Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

జపాన్‌, బ్రిటన్‌లో తీవ్ర ఆర్థిక మాంద్యం

అంజన్‌రాయ్‌

గతంలో బలమైన ఆర్థిక వ్యవస్థగా ఉన్న జపాన్‌ ప్రస్తుతం ఆర్థికమాంద్యంలోకి దిగజారిపోయిందని అధికారికంగా ప్రకటించింది. గత రెండు త్రై మాసికాలుగా జీడీపీ కుంచించుకుపోయింది. బ్రిటన్‌కు గతంలో ఉన్న ఘనత పాలిపోయింది. భారీ ఆర్థికరంగం కృశించిపోతోంది. క్రమంగా మాంద్యంలో పడిపోయిన బ్రిటన్‌ ఆర్థికరంగం ప్రధాని రిషి సునాక్‌ ప్రభుత్వం ఆనుసరించే ఆర్థిక విధానాలను ప్రశ్నిస్తు న్నారు. జపాన్‌ సమస్యలన్నీ జనాభా తగ్గిపోవడంలోనే ఉంది. వేగంగా జనాభా తగ్గిపోతున్నందున ఈ సమస్యను అధిగమిం చేందుకు వివిధ మార్పులు చేస్తోంది. పారిశ్రామిక రంగంలో గడిచిన సంవత్సరాల్లో జపాన్‌ ఆధిపత్యస్థాయిలో ఉంది. వయస్సు మళ్లిన వారి సంఖ్య పెరుగుతుండటంతో స్థానిక డిమాండ్‌ పడిపోతూఉంది. అలాగే స్థానిక వినిమయం గత ఏడాదికాలంగా దాదాపు 1శాతం పడిపోయింది. జపాన్‌ కరెన్సీ యెన్‌ విలువ తరిగిపోతూ ఉంది. గత ఏడాదికాలంగా అమెరికా డాలర్‌తో పోలిస్తే యెన్‌ విలువ 6.6శాతం తగ్గిపోయింది. జపాన్‌ దిగుమతి చేసుకుంటున్న ఆయిల్స్‌, గ్యాస్‌ మూలంగా ధరలు పెరిగిపోతున్నాయి. ప్రపంచదేశాలలో కూడా ధరలు పెరుగు తూనే ఉన్నాయి. దిగుమతి చేసుకుంటున్న ఆహారవస్తువులు మొత్తం వినిమయంలో 63శాతం ఉన్నాయి. అందువల్లనే జపాన్‌ యెన్‌ వినిమయదారులమీద తాజాగా అధిక ధరలను మోపు తున్నది.
ప్రపంచంలో జర్మనీ, ప్రస్తుతం జీడీపీలో మూడవ ఆర్థికవ్యవస్థగా ఉన్నది. అదే సమయంలో జర్మనీ తీవ్రంగా అనేక రంగాలలో అనిశ్చితిలో ఉంది. అలాగే జర్మనీ ఆర్ధికవ్యవస్థ దాదాపు ఎక్కువగా ఎగుమతులపైనే ఆధారపడిఉన్నది. ప్రధా నంగా ఆటోమొబైల్స్‌పైన ఆధారపడుతున్నప్పటికీ, చైనా ఆటో మొబైల్‌ తయారీదారులు ముప్పుగా పరిణమించారు. ప్రపంచం అత్యంత వేగంగా ఎలక్ట్రిక్‌ వాహనాలవైపు మళ్లుతున్నందున జర్మనీ భారీ కార్ల తయారీ సంస్థ ఎలక్ట్రిక్‌ ఉత్పత్తులకు మార డానికి అంతగాతగిన పరిశ్రమకాదు. ఇంటర్నల్‌ కంబస్టన్‌ ఇంజన్లనుండి ఎలక్ట్రిక్‌ వాహనాలకు మారడం అంత తేలికకాదు. ఇంధనం నిలువ ఉండటానికి ఎలక్ట్రిక్‌ కార్ల డిమాండ్‌ మేలైన టెక్నాలజీ. ఈ సాంకేతికతకు ప్రత్యేకమైన లోహాలు అవసరమవ ుతాయి. జర్మన్‌ ఆటోమొబైల్‌ పరిశ్రమ ఇంతవరకు నిలిచి కొనసాగడానికి మేలైన సాంకేతికత ప్రధానకారణం. ఈ దేశాల్లో రెండు సమస్యలున్నాయి. మిత్రులైన కార్మికవర్గం లేకపోవడం ప్రధానంగా తీవ్ర సమస్య. మౌలికమైన సాంకేతికలు జర్మనీకి లోపంగాఉంది. ఈ దేశాలు సాంకేతికతలలో వేగంగా పాతబడ పోితున్నాయి. అందువల్లనే కార్మికుల తరుగుదల ఎక్కువగా ఉంది. ఈ దశలో వలసలను సులువుగా అనుమతించడం ద్వారా తరుగుదలను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నారు. జర్మనీ వైస్‌ చాన్సలర్‌ ఎంజిలా మర్కెల్‌ ఈ సమస్యను అధిగమించేందుకు ప్రత్యేకించి సరళమైన వలసవిధానాన్ని అనుమతించారు. అయితే స్థానికుల సెంటిమెంటు ప్రతికూలతను పెంచింది. ఫలితంగా మితవాద పార్టీలు ఏర్పడ్డాయి. ఈ సెంటిమెంటు ఇతరదేశాల్లో కంటే జర్మనీలో చాలా ఎక్కువగా ఏర్పడిరది. సమస్యను అధిగమించేందుకు మర్కెల్‌ సరసమైన ఖనిజవాయువుపైన రష్యానుంచి ఎగుమతి అయ్యే ఇతర ఇంధనాలపై ఆధారపడ్డారు. అలాగే అణువిద్యుత్‌ ప్లాంట్లను దాదాపు అన్నింటని మర్కెల్‌ నిలివిపేశారు. రష్యా ఆయిల్స్‌ సరఫరాలపై ఎక్కువగా ఆధార పడ్డారు. తాజాగా రష్యా తిగుమతులన్నింటినీ రద్దు చేయడంతో ఇంధనసంక్షోభం తీవ్రతరమైంది. ఫలితంగా ఆర్ధికవ్యవస్థ సంక్షోభంలోకి జారీ చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img