవ్రతరం చేయనున్నారు. పశ్చిమ యూపీలో మతఘర్షణలు సృష్టించాలని బీజేపీనాయకత్వం కుట్ర పన్ను తున్నట్టుగా కిసాన్‌ మోర్చా భావిస్తోంది. ఈ ప్రాంతం కిసాన్‌ మోర్చాకు చాలా బలమైంది. 2013లోనూ బీజేపీ దాడులకు పూనుకుని ఘర్షణలు సృష్టించి ప్రయోజనం పొందింది. సామాజిక అలజడులను, కులాలమధ్య సామరస్యతను దెబ్బతీసేందుకు బీజేపీ పన్నిన కుట్రను అడ్డుకోవాలని కిసాన్‌ మోర్చా నాయకులు నిర్ణయించారు.
యూపీలో గ్రామ స్థాయి నుంచి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విచ్ఛిన్నకర విధానాలపై నిరసన ర్యాలీలను నిర్వహించాలని కిసాన్‌ మోర్చా నాయకులు తలపెట్టారు. మిషన్‌ యూపీ, ఉత్తరాఖండ్‌ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని వారు చెప్పారు. జాట్లలో ఒక విభాగం మాత్రమే రైతు ఉద్యమంతో ఉన్నారన్న తప్పుడు ప్రచారాన్ని చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ములాయంసింగ్‌ నాయకత్వంలోని సమాజ్‌వాది పార్టీతో చాలా కాలంగా బలమైనసంబంధం కలిగిన యాదవులుసైతం రైతులతో చేతులు కలుపు తున్నారు. రైతు ఉద్యమానికి మధ్య యూపీ, తూర్పు యూపీ ప్రాంతంలో మంచి ఆదరణ, మద్దతు ఉంది. అయితే ప్రత్యక్షంగా రైతు ఉద్యమంలో పాల్గొనలేదు. యాదవ రైతులను కూడా రైతు ఉద్యమంలోకి తీసుకు రావటానికి కిసాన్‌ మోర్చా సిద్ధమైంది. ఇటీవల కేంద్ర మంత్రివర్గంలో జరిగిన మార్పులలో భాగంగా యూపీలోని దళిత, వెనుకబడిన తరగతుల నాయకులను కొందరిని మంత్రులుగా నియమించి ఆయా కులాల ఓట్లను రాబట్టుకునేందుకు వ్యూహం పన్నారు. ఈ విషయంలో మోదీ వ్యూహం ఫలించేట్లు లేదని ఆయా కులాల్లో ఉన్న వాతావరణం తెలియజేస్తున్నది.
బీజేపీ హర్యానాలో తిరంగ యాత్ర ప్రారంభించింది. ఆగస్టు 15 వరకు ఇది కొనసాగుతుంది. ఈ యాత్రలో బీజేపీ నాయకులు పాల్గొని స్వాతంత్య్ర ఉద్యమంలో అమరులైనవారిని గుర్తుచేస్తూ వివిధ కార్యక్రమాలు నిర్వహించటం ద్వారా తమకూ దేశభక్తి ఉందని చెప్పుకునేందుకు యత్నిస్తున్నారు. హిందూ జాతీయవాదులు కూడా స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నట్టు చిత్రించేందుకే ఈ యాత్ర ఉద్దేశించింది. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనకుండా బ్రిటీష్‌ వాళ్ల ప్రయోజనాలకు ఆర్‌ఎస్‌ఎస్‌అండగా ఉన్నదన్నదివాస్తవం. స్వాతంత్య్ర పోరాటంలో తాము ప్రముఖంగా పాల్గొన్నట్టు ప్రజలను నమ్మించేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ నానా తంటాలు పడుతోంది. తొలినుంచి అది అతివాద హిందూజాతీయతకే కట్టుబడి ఉంది. రైతులను రెచ్చగొట్టి ఉద్యమాన్ని అప్రతిష్టపాలు చేసేందుకే హర్యానాలో తిరంగ యాత్రను తలపెట్టారని కిసాన్‌ మోర్చా నాయకులు విశ్వసిస్తున్నారు. బీజేపి కుత్సితమైన ఎత్తుగడలకు లొంగిపోవద్దని రైతులకు కిసాన్‌మోర్చా విజ్ఞప్తిచేసింది. రైతులలో అప్రతిష్టపాలైన బీజేపీని ప్రజలు తిరస్కారంగా చూస్తున్నారని స్వరాజ్‌ఇండియా నాయకుడు యోగేంద్రయాదవ్‌ వ్యాఖ్యానించారు.
తిరంగ యాత్రను యూపీలో కూడా ప్రారంభించాలని ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీలు పథకం రూపొందించుకున్నాయి. రైతుల దృష్టిని ఉద్యమం నుంచి మళ్లించేందుకే ఈ యాత్ర నిర్వహించాలని ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ భావిస్తోంది. ప్రస్తుతం పార్లమెంటు ఎదుట రైతుల నిరసన ఉద్యమం కొనసాగుతోంది. ఈ ఉద్యమం ప్రస్తుతం నూతన దశలోకి చేరింది. తాము చేసిన మూడు చట్టాలు రైతులకు వ్యతిరేకం కాదని మోదీ పదేపదే ప్రచారం చేసుకుంటున్నారు. మోదీ మాటలు పూర్తి అసత్యం అని రాకేష్‌ తికైత్‌ గతంలోనే వ్యాఖ్యానించారు. ఈ చట్టాలను రద్దుచేసే ఆలోచన లేనందున యూపీ, ఉత్తరాఖండ్‌ ప్రభుత్వాలను గద్దె దింపటమే తమ లక్ష్యమని తికైత్‌ ప్రకటించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img