London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Friday, October 18, 2024
Friday, October 18, 2024

యూరప్‌లో మతవాద శక్తులపై పోరు

సాత్యకి చక్రవర్తి

యూరప్‌లోని అనేక దేశాల రాజధానులలో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తుతున్నాయి. పాలకపార్టీల నిరంకుశ సామ్రాజ్యవాద విధానాలకు వ్యతిరేకంగా కొద్ది రోజులుగా ప్రజలు ఉద్యమించారు. ఈ ప్రదర్శనల్లో మహిళలు, యువత భారీ సంఖ్యలో పాల్గొన్నారు. జర్మనీలోని ప్రధాన నగరాలతో సహా యూరప్‌లోని అనేక ప్రధాన నగరాల్లో జరిగిన నిరసన ప్రదర్శనలో లక్షలాదిమంది ప్రజలు పాల్గొన్నారు. ప్రజా వ్యతిరేక, ప్రభుత్వ నయా వలసవాద విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు గళమెత్తారు. జర్మనీలో రైట్‌వింగ్‌ ఆల్టర్నేటివ్‌ ఫర్‌ జర్మనీ పార్టీ విధి విధానలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలు వెల్లువెత్తాయి. విదేశీ మూలాలు ఉన్న వ్యక్తులను భారీగా బహిష్కరించాలన్న విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించారు. శరణార్థులను, వలసదారులను సామూహికంగా అరికట్టాలని, దేశంలో ఉన్న శరణార్థులను బహిష్కరించే విధివిధానాలపై జరిగిన నయా ఉదారవాద, నియంతృత్వ చర్యలను ప్రజలు ముక్తకంఠంతో ఖండిరచారు. ఈ సమావేశానికి అతిమితవాద పార్టీ ఫార్‌ రైట్‌ ఆల్టర్నేటివ్‌ ఫర్‌ జర్మనీ(ఏఎఫ్‌డీ)కి చెందిన సభ్యులు హాజరయ్యారు. వలసదారులను, ఆశ్రయం కోసం వచ్చిన వారిని సామూహికంగా బహిష్కరించే విధానాలపై పాలకపార్టీల చర్యలు అత్యంత హేయమైనవిగా ప్రజాసంఘాలు పేర్కొన్నాయి. అయితే జర్మన్‌ పార్లమెంటులో ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏఎఫ్‌డీ పార్టీ దేశ రాజ్యాంగ విధానాలకు కట్టుబడి ఉన్నట్లు పేర్కొంది. జర్మనీలో ఏఎఫ్‌డీ పార్టీ ఈ విధానానికి పూర్తిస్థాయిలో తన తోడ్పాటునందిస్తోంది. ఏఎఫ్‌డీ పార్టీ మధ్యేవాద మితవాద రాజకీయ పార్టీల మద్దతుతో రానున్న ఎన్నికల్లో జర్మనీలో అధికారం చేపట్టేందుకు ప్రయత్నిస్తోంది. జర్మనీతో పాటు ఇతర యూరోపియన్‌ దేశాలలో వలసదారులను పూర్తిస్తాయిలో బహిష్కరించాలని పిలుపునిచ్చే అతివాద గ్రూపులున్నాయి. ప్రభుత్వంలోని కొందరు అధికార ప్రతినిధులు దేశంలో మితవాద నిరంకుశ ధోరణులకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజా నిరసనలకు మద్దతు పలికారు. జర్మనీలో యూరోపియన్‌ సోషలిస్టు పార్టీలు ప్రజా నిరసనలకు తమ సంఫీుభావం ప్రకటించారు. ప్రభుత్వ జాత్యహంకార విధానాలకు వ్యతిరేకంగా జర్మన్‌ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్‌`వాల్టర్‌ స్టెయిన్‌మీర్‌ వీడియో ప్రకటన విడుదల చేస్తూ మన ప్రజాస్వామ్య భవిష్యత్తు ప్రత్యర్థుల పరిమాణంపై ఆధారపడి ఉండదని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునే వారి లక్ష్యాలమీద ఆధారపడి ఉంటుందన్నారు. ఫ్రీ డెమోక్రాట్‌ల మద్దతుతో అధికారంలో ఉన్న జర్మన్‌ సోషల్‌ డెమొక్రాటిక్‌ పార్టీ మితవాదుల విధానాలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అయితే ఈ నేపధ్యంలో రెండు పార్టీలుగా చీలిపోయిన జర్మన్‌ వామపక్షాలు కూడా తమ మద్దతుదారులను పెద్ద సంఖ్యలో సమీకరించాయి. ఫ్రాన్స్‌లో ప్రభుత్వ వలస విధానాలపై అధ్యక్షుడు మాక్రాన్‌ తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా జరగిన భారీ ప్రదర్శనలో వామపక్షాలు, సోషలిస్టు పార్టీ సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నాయి. ఫ్రాన్స్‌లో జాతివివక్ష, క్సినోఫోబియా, అసహనం, వలసదారుల ప్రయోజనాలకు సంబంధించిన బిల్లు ఫ్రెంచ్‌ రాజ్యాంగానికి విరుద్దంగా ఉందని యుఎన్‌ తాజా నివేదిక వెల్లడిరచింది. ఈ విషయంలో అతి మితవాద లీ పెన్స్‌ పార్టీ నుంచి మాక్రాన్‌ ప్రభుత్వం ఒత్తిడిని ఎదుర్కొంటోంది. మాక్రాన్‌ ప్రభుత్వం అక్రమ వలసదారుల నిలుపుదలపై చేపట్టిన చర్యలు లీపెన్స్‌ పార్టీ తమ మద్దతు ఉపసంహరణకు దారితీస్తుందని ఆందోళన చెందుతోంది. నూతన వలసవాద చట్టం ప్రతిపాదన ఫ్రెంచ్‌ రాజ్యాంగ ప్రాధమిక లక్ష్యాలను ఉల్లంఘించే విధంగాఉందని ఈ చట్టంపై సంతకాలు చేయవద్దని అధ్యక్షుడుని నిరసనకారులు కోరారు. ఫ్రెంచ్‌ కమ్యూనిస్ట్‌ పార్టీకి చెందిన ట్రేడ్‌ యూనియన్‌ సిజిటి ఈ ప్రదర్శనకు ప్రధాన బాధ్యత వహించారు. సీజీటీ జాతీయ కార్యదర్శి సోఫీ బినెట్‌ మాట్లాడుతూ ‘నిత్య జీవితంలో ఫ్రాన్స్‌లో లేని సంఫీుభావం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, కలిసి జీవించే చట్టాన్ని ఖండిరచడమే లక్ష్యంగా పేర్కొన్నారు. డిసెంబరులో పార్లమెంటు ఆమోదించిన చట్టంలోని అన్ని నివేదికలు ఫ్రెంచ్‌ రాజ్యాం గానికి అనుగుణంగా ఉన్నాయో లేదో రాజ్యాంగ మండలి నిర్ణయించడానికి ముందు ప్రజా నిరసనలు దేశమంతటా వెల్లువెత్తాయి. అయితే మెరైన్‌ లీ పెన్‌ నేతృత్వంలోని జాతీయ ర్యాలీ ప్రతిపాదిత ఈ కొత్త చట్టాన్ని స్వాగతించింది. పారిస్‌లో జరిగిన నిరసన కార్యక్రమంలో ఫ్రెంచ్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ జాతీయ కార్యదర్శి ఫేబియన్‌ రస్సెల్‌ మాట్లాడుతూ, ఈ మార్చ్‌ ‘‘ఈ అమానవీయ వలసవాద చట్టాన్ని రద్దు చేయడమే’’ లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు. అధ్యక్షుడు మాక్రాన్‌ ప్రతిపాదించిన ఈ వలసల ప్రతిపాదనపై ఫ్రెంచ్‌ వామపక్షాలు, ఫ్రెంచ్‌ మితవాద శక్తులు భిన్నాభి ప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. యూరోపియన్‌ పార్లమెంట్‌కు జూన్‌లో జరిగే ఎన్నికల కోసం లీ పెన్‌ ప్రధాన ఎన్నికల ప్రణాళికలో విదేశీయులను బహిష్కరించడంపై దృష్టి సారించకపోవడం ఎన్నికల ఫలితాలు ఆశాజన కంగా ఉన్నాయి. నిజానికి, ఐరోపాలోని అన్ని మితవాద పార్టీలకు, యూరోపియన్‌ పార్లమెంటు ఎన్నికలు ప్రధాన సమస్యగా ఉండనున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img