Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఎస్సీ, ఎస్టీలపై దౌర్జన్య నిరోధక చట్టం ఎవరి కోసం?

కరవది సుబ్బారావు

రాజ్యాంగం అమలులోకి వచ్చి 72 సంవత్సరాలు నిండుతున్నా ఇప్పటికీ ఎస్సీ, ఎస్టీలపై దాడులు, దౌర్జన్యాలు, మహిళలపై హత్యలు, అత్యాచారాలు తగ్గకపోగా రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. వారికున్న కొద్దిపాటి వ్యవ సాయ భూములను కూడా దోచుకుంటున్నారు. అన్యాయాన్ని ఎదిరించేం దుకు ఉన్న అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పూను కోవడంతో దీనిని సవాల్‌ చేస్తూ కొందరు సుప్రీంకోర్టును అశ్ర యించారు. ప్రజాగ్రహం అనంతరం ఆ చట్టాన్ని యథావిధిగా కొన సాగిస్తున్నారు కానీ ఇందంతా కేవలం కాగితాలకే పరిమితమైంది.

ఏ లక్ష్యంతో అయితే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని తీసుకువచ్చారో దానిని నెరవేర్చటంలో, అమలు చేయ టంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవ హరిస్తున్నాయి. చివరకు ప్రభుత్వాలే తమ అననూయుల కోసం అను కూలంగా మారుస్తూ చట్టానికి కొత్త భాష్యాలు చెబుతున్నాయి. అట్రాసిటీ చట్టం అమలు చేయాల్సిన పోలీస్‌ యంత్రాంగం అధికార పార్టీల నాయకుల చేతుల్లో పావుగా మారి అపహాస్యానికి గురవుతోంది. గ్రామీణ ప్రాంతాలలో దళితుడు తనకు హక్కుగా రావాల్సిన ఫలాలను కూడా పొందలేకపోతున్నారు. అధికార బలం, రాజకీయ ప్రాబల్యం, అగ్రవర్ణ, కుల బలంతో కొందరు దళితులను బానిసలుగా చూడటం, వారిని వేధింపులకు గురిచేయటం, వారికి రావాల్సిన ఫలాలను దక్కనీయకుండా చేయటం, వారిని కట్టుబానిసలుగా చూడటం తమ హక్కుగా భావిస్తున్నారు. చివరకు దీనినే అస్త్రంగా చేసుకుని దళిత మహిళలపై అత్యాచారాలకు, హత్యలకు, దాడులకు పాల్పడు తున్నారు. రాష్ట్రంలో, దేశంలో రక్షణకరువైంది. ప్రధానంగా బాధితుని ఫిర్యాదు తర్వాత అనేక ఒత్తిళ్ల అనంతరం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినప్పటికీ, అరెస్టులు చేయటంలో జాప్యం చేస్తున్నారు. రెండు, మూడు నెలల తర్వాత తూతూ మంత్రంగా అరెస్టు చేసినట్లు, వెంటనే స్టేషన్‌ బెయిన్‌ ఇచ్చి బయటకు పంపినట్లు రికార్డులలో నమోదు చేస్తూ పోలీసులు నేరగాళ్ల పక్షాన నిలుస్తున్నారు. చివరకు నిశ్చేష్టులవ్వడం బాధితుల వంతవుతోంది.
దేశంలో ఎస్సీ, ఎస్టీలకు రక్షణగా నిలిచేందుకు 1955లో పౌర హక్కుల చట్టానికి సంబంధించిన మార్గదర్శకాలను అప్పటి ప్రభుత్వం తీసుకువచ్చింది. అయితే దీంతో కూడా సక్రమంగా రక్షణ కల్పించలేక పోతున్నామనే ఉద్దేశంతో 1977లో దీనికి పూర్తి స్థాయి సవరణలతో చట్టం చేస్తూ జిఓను విడుదల చేసింది. ఈ చట్టం అమలులో కూడా చాలా లోపాలను గుర్తించిన దళితులు ఉద్యమ బాట పట్టారు. చేసేది లేక చివరకు ప్రభుత్వం 1989లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చింది. దీనిమార్గదర్శకాలు తీసుకు వచ్చేందుకు 1995 వరకు ప్రభుత్వం సమయం తీసుకుంది. ఈ చట్టం సక్రమంగా అమలవుతుందో లేదో చర్చించేందుకు రాష్ట్రంలో, జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిఘా, పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేయవలసి వుండగా ప్రభుత్వాలు ఇప్పటివరకు రాష్ట్ర స్థాయిలో కమిటీని వేయకపోవటం అట్రాసిటీచట్టం ఎలాఅపహాస్యం అవుతోందో తెలియ జేస్తోంది. జిల్లా కమిటీ లలో కూడా జిల్లా అధికారులతో పాటుగా అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులతో కమిటీలు వేయటం వల్ల ఈ కమిటీ కేవలం సమావేశాలకు మాత్రమే పరిమితమవుతూ చట్టాల అమలును విస్మరిస్తున్నాయి. చివరకు చట్టం ఎవరి కోసం పనిచేస్తుందో కూడా అర్థం కాని పరిస్థ్ధితులు గ్రామీణ ప్రాంతాలలో నెలకొన్నాయంటే ఈ కమిటీలు ఏం పని చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. కులవివక్షను తగ్గించేందుకు జస్టిస్‌ పున్నయ్య రాష్ట్ర మంతా తిరిగి రూపొందించిన 42 సిఫార్సులు, 18 జిఓలను ప్రభుత్వం అమోదించినప్పటికీ, అమలు చేయలేదు. దీంతో ప్రజలు జస్టిస్‌ పున్నయ్య సిఫార్సులు కొన్ని దళితులకు అండగా ఉన్నాయన్న సంగతినే మరిచారు.
రాజ్యాంగం అమలులోకి వచ్చి 72 సంవత్సరాలు నిండుతున్నా ఇప్పటికీ ఎస్సీ, ఎస్టీలపై దాడులు, దౌర్జన్యాలు, మహిళలపై హత్యలు, అత్యాచారాలు తగ్గకపోగా రోజురోజుకూ పెరిగిపోతు న్నాయి. వారికున్న కొద్దిపాటి వ్యవసాయ భూములను కూడా దోచు కుంటున్నారు. అన్యాయాన్ని ఎదిరించేందుకు ఉన్న అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పూనుకోవడంతో దీనిని సవాల్‌ చేస్తూ కొందరు సుప్రీంకోర్టును అశ్రయించారు. ప్రజాగ్రహం అనంతరం ఆచట్టాన్ని యథావిధిగా కొనసాగిస్తున్నారు కానీ ఇందంతా కేవలం కాగితాలకే పరిమితమైంది. రాష్ట్రంలో అనేక దౌర్జన్యాలు, దాడులు జరుగుతున్నా చట్టం సక్రమంగా అమలు కావటంలేదు. సుప్రీంకోర్టు 41`ఎ నోటీసు ఇచ్చిందని, దీని ద్వారా స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చే అవకాశం తమకుఉందంటూ పోలీసువ్యవస్థ పూర్తిగా నిందితుల పక్షాన నిలుస్తుండడంతో బాధితులు మరింతగా కుంగిపోతున్నారు.
గత ప్రభుత్వ హయాంలో పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రు గ్రామంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ విగ్రహాన్ని గ్రామ సెంటర్‌లో ఏర్పాటు చేస్తే దానిని నిర్థ్ధాక్ష్యిణ్యంగా అక్కడ నుండి గ్రామ పెత్తందారులు తీసివేయించారు. ఈ విషయంలో కలెక్టర్‌ ఆజ్ఞలను కూడా గ్రామంలో అగ్రవర్ణాల వారు లెక్కచేయలేదు. చివ రకు చట్టాన్ని రక్షించాల్సిన ఎమ్మెల్యే కూడా పెత్తందార్లకు మద్దతుగా నిలిచారు. కుల వివక్షను తగ్గించేందుకు అత్యాచార నిరోధక చట్టం సమాజానికి ఎంతో అవసరం. ఈ చట్టం అమలు చేయకపోవటం అంటే దళిత, గిరిజనులను అవహేళన చేయడమే. వారు అభద్ర తకు గురవుతున్నారు. ప్రభుత్వంలో ఒక భాగంగా ఉన్న పోలీసు వ్యవస్థ ప్రజలందరికీ ఒకే విధమైన రక్షణ కల్పించాలి తప్ప ధన వంతులకు, అగ్రవర్ణాల పెత్తందారులకు అనుకూలంగా వ్యవహరిం చటం ఎంత మాత్రం సమంజసం కాదు. దళితులను అవమానాల నుండి, దాడుల నుండి రక్షించుకోవటానికి ఎన్నో పోరాటాలు చేసి కొత్త చట్టాలను తెచ్చుకుంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు వీరి రక్షణకు ఉపయోగ పడకుండా చట్టాలను నిర్వీర్యం చేయడం శోచనీయం. దళితులు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించు కుని తమకు ఇష్టమైన నాయకుడిని ఎన్నుకునేలా అనుకూల వాతా వరణం కల్పించి, రాజ్యాంగ పరంగా వారి హక్కులకు పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు రక్షణ కల్పించినప్పుడే వివక్ష రహిత సమాజం ఏర్పడుతుంది.
వ్యాస రచయిత దళిత హక్కుల పోరాట సమితి
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, 7898530894

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img