Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఎందుకింత వివక్ష!

కూన అజయ్‌బాబు

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌కుమార్‌ మిశ్రా రెండు రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌లో ఆందోళన చేస్తున్న రైతులను తన కాన్వాయ్‌తో తొక్కించి, నలుగురిని చంపేసిన ఘటన కలకలం సృష్టించింది. ఆ కాన్వాయ్‌ కారులో తాను లేనని మంత్రి చెపుతున్నప్పటికీ, అతని కుమారుడు డ్రైవింగ్‌ చేస్తున్న విషయాన్ని రైతులు ధ్రువీకరించారు. లఖింపూర్‌ ఖేరీలో జరిగిన ఈ ఘటనలో ఒక చానల్‌ రిపోర్టర్‌ రమణ్‌ కాశ్యప్‌ కూడా ప్రాణాలు కోల్పోయారు. రైతుల ఆందోళనపై వార్తా సేకరణకు వెళ్లిన ఆ విలేకరి విధుల్లోనే ప్రాణాలు కోల్పోయారు. అతని కుటుంబానికి 50 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించడానికి కేంద్రంలోని మోదీ సర్కారు గానీ, రాష్ట్రంలోని బీజేపీ సర్కారు గానీ ముందుకు రావడం లేదు. చాలీచాలని జీతంతో బతు కీడుస్తున్న ఆ రిపోర్టర్‌ చావుతో అతని కుటుంబం రోడ్డున పడిరది. రమణ్‌ కాశ్యప్‌ ఒక్కరే కాదు…దేశవ్యాప్తంగా పాత్రికేయులు ఇదే తరహాలో దైన్యస్థితిని ఎదుర్కొంటున్నారు.
దేశంలో పాత్రికేయులంతా ఒకతాటిపైకి వచ్చి అక్టోబరు 2వ తేదీ గాంధీ పుట్టినరోజున జాతీయనిరసనదినం చేపట్టారు. ఇండియన్‌ జర్నలిస్ట్స్‌ యూనియన్‌ (ఐజెయు) పిలుపు మేరకు పాత్రికేయులు తమ నిరసన గళంతో ఆకలి కేకలను దిల్లీ దాకా విన్పించేలా చేశారు. నిజానికి పాత్రి కేయుల కోర్కెలు చాలా చిన్నవి. సేవలకు గుర్తింపు, చనిపోయిన వ్యక్తి కుటుంబానికి పరిహారం మాత్రమే అడిగారు. పాత్రికేయులను కనీసం మనుషుల్లా కూడా చూడలేని కర్కశత్వాన్ని ప్రభుత్వాలు నిలువెల్లా నింపుకున్నాయి. కొవిడ్‌ ప్రబలిన సమయంలో పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్బంది అద్భుతంగా పనిచేశారు. వారిని ఎంత అభినందించినా తక్కువే. అదే సమయంలో జర్నలిస్టులు వారికి ఏ మాత్రం తీసిపోకుండా చెమటోడ్చారు. సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియ జేస్తూ విధులు నిర్వర్తించారు. అయినా ప్రభుత్వం వారిని ఫ్రంట్‌లైన్‌ వర్కర్లుగా గుర్తించకపోవడం వివక్షగాక ఇంకేమిటి? కరోనాకారణంగా ఒక్క మన రాష్ట్రం లోనే 128మంది జర్నలిస్టులుప్రాణాలు కోల్పోయారు. వారికుటుంబాలకు సాయ మేదీ? అలాగే, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 50 లక్షల రూపాయల కరోనా బీమా పథకాన్ని జర్నలిస్టులకు వర్తింప చేయడంలో అలసత్వమెం దుకు? ఈ విషయంలో జర్నలిస్టులను కలుపుకు పోతే, మోదీ ఖజానాకు చిల్లుపడు తుందా? విచిత్రమేమిటంటే, కరోనాతో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం జీవోను సైతం జారీ చేసింది. కానీ దాని జాడే లేకుండాపోయింది. అంతెందుకు? రాష్ట్రంలో గత సంవత్సరం గడువు ముగిసిన ప్రమాద బీమా పథకం పునరుద్ధరణకే దిక్కు లేదు. దానిపై స్పష్టతే లేదు.
ఇవన్నీ ఒక ఎత్తయితే, మోదీ ప్రభుత్వం అమలు చేయతలపెట్టిన కొత్త లేబర్‌ కోడ్‌ జర్నలిస్టులను మరింత అథోగతిపాలు చేయబోతున్నది. ఇప్పటి వరకు ఉన్న వర్కింగ్‌ జర్నలిస్ట్‌ చట్టాన్ని రద్దు చేసి దాన్ని కొత్త కార్మిక స్మృతి లోకి నెట్టివేసింది. ఇది అమల్లోకి వస్తే జర్నలిస్టులు ఇకపై హక్కుల గురించి మాట్లాడటానికి అవకాశమే ఉండదు. పాతవర్కింగ్‌ జర్నలిస్ట్‌ చట్టం నిబంధన లను యథాతథంగా కొనసాగించడానికి సమస్యేముంది? మీడియా సిబ్బందిపై దాడులు చేయించడం, మీడియా సంస్థలపై తప్పుడు కేసులు బనాయిం చడం, పాత్రికేయులతోపాటు రచయితలు, విద్యార్థులు, న్యాయవాదులు, పౌరహక్కులకార్యకర్తలు, మేధావులపై దేశద్రోహం కేసులు పెట్టడంలో మాత్రం ప్రభుత్వాలు ముందున్నాయి. ఈ ధోరణిని తక్షణమే విడనాడాలి.
గడిచిన ఏడేళ్లలో దేశంలో పాత్రికేయులకు, పౌరహక్కులకు వ్యతి రేకంగా ఒక తరహా ఉన్మాదం ప్రబలుతోంది. దానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సారథ్యం వహించడం విచారకరం. ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (పిసిఐ)లో వర్కింగ్‌ జర్నలిస్టుల జాతీయసంఘాల ప్రాతినిధ్యం తొలగించేం దుకు కుట్ర జరుగుతోంది. ఈ తరహా పైత్యప్రకోపానికి పాల్పడటం వల్ల అదనంగా ప్రభుత్వానికి ఒరిగేదేమైనా వుంటుందా? తాలి బాన్లు పాలించే అఫ్గానిస్థాన్‌లోనూ, కాషాయమూకలు రాజ్యమేలే భారత్‌ లోనూ పాత్రికేయుల స్థితిగతులు ఒకేలా వుంటున్నాయన్న ఆలోచనే ప్రజా స్వామ్య హితైషులు జీర్ణించుకోలేనిది. నేతలకు, అధికారులకు చెప్పిచెప్పి విసుగెత్తిన పాత్రి కేయులు చివరకు గాంధీ విగ్రహాలకు వినతిపత్రాలిచ్చి తమ నిరసన తెలియజేయడంతో తమ ఆందోళనను ఉధృతం చేయాలన్న కృతనిశ్చయాన్ని వెల్లడిరచారు. వర్కింగ్‌ జర్నలిస్ట్‌ సంక్షేమనిధి ద్వారా కేంద్రం చేసే ఆర్థిక సహాయం మొత్తాన్ని పెంచి, పథకాన్ని మానవీయ కోణంలో అమలు చేయాలని, జర్నలిస్టులకు అతీగతీలేని పెన్షన్‌ స్కీమ్‌ అమలు చేయాలని కోరడం తప్పేమీ కాదు. ఆ సమస్యలు అసాధ్యమైన వేమీ కాదు. రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ హామీమేరకు జీఎస్టీ, వెటరన్‌ జర్నలిస్టుల వయోపరిమితి, తదితర అంశాలపై సడలింపు ఉత్తర్వులు వెంటనే జారీచేయాలని, అక్రెడిటేషన్ల విషయంలో జరుగుతున్న తీవ్రజాప్యాన్ని నివారించి అర్హులైన పాత్రికేయులందరికీ అక్రెడిటేషన్‌ వెంటనే మంజూరు చేయాలని పాత్రికేయులు కోరుతున్నారు. రాష్ట్రంలో జర్నలిస్టుల పెండిరగ్‌సమస్యలపై ముఖ్యమంత్రి స్థాయిలో ఒక ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించి, వారి సమస్య లను పరిష్కరించి, పాత్రికేయుల పట్ల తమకు వివక్ష లేదని నిరూపించు కోవాల్సిన తరుణం ఆసన్నమైంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img