Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

రష్యాలో ప్రధాన ప్రతిపక్షంగా కమ్యూనిస్టులు

ఎం. కోటేశ్వరరావు

పార్టీ సిద్ధాంతాలు, ఆచరణకు జనం మద్దతు పెరిగినట్లు ఫలి తాలు వెల్లడిరచాయని కమ్యూనిస్టు పార్టీ సమీక్షలో పేర్కొన్నది. అక్రమాలు చోటు చేసుకోనట్లయితే ఓటింగ్‌ శాతం, సీట్లు ఇంకా పెరిగి ఉండేవి. కమ్యూ నిస్టు పార్టీని ప్రధాన ప్రతిపక్షంగానే కాదు, అసలైన ఏకైక ప్రతిపక్షంగా జనం భావించారు. అందువల్లనే ప్రభుత్వ వ్యతిరేకులు కమ్యూనిస్టుల వైపు మొగ్గారు.

సోవియట్‌ యూనియన్‌ కూలిపోయింది కమ్యూనిస్టుల తప్పిదాలతోనే నన్నది కొందరి ఆలోచన. మరొక కోణం ప్రకారం కుట్రతో సామ్రాజ్యవాదం కూల్చివేసింది. దేని పాత్ర ఎంత అనేది ఎవరికి వారు గుణపాఠాలు తీసుకుం టూనే ఉన్నారు. ఆ ఉదంతం జరిగి మూడు దశాబ్దాలు దాటింది. ఇప్పుడు అక్కడ కమ్యూనిస్టులు ఏం చేస్తున్నారు, ఉద్యమం ఎలా ఉంది అనేది వామపక్ష అభిమానులకే కాదు వ్యతిరేకులకూ ఆసక్తికరమైన అంశమే. పుతిన్‌కు తల నొప్పిగా మారుతున్న కమ్యూనిస్టులు అనే శీర్షికతో అమెరికాకు చెందిన వాషిం గ్టన్‌ పోస్టు పత్రిక ఒక సమీక్ష రాసింది. రష్యాను మరోసారి కమ్యూనిస్టు భూతం వెంటాడుతోందా అనే వాక్యంతో అది ప్రారంభమైంది. నిజమేనాఅతిశయోక్తా? అసలు అక్కడేం జరుగుతోంది? సెప్టెంబరు 1719 తేదీలలో రష్యన్‌ డ్యూమా (పార్లమెంటు) ఎన్నికలు జరిగాయి. 450 స్థానాలకు గాను 225 దామాషా ప్రాతినిధ్యం పద్ధతిలోనూ, మిగిలిన 225 నియోజకవర్గాలకు ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయి. అధికార యునై టెడ్‌ రష్యా పార్టీకి 49.82 శాతం ఓట్లు, 324 సీట్లు వచ్చాయి. ప్రతిపక్షంగా మొదటి స్థానంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీకి 18.93 శాతం ఓట్లు, 57 సీట్లు వచ్చాయి. జస్ట్‌ రష్యా పార్టీకి 7.46 శాతం ఓట్లు 27 సీట్లు, ఎల్‌డిపిఆర్‌కు 7.55 శాతం ఓట్లు 21 సీట్లు, న్యూపీపుల్‌ పార్టీకి 5.32 శాతం ఓట్లు 13 సీట్లు, మరో మూడు పార్టీలకు ఒక్కొక్క సీటు, స్వతంత్రులకు ఐదు వచ్చాయి. మాస్కో తదితర ప్రాంతాలలో అధికార పార్టీ అనేక అక్రమాలకు పాల్పడటంతో ప్రత్యక్ష ఎన్నికలలో కమ్యూనిస్టులు కొందరు ఓడిపోయారు. వాటి మీద కోర్టులో కేసులు దాఖలు చేశారు. గత పార్లమెంట్‌ ఎన్నికలలో మొత్తం ఓట్లలో 47.8 శాతం ఓటింగ్‌ జరగ్గా ఈసారి 45.15 శాతానికి తగ్గింది. అధికారపక్ష ఓట్లు 54.20 శాతం నుంచి 49.82 శాతానికి తగ్గాయి.
కమ్యూనిస్టులతో సహా ప్రతిపక్షాలకు చెందిన అనేకమంది అభ్యర్థులపై తప్పుడు కేసులు బనాయించి పోటీలో లేకుండా చేసుకోవటం, ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ అక్రమాలకు పాల్పడటంలో పుతిన్‌ అధికార యంత్రాంగం పేరు మోసింది. వాటన్నింటినీ అధిగమించి కమ్యూనిస్టులు ప్రధాన ప్రతిపక్షంగా ముందుకు రావటం, అక్రమాలను వ్యతిరేకిస్తూ నిరసనలకు దిగటంతో అసలు సిసలు ప్రతిపక్షం కమ్యూనిస్టులే అని పరిశీలకులు, సామాన్య జనం కూడా గుర్తించారు. అనేకమంది చురుకైన యువ కమ్యూనిస్టులు ఈ ఎన్నికలలో పని చేయటం, జనం ఆదరించటం గతం కంటే ఆరుశాతం ఓట్లు, 15 సీట్లు పెరగటాన్ని చూసి రాబోయే రోజుల్లో కమ్యూనిస్టులతోనే పుతిన్‌కు సవాలు ఎదురవుతుందని భావిస్తున్నారు. వాషింగ్టన్‌ పోస్టు విశ్లేషణ సారాంశమిదే.
కమ్యూనిస్టు పార్టీ ఇటీవలి కాలంలో అనుసరిస్తున్న ఎత్తుగడలు, ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లను సంఘటితం చేసేందుకు చేసిన యత్నాలు ఫలిస్తున్నట్లు ఈ ఎన్నికలు నిరూపించాయి. గత అధ్యక్ష ఎన్నికలలో (2018) కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థిగా పురోగామి భావాలు కలిగిన స్ట్రాబెరీ వాణిజ్యవేత్త పావెల్‌ గ్రుడినిన్‌ పోటీ చేశారు. గ్రుడినిన్‌కు విదేశాల్లో ఆస్తులున్నాయని, పుతిన్‌ మీద పోటీ చేసిన ఆయనకు 90 లక్షల మంది మద్దతుదారులు లేరనే పేరుతో ఈసారి పార్లమెంట్‌ ఎన్నికలలో పోటీ చేసేందుకు అనర్హుడిగా ప్రకటించారు. ప్రాంతీయ అసెంబ్లీల్లో ఇలా ఐదుగురు ప్రముఖ కమ్యూనిస్టు నేతలను అనర్హులుగా ప్రకటించారు. కమ్యూనిస్టు మద్దతుదారులే కాదు, పుతిన్‌ విధానాలను వ్యతిరేకించే ఇతర ఓటర్లు కూడా ఈ ఎన్నికలలో కమ్యూనిస్టుల వైపు మొగ్గటం స్పష్టంగా కనిపిం చింది. ఇది వచ్చే అధ్యక్ష ఎన్నికలలో కూడా పుతిన్‌ మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. మిగతా ప్రతిపక్ష పార్టీ నేతలను తప్పుడు కేసులతో, ఏదో ఒక సాకుతో జైలుపాలు చేసి, కమ్యూనిస్టుల మీద నిర్బంధాన్ని ప్రయోగిస్తే అది ఎదురుతన్నే అవకాశం ఉందనేది పుతిన్‌కు తెలియంది కాదు. కమ్యూనిస్టులకు ఈ ఎన్నికలలో కోటీ ఆరు లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి. దేశంలోని 41 ప్రాంతాల (మన రాష్ట్రాల మాదిరి)లో నాలుగు చోట్ల 30 నుంచి 36 శాతం ఓట్లతో కమ్యూనిస్టు పార్టీ పెద్ద పక్షంగా అవతరించింది. మిగతా చోట్ల 20 నుంచి 30 శాతం ఓట్లు వచ్చాయి. 38 ప్రాంతీయ శాసనసభల్లో గతంలో 158 స్థానాలుండగా ఇప్పుడు 254 వచ్చాయి. ఇవన్నీ అనేక చోట్ల అధికారపక్షం అక్రమాలకు పాల్పడిన నేపథ్యంలో వచ్చిన విజయాలు అని గ్రహించాలి. మూడు రోజుల పాటు ఎందుకు ఎన్నికలు జరిపారు అంటే కరోనా అని సాకులు చెప్పారు. అధికార పక్షానికి ఎదురుగాలి వీస్తున్నదనే సూచికలు ఎన్నికల ముందు సర్వేలు వెల్లడిరచాయి. దాంతో ఓటింగ్‌కు రాని ప్రభుత్వ రంగ కార్మికులు, ఇతరులను పెద్ద ఎత్తున సమీకరించారు, పరోక్ష ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో అధికార పక్షానికి ఓటు వేయించారు.
మీడియా కేంద్రీకరణ మొత్తం అధికారపక్షం వైపే, ప్రతిపక్షాలను ముఖ్యం గా కమ్యూనిస్టులను విస్మరించింది. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మాయాజాలం గురించి చెప్పాలంటే మాస్కో నగరం, పరిసరాల్లో ఇది స్పష్టంగా కనిపించింది. సెప్టెం బరు 19వ తేదీ రాత్రి 7 గంటల సమయంలో ప్రత్యక్ష ఓట్ల లెక్కింపులో కమ్యూ నిస్టు`అధికార యునైటెడ్‌ రష్యా పోటాపోటీగా ఓట్లు తెచ్చుకున్నట్లు వెల్లడైంది. తరువాత పరోక్ష ఎలక్ట్రానిక్‌ ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగానే ఒక గంటలోనే పరిస్థితి తారుమారైంది. ఇది రిగ్గింగు తప్ప మరొకటి కాదు. అనేక పోలింగ్‌ కేంద్రాలలో పెద్ద ఎత్తున ఏదో ఒక సాకుతో వేలాది ఓట్లను చెల్లనివిగా ప్రక టించారు. ఇలాంటి అక్రమాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు తప్ప ఇతర పార్టీలేవీ ఎక్కడా ఆందోళన జరపలేదు. పోలీసులు, అధికార యంత్రాంగం కమ్యూనిస్టు పార్టీ కార్యాలయాలలో ప్రవేశించి బెదిరించటం, అరెస్టులు చేయ టం, ప్రదర్శనలను అడ్డుకోవడం చేసారు. పార్టీ వెబ్‌సైట్‌ను నిరోధిస్తామని చెప్పారు. ఎన్నికల అక్రమాలపై కేసులు దాఖలు చేసేందుకు వివరాలను సేకరిస్తున్న లాయర్లను బెదిరించారు. పదిరోజుల పాటు జైలుపాలు చేశారు.
ఎన్నికలకు ముందు ఆల్‌ రష్యన్‌ సెంటర్‌ అనే ప్రజాభిప్రాయ సేకరణ సంస్థ జరిపిన సర్వే ప్రకారం కమ్యూనిస్టు నేత జుగనోవ్‌ మీద విశ్వాసం ప్రక టించిన వారు 30.7 శాతం. కమ్యూనిస్టులకు ఎన్నికలలో 16.6, రష్యన్‌ ఫెడ రేషన్‌లో 23.3 శాతం వస్తాయని పేర్కొన్నది. ఎన్నికలలో అంతకంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. పార్టీ సిద్ధాంతాలు, ఆచరణకు జనం మద్దతు పెరిగినట్లు ఫలి తాలు వెల్లడిరచాయని కమ్యూనిస్టు పార్టీ సమీక్షలో పేర్కొన్నది. అక్రమాలు చోటు చేసుకోనట్లయితే ఓటింగ్‌ శాతం, సీట్లు ఇంకా పెరిగి ఉండేవి. కమ్యూ నిస్టు పార్టీని ప్రధాన ప్రతిపక్షంగానే కాదు, అసలైన ఏకైక ప్రతిపక్షంగా జనం భావించారు. అందువల్లనే ప్రభుత్వ వ్యతిరేకులు కమ్యూనిస్టుల వైపు మొగ్గారు.
పదేళ్ళుగా మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో పుతిన్‌కు అసలైన ప్రతి పక్షం ఉదారవాదులు తప్ప కమ్యూనిస్టులు కాదని జనాల మెదళ్లలో ఎక్కించేం దుకు చేయని ప్రయత్నం లేదంటే అతిశయోక్తికాదు. అమెరికాలో మాదిరి ఎవరు అధికారంలో ఉన్నా ఉదారవాద పెట్టుబడిదారీ విధానాలను అనుసరించే శక్తులతోనే రాజకీయ రంగాన్ని నింపాలన్నది ఎత్తుగడ. గతేడాది చేసిన రాజ్యాంగ సవరణల ప్రకారం అధ్యక్ష పదవిని ఎవరు ఎన్నిసార్లయినా అధిరో హించవచ్చు. దాని ప్రకారం 2036 వరకు ఆరోగ్యం సహకరించి అన్నీ అను కూలిస్తే పుతిన్‌ అధికారంలో కొనసాగవచ్చు. అయితే ఉదారవాద పార్టీలకు బదులు కమ్యూనిస్టులే అసలైన ప్రతిపక్షం అని ఈ ఎన్నికలు నిరూపించటం గమనించాల్సిన ముఖ్య అంశం.
మాస్కోలోని మాక్రో అడ్వైజరీ సంస్థ అధిపతి క్రిస్‌ వీఫర్‌ ఎన్నికల గురించి విశ్లేషిస్తూ ‘‘ జనాభాలో మారుతున్న నిష్పత్తి పుతిన్‌ను భయపెడుతున్న అసలైన సమస్య, సోవియట్‌ యూనియన్‌ అంతరించిన తరవాత జన్మించిన జనాభా ఇప్పుడు ఎక్కువగా ఉంది. ఓటర్ల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతోంది. ఈ తరం పెద్ద ఎత్తున ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నది, అనేక దేశాలు తిరిగి వస్తున్నది. దేశం స్థిరపడాలనే పుతిన్‌ కబుర్లను వినేందుకు వీరు సిద్ధంగా లేరు. మెరుగైన జీవనం, ఆదాయం, సామాజిక భద్రత, మెరుగైన భవిష్యత్‌ను కోరుకుంటు న్నారు. వీరి ఆకాంక్షలను నెరవేర్చుతూ అధికారంలో కొనసాగటం అనేది పుతిన్‌ ముందున్న పెద్ద సవాలు. ప్రస్తుత వైఫల్యాలు వచ్చే ఎన్నికల్లో ఎవరు అధ్యక్ష అభ్యర్థిగా ఉన్నా వారికి గుదిబండలుగా మారతాయి’’ అన్నాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img