Friday, October 7, 2022
Friday, October 7, 2022

వామపక్షం ముందున్న లక్ష్యాలు

డి.రాజా
సీపీఐ ప్రధాన కార్యదర్శి

బీజేపీ` ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రభుత్వ కాలంలో మత, కుల ఆధారిత సామాజిక విభజనలు బాగా చోటుచేసుకున్నాయి. దేశ పురోభివృద్ధికి ఇవి తీవ్ర హానికరంగా తయారయ్యాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ దాని అనుబంధసంస్థలు ఎన్నికలలో ఓట్లు పొందటానికి సమాజాన్ని మతం ఆధారంగా విభజనకు గురిచేస్తున్నాయి. భీతి, ద్వేషం, చీలికలతో కూడిన వాతావరణాన్ని ఈ సంస్థలు సృష్టించాయి. డా॥బి.ఆర్‌.అంబేద్కర్‌ చెప్పిన కుల నిర్మూలన భావనను మను స్మృతిని అనుసరించే ఆర్‌ఎస్‌ఎస్‌ తిర్కరిస్తునది. కుల వారసత్వాన్ని, వివక్షను కోరుకునే బ్రాహ్మణత్వ భావజాలాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ కొనసాగిస్తూనే ఉంది. దాదాపు పూర్తిగా అగ్ర వర్ణాల నాయకత్వంలో పనిచేస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ దళితులపైన, గిరిజనులపైన అపరిమితంగా దాడులుచేస్తున్నది. డా॥అంబేద్కర్‌ ప్రతిపాదించిన విప్లవాత్మకమైన అజెండాపైన ఎలాంటి కార్యాచరణ లేకుండా ఇప్పటికీ కులవారసత్వంతోనే పనిచేయటం ముఖ్యమైన సమస్య. అన్ని సమస్యలపైన జరిపేపోరాటాల్లో కుల వ్యతిరేకశక్తులను వామపక్షం సమీకరించాలి.

ఆవిర్భావం తర్వాత దాదాపు శతాబ్ది కాలంగా భారతదేశ రాజకీయాల్లో కమ్యూనిస్టు ఉద్యమం ముఖ్యమైన పాత్రను పోషిస్తూ వస్తోంది. బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా, భారతదేశ సమాజంలో నెలకొన్న అసమానతలకు వ్యతిరేకంగా జరిగిన మహత్తర పోరాటాలలో వామపక్షం అగ్రభాగాన నిలిచింది. పోరాటాలకు ప్రగతిశీల భావజాలాన్ని అందించింది. స్వాతంత్య్రం అనంతరం కార్మిక వర్గం, రైతులు, యువత, విద్యార్థులు, మహిళా పోరాటాలకు కమ్యూనిస్టు ఉద్యమం నాయకత్వ పాత్ర నిర్వహించింది. ఇదే సమయంలో పార్లమెంటరీ రాజకీయాల్లో అత్యంత ముఖ్యమైన అంశాల్లో విలువైన సూచనలు అందించి సభ ఆమోదం పొందిన విశిష్ట నేతలు ఇంద్రజిత్‌గుప్తా, భూపేష్‌గుప్తా, గాతీముఖర్జీ లాంటి అనేక మంది కమ్యూనిస్టు ఉద్యమంతో మమేకమయ్యారు. దాదాపు వందేళ్ల కాలంలో భారత సమాజం అనేక కీలకమైన మథనాలకు గురై భారీ మార్పులు జరిగాయి. నిరంతరం ఆవిష్కృతమవుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా కమ్యూనిస్టు ఉద్యమ భవిష్యత్‌ కార్యక్రమాలను రూపొందించుకోవాలి.
స్వాతంత్య్రం అనంతరం ఏడు దశాబ్దాలకు పైగా గడిచినప్పటికీ పేదరికం, తీవ్రమైన అసమానతలు దేశాన్ని పట్టి పీడిస్తూనే ఉన్నాయి. గత కొద్ది సంవత్సరాలుగా సామాజిక పరిస్థితులు అధ్వానంగా తయారయ్యాయి. దాదాపు ప్రతి అభివృద్ధి సూచిక గణనీయంగా పడిపోయింది. ఉదాహరణకి ఆకలిసూచికతో సహా అనేక సూచికలపరిస్థితి దారుణంగాఉంది. సమాజంలోని సంపన్నవర్గాలవద్ద మితిమీరినసంపద కేంద్రీకృతమైంది. అదే సమయంలో కోట్లాది మంది దారిద్య్రంలో కూరుకుపోయారు. వీరికి ఎంత మాత్రం సమాన అవకాశాలు లేవు. కొవిడ్‌19 సంక్షోభ కాలంలో నిత్యం ఉధృత ప్రచారం చేసుకుంటున్న అభివృద్ధి అంతా అసమానతల స్వభావం కలిగిందని తేటతెల్ల మైంది. దేశం నలుమూలల పనుల నిమిత్తం వెళ్లిన వలస కూలీలు వేలాది మైళ్లు కాలినడకన ఇళ్లకుచేరుకునే దయనీయమైన పరిస్థతి ప్రజల హృదయాలను కలచివేసింది. ఇదే సమయంలో కేంద్రంలో పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వ ఆశ్రిత పెట్టుబడిదారులు లక్షలకోట్ల రూపాయల ప్రయోజనాలను పొందారు. ఈ నేపథ్యంలో మనపోరాటాలను సంపదపంపిణీపైన ప్రధానంగా కేంద్రీకరించాలి. ఇందు కోసం ప్రజారోగ్యం, విద్యారంగ మౌలిక సదుపాయాల కల్పనకు, వనరుల వివక్షారహితంగా వినియోగించి కోట్లాదిమంది ప్రజలను పేదరికం నుండి బయటపడ వేసేందుకు అధికారంలో ఉన్న ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలి. బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రభుత్వ కాలంలో మత, కుల ఆధారిత సామాజిక విభజనలు బాగా చోటుచేసుకున్నాయి. దేశ పురోభివృద్ధికి ఇవి తీవ్ర హానికరంగా తయారయ్యాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ దాని అనుబంధసంస్థలు ఎన్నికలలో ఓట్లు పొందటానికి సమాజాన్ని మతం ఆధారంగా విభజనకు గురిచేస్తున్నాయి. భీతి, ద్వేషం, చీలికలతో కూడిన వాతావరణాన్ని ఈ సంస్థలు సృష్టించాయి. డా॥బి.ఆర్‌.అంబేద్కర్‌ చెప్పిన కుల నిర్మూలన భావనను మను స్మృతిని అనుసరించే ఆర్‌ఎస్‌ఎస్‌ తిర్కరిస్తునది. కుల వారసత్వాన్ని, వివక్షను కోరుకునే బ్రాహ్మణత్వ భావజాలాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ కొనసాగిస్తూనే ఉంది. దాదాపు పూర్తిగా అగ్ర వర్ణాల నాయకత్వంలో పనిచేస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ దళితులపైన, గిరిజనులపైన అపరిమితంగా దాడులుచేస్తున్నది. డా॥అంబేద్కర్‌ ప్రతిపాదించిన విప్లవాత్మకమైన అజెండాపైన ఎలాంటి కార్యాచరణ లేకుండా ఇప్పటికీ కులవారసత్వంతోనే పనిచేయటం ముఖ్యమైన సమస్య. అన్ని సమస్యలపైన జరిపేపోరాటాల్లో కుల వ్యతిరేకశక్తులను వామపక్షం సమీకరించాలి.
కుల విభజనలు సమాజం దుర్బలతలకు గురైంది. ఈ పరిణామం సమాజ అభివృద్ధి పైన తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. హిందుత్వ వారసత్వం కింది కులాలుగా చూస్తున్న ప్రజలను తీవ్ర అవమానానికి గురి చేస్తుంది. హిందువులు అందరినీ ఐక్యపరిచేందుకు హిందు కులాల నుండే కార్యకర్తలను సమీకరించి తగిన భూమికను సృష్టించేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకత్వంలోని మితవాద శక్తులు ప్రయత్నిస్తున్నాయి. వీరి బూటకపు చర్యలను మనం తేటతెల్లం చేయాలి. అలాగే ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ బ్రాహ్మణత్వ దృక్పథాన్ని ఎండగట్టాలి. మహిళలను తక్కువగా చూస్తూ దేశ అభివృద్ధిలో వారు పాలుపంచుకోకుండా నిరోధించేందుకు దోహదం చేసే మనువాది ఎజెండాను అనుసరిస్తూ పితృస్వామ్య వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. మన ఎజెండాలో స్త్రీ, పురుష సమస్యలను చేర్చి నాయకత్వ పాత్రలో మహిళలను భాగస్వాములను చేసి పోరాటాలు జరపాలి. స్త్రీల పట్ల వివక్షకు వ్యతిరేకంగా మన గీతాముఖర్జీ లాంటి కామ్రేడ్స్‌ అనేక మంది పోరాటం జరిపారు. ఈ పోరాట బాటను మనం కొనసాగించాలి.
ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ పాలనలో ఈ తీవ్రమైన సమస్యలన్నీ నేడు దేశం ఎదుర్కొంటోంది. అది పేదరికం, అసమానత, కుల వివక్ష, మత విభజన లేదా స్త్రీ, పురుష సమస్యలు తదితరాలను కొనసాగించేందుకే ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ ఉదృతంగా పని చేస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్‌ విద్వేషపూరిత భావజాలం నిండి ఉన్న సమాజాన్ని చక్కదిద్దేందుకు, వివక్షాపూరితమైన నేటి పాలనను అంత మొందించేందుకు సమాజంలోని అన్ని ప్రగతిశీల, సెక్యులర్‌, ప్రజాస్వామ్య సమూహాలను కలుపుకుని మన పోరాటాలను నిర్వహించాలి. ఈ నేపథ్యంలో కీలక పాత్ర నిర్వహించడానికి, చారిత్రక బాధ్యతను నెరవేర్చేందుకు వామపక్షం సంసిద్ధం కావాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img