Monday, May 20, 2024
Monday, May 20, 2024

ఆర్‌ఎస్‌ఎస్‌ను ఆశ్రయించిన మోదీ

అరుణ్‌ శ్రీ వత్సవ

లోక్‌సభకు జరుగుతున్న ఎన్నికల్లో పోలింగ్‌తీరుపై ఆర్‌ఎస్‌ఎస్‌ తీవ్ర ఆందోళనచెందుతోంది. ఈసారి ప్రధాని నరేంద్ర మోదీ భవిష్యత్‌ రాముడి చేతుల్లో ఉందని విశ్వసిస్తున్నారు. అయితేపాపం రాముడి దీవెనలు మోదీపైనలేవని రెండుదశల్లో పోలైన ఓట్ల తీరు తెలియజేస్తోంది. ఈ విషయాన్ని గ్రహించిన మోదీ నాగపూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యా లయానికి ఆఘమేఘాలమీద చేరుకుని సంఫ్‌ు నాయకత్వం వద్ద తలవం చారు. మొదటి దశ ఎన్నికలు ముగిసిన ఏప్రిల్‌ 19రాత్రి ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు కొంతమందిని మోదీ కలుసుకుని మాట్లాడారు. ఎన్నికల నుంచి దూరంగా ఉంటున్న ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు కఠినంగా ఉన్నారని, బీజేపీ అభ్యర్థుల గెలుపుకోసం కృషిచేయాలని వారిని ఒప్పించాలని అభ్యర్థించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు లక్షకుపైగా అంకితభావంతో తమ కార్యకలాపాలు నిర్వహిస్తారు. చాలా సంవత్సరాలుగా ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు పోలింగ్‌ కేంద్రాలవరకు ఓటర్లను తీసుకురావడం, బీజేపీకి ఓట్లు వేయించడం చేశారు.
ఎన్నికల ప్రక్రియలో ఓటర్లను పోలింగ్‌ కేంద్రాలవద్దకు తీసుకొచ్చి ఓటుచేయించడం చాలా కీలకమైన అంశం. అనేక ఎన్నికల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు బీజేపీకి విజయాన్ని చేకూర్చారు. అయితే, 2004 లోక్‌సభ ఎన్నికల్లో ఎబి.వాజ్‌పేయి నాయకత్వంలో బీజేపీ పోటీ చేసినప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు వారి నాయకత్వం ఆదేశం మేరకు వాజ్‌పేయికి సహకరించలేదు. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు నరేంద్ర మోదీకి బాగా సహకరించారు. ఈ విషయంలో మోదీ అదృష్టవంతుడే. గుజరాత్‌ నుంచి మోదీని కేంద్రానికి తీసుకురావడంలో ఆర్‌ఎస్‌ఎస్‌ చాలా అనుకూలంగా వ్యవహరించింది. 2014 ఎన్నికల్లో మోదీని ఆర్‌ఎస్‌ఎస్‌ గెలిపించింది. జాతీయస్థాయిలో మోదీని నిలబెట్టి ప్రధానమంత్రి హోదాను ఆర్‌ఎస్‌ఎస్‌ కల్పించింది. అయితే నేడు ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకత్వం, కార్యకర్తలు మోదీకోసం కష్టపడేం దుకు సిద్ధంగా లేరు. ఎందుకంటే, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయానికి మోదీ దూరంగా ఉంటున్నారు. మోదీ ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకత్వాన్ని కలుసుకున్నప్పటికీ ఆయనకి పూర్తి హామీ లభించలేదని తెలుస్తోంది. ప్రత్యేకించి ఆర్‌ఎస్‌ఎస్‌`బీజేపీలకంటే తన నాయకత్వమే గొప్పదనే భావనలో మోదీ ఉన్నారు. ఒక వ్యక్తిగా అందరికంటే తానుగొప్పవాడిననే భావన మోదీకి ప్రబలంగాఉంది. సంఫ్‌ు నాయకత్వానికి దూరంగా మోదీ ఉంటున్నారని ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుడు మోహన్‌ భగవత్‌ భావిస్తున్నారు. అయితే భగవత్‌ మాత్రం మోదీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని తెలుస్తోంది. అంతేకాదు, మోదీని అదుపు చేయాలని ఆర్‌ఎస్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు కొందరు భగవత్‌ను కలుసుకుని చెప్పారని తెలుస్తోంది.
మోదీ నిర్వహించే కార్యకలాపాలతీరుపై ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకత్వం విసుగుచెందింది. చాలా అసంతృప్తితో ఆర్‌ఎస్‌ఎస్‌ ఉన్నది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమేనని ఆర్‌ఎస్‌ఎస్‌ అభిప్రాయపడుతోంది. ఆర్‌ఎస్‌ఎస్‌ శత వార్షికోత్సవాన్ని 2025లో నిర్వహించనున్నారు. 100 సంవత్సరాలుగా ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకలాపాలను నిర్వహించడం గొప్పవిజయం సాధించినట్లేనని భావిస్తున్నారు. ఇదిగొప్ప సందర్భమని కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారం చేసుకుంటోంది. అయితే ఓటమి తమ తలలపై ఉందని ఆర్‌ఎస్‌ఎస్‌ భావిస్తోంది. ఈసారి గెలుపు తప్పనిసరిగా ఉంటుందని చెప్పేస్థితిలో ఆర్‌ఎస్‌ఎస్‌ లేదు. ఎన్నికల్లో జరిగేనష్టం ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలపై ఎంతవరకు ప్రభావం చూపిస్తుందో అంచనా వేయవలసిందే…ఈ క్లిష్ట పరిస్థితి తెలిసినప్పటికీ మోదీ తనకార్యకలాపాల నిర్వహణ తీరును మార్చుకునేందుకు సిద్ధంగా లేరు. హిందు, ముస్లింల మధ్య చాలాకాలంక్రితంఉన్న వైరుధ్యం, ద్వేషం తదితర వ్యవహారాలను మోదీ కొనసాగించనున్నారు.
ఆర్‌ఎస్‌ఎస్‌ శతవార్షికోత్సవాలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నారు. ఈసారి ఎన్‌డీఏ 400సీట్లు గెలుచుకుంటుందని చాలా గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. వాస్తవానికి విరుద్ధమైన ఈ ప్రచారాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌కూడా సమర్థించడంలేదు. రెండేళ్లక్రితం భగవత్‌ తరువాత సంఫ్‌ులో రెండవస్థానంలోఉన్న దత్తాత్రేయ హొసబలి మోదీ నడకతీరుపై తీవ్ర ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చేశారు. 2021 మార్చి నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శిగా హొసబలి పనిచేస్తున్నారు. హొసబలి నుంచి మోదీ నేర్చుకుని తన శైలిని మార్చుకుంటారని సంఫ్‌ు నాయకులు ఆశించారు. అయితే మోదీ తననడకను, వ్యవహారశైలిని ఏ మాత్రం మార్చుకోలేదు. ఆర్‌ఎస్‌ఎస్‌ను పట్టించుకోకుండా తాను ప్రధానిగా తన ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారు. భగవత్‌ మినహా ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకత్వం మొత్తం మోదీని దూరంగా పెడుతున్నారు. ఒక విధంగా అసహ్యంగా చూస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ పనివిధానానికి అనుగుణంగా ఒక సీనియర్‌ నాయకుడిని బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడుగా ఏర్పాటుచేశారు. ఈ నాయకుడు ఆర్‌ఎస్‌ఎస్‌ తరఫున నేరుగా ప్రధానమంత్రితో మాట్లాడి సమస్యలను పరిష్కరించేందుకు నియమించారు. అయితే మోదీ ఈ పనివిధానాన్ని పట్టించుకోకుండా వదిలేశారు. దీనితో సంఫ్‌ు అమిత్‌షాతోటి సంప్రదించేందుకు ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటుచేసింది. అయితే ఇది ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులను అవమానించినట్లుగా ఈ సంస్థ అధికారాన్ని దిగజార్చినట్లుగా భావిస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ వర్గాలు చెప్పినదాన్ని విశ్వసించినట్లయితే భగవత్‌సైతం మోదీ తనను పట్టించుకోవడంలేదని భావిస్తున్నారు. అయితే ఈ విషయంలో భగవత్‌ మౌనంగా ఉంటున్నారు. మోదీ వ్యవహారసరళిని తిరస్కరించడంలేదు.
భగవత్‌ మోదీతో సంప్రదించే విషయంలోనూ ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు ఏ మాత్రం అంగీకరించడంలేదు. సంఫ్‌ు ప్రయోజనం దృష్టిలో ఉంచుకుని సీనియర్‌ నాయకులు కూడా మౌనంగా ఉంటున్నారు. అనేక సందర్భాలలో ఆర్‌ఎస్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు మోదీని నాగపూర్‌కి పిలిపించాలని భగవత్‌ని కోరారు. మోదీకి వ్యతిరేకంగా భగవత్‌ ఉండకపోవడానికి ఒకే కారణం ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370 రద్దు, రామాలయ నిర్మాణం లక్ష్యాన్ని మోదీ నెరవేరుస్తున్నందున మౌనంగా ఉన్నారు. ఈ పదేళ్లపాలనలో మోదీ వాస్తవంగా ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండాను, అన్నికార్యకలాపాలను హైజాక్‌ చేశారు. అయితే మోదీ చేసిన విజ్ఞప్తిని ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు అంగీరించే స్థితిలోలేరు. మోదీ పట్ల భగవత్‌ గుడ్డిగా విశ్వాసాన్ని కలిగిఉండటం ఇతర నాయకులు కూడా ఈ వ్యవహారాన్ని సందేహించేట్లుగా ఉన్నది. 2024 జనవరి 22న రామాలయంలో అన్ని కార్యక్రమాలను మోదీ నిర్వహించగా, కేవలం భగవత్‌ అక్కడ ఉన్నారు. దేశవ్యాప్తంగా అన్ని టెలివిజన్‌లలోనూ బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రత్యక్షప్రసారంలో వీక్షించారు. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యకలాపాలు చూసేందుకు మోదీ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. రామాలయంలో బాలరాముడి ప్రాణప్రతిష్ట తదితర పూజాకార్యక్రమాలను భగవత్‌ నిర్వహించడానికి ఎందుకు అవకాశం ఇవ్వలేదని ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు ప్రశ్నిస్తున్నారు. బీజేపీ గెలవడానికి దేశవ్యాప్తంగా హిందువులు అందరికీ గట్టిసందేశాన్ని పంపించాలని ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు అంటున్నారు. ఎన్నికల ప్రక్రియనుంచి ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు దూరంగా ఉండడంవల్లనే మొదటి దశ ఎన్నికలు తక్కువ ఓటింగ్‌ జరిగింది అని ఆర్‌ఎస్‌ఎస్‌వర్గాలు చెబుతున్నాయి. అయితే బీజేపీ ఘోరంగా ఓడిపోవాలని ఈ సంస్థ నాయకత్వం భావించలేదు. ఇకపై జరగనున్నఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు ఎన్నికల పోరాటంలో పాల్గొనవచ్చునని అనుకుంటున్నారు. ఈ పోరాటంలో తప్పనిసరిగా గెలవాలన్న దృఢనిశ్చయంతో పాల్గొంటారన్న హామీ ఏమీలేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img