Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

బీజేపీ హిందూ వ్యతిరేక పార్టీ

బండ్ల శ్రీనివాస్‌, నెల్లూరు నరసింహారావు, నలమాటి లక్ష్మణరావు

ఇది ఎన్నికల సమయం. బీజేపీ కేంద్రంలో వరుసగా మూడవసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. స్వతంత్ర భారతదేశంలో మునుపెన్నడూ చూడని విధంగా ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం పెట్టుబడి దారులకు అక్రమ మార్గాలలో సహాయం చేసింది, దేశంలో సంపద, ఆదాయ అసమాన తలను పెంచింది. సామాన్య ప్రజల జీవనో పాధిని నాశనం చేసింది. ముస్లింల భయం, రామరాజ్యంపై ఆశలు, నకిలీ విశ్వ గురుపై గుడ్డి విశ్వాసం కలిగించటం వంటి చౌకవ్యూహాలద్వారా ఉత్తర భారతీయ హిందువుల మనస్సులను బీజేపీ మరింతగా స్వాధీనం చేసుకుంది. ఓట్లను రాబట్టేందుకు మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టి 2024 ఎన్నికలలో గెలవాలని ప్రయత్నిస్తోంది.
కాబట్టి, ఈ మతతత్వ ఫాసిస్ట్టు బీజేపీ తిరిగి కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకోకుండా ఆపిమన దేశాన్ని, ప్రజలనురక్షించుకునే సమయం ఆసన్నమైనది. ప్రతిపక్ష పార్టీలు రాజకీయ ప్రయోజనాలను ఆశించి ఎన్నికల ప్రచారంలో హిందుత్వ, రామ మందిరం, మతధ్రువీకరణ, ఫాసిజం గురించి మాట్లాడితే ఇంకా ఎక్కువ మంది హిందువులు బీజేపీ గుప్పిట్లోకి చేరవచ్చు, తద్వారా బీజేపీ తిరిగి అధికారంలోకి రావచ్చు. అందువలన, హిందుత్వ రాముడి గురించి మాట్లాడే బదులు, బీజేపీ తాము హిందువులపార్టీ అని పైకిచెప్పుకుంటున్నప్పటికీ, బీజేపీ హిందూ వ్యతిరేక పార్టీ అనే నిజమైన దృక్పథాన్ని ప్రజలకు అందించాలి. అందువల్ల, 100 సంవత్సరాలుగా సంఫ్‌ు పరివార్‌ చర్చిస్తున్న మతానికి సంబంధించిన విషయాల నుండి, జాతీయ చర్చను, బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా భారతీయులందరిపై, ముఖ్యంగా 110 కోట్లకుపైగా ఉన్న అమాయక హిందువులపై, చేసిన ఆర్థిక విధ్వంసం వైపు దృష్టి మళ్లించాలి. భారతదేశంలో ఆర్థిక అసమానతలపై ఆక్స్‌ఫాÛమ్‌ – 2022 నివేదికలో చెప్పిన ప్రకారం, దేశంలోని మొదటి 1% మంది సంపన్నులు జాతీయ సంపదలో 42.5%, 10% మంది సంపన్నులు 77% కలిగున్నారు. అయితే, దిగువ 50% ప్రజలు కేవలం 2.8% సంపద మాత్రమే కలిగున్నారు. 2021 లో ఉన్నతస్థానంలో ఉన్న మొదటి 1% మంది ధనికుల సంపద 46శాతం పెరగ్గా, దిగువ 50 శాతం ప్రజల సంపద 3శాతం మాత్రమే పెరిగింది. ఇటు వంటి దయనీయ పరిస్థితిలోనూ, 90శాతం భారతీయులను ఆర్థికంగా ఇబ్బంది పెట్టి అత్యంత సంపన్నులైన మొదటి10శాతం మందిని మరింత సంపన్నం చేసేందుకు బీజేపీ ప్రభుత్వం 2014 నుండి కృషి చేస్తోంది. ఈ దుర్మార్గమైన ఆర్థిక విధానాల ద్వారా కూడగట్టుకున్న అపఖ్యాతిని కప్పిపుచ్చడానికి, బీజేపీ 80:20, అంటే దేశ జనాభాలో80% హిందువులు, 20% మైనారిటీలు, అనే దుర్బుద్ధితో కూడిన ఒకవిభజన ఆలోచనను ముందుకు తెచ్చింది. అంతే కాకుండా ద్వేషం, హింస, చట్టాల ద్వారా దేశాన్ని మతపరంగా ధృవీకరించి, అధిక సంఖ్యలో ఉన్న హిందువుల ఓట్లను తమకు అనుకూలంగా రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ మతతత్వం, ఫాసిజం, చట్టాలు, విధానాలు, నిర్ణయాలు మైనారిటీలను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా నాశనం చేయడమే కాకుండా, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేద, నిరుపేద హిందువుల ఆర్థిక స్థితిని, జీవనోపాధిని కూడా నాశనం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎస్సీల, ఎస్టీల, ఓబీసీల, రైతుల, కార్మికుల, యువత, మహిళల, వయో వృద్ధుల జీవితాలను బీజేపీ తుంగలో తొక్కింది. గత దశాబ్దంలో హిందువుల (అగ్ర 10% మినహా) జీవితాలను మెరుగు పరిచేందుకు బీజేపీ కృషి చేస్తున్నట్లుగా చేసే వాదనలు కేవలం అపోహలు మాత్రమే. నిజానికి, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అన్ని ప్రభుత్వాల కంటే ఎక్కువ మంది హిందు వులను పేదరికంలోకి నెట్టింది. ఈ బీజేపీ ప్రభుత్వమే. బీజేపీ ప్రభుత్వం హిందు వులకోసం పని చేస్తుందని చేసేప్రచారం ఒక బూటకపు కథనం. వాస్తవంగా బీజేపీ ఒక ‘‘హిందూ వ్యతిరేక’’ పార్టీ. బీజేపీ నకిలీ కథనాన్ని తిప్పి కొట్టడానికి అవసరమైన వాస్తవాలతో కూడిన కథనం క్రింద వివరించబడిరది: జాతీయ ఆస్తులన్నీ వివిధ సమూహాలకు వారి జనాభా శాతం ప్రకారం చెందినవని భావిస్తే, బీజేపీ ప్రభుత్వం గత దశాబ్దంలో పెట్టుబడిదారులకు అప్పగించిన పన్ను చెల్లింపుదారుల ప్రతి100 రూపాయలలో, జాతీయ ఖనిజాలలో, అటవీ వనరులలో, ప్రజా మౌలిక సదుపాయాల ఆస్తులలో, 80 రూపాయలకంటే లేదా 80శాతం ఆస్తులకంటే ఎక్కువ హిందువులకు చెందినవని, 20 రూపాయలు కంటే లేదా 20శాతం ఆస్తుల కంటే తక్కువ మైనారిటీలకు చెందినవని అర్థమవుతుంది. భారతదేశంలో మైనారిటీలు వారి జనాభా శాతంతో పోలిస్తే అసమానంగా తక్కువ ఆర్థికస్థితిని, ఆస్తులను కలిగి ఉన్నారు. దీంతో బీజేపీ ప్రభుత్వచర్యలు హిందువులకు ఎక్కువ ఆర్థిక నష్టాన్ని కలిగించినట్లు నిరూపణ అవుతోంది. ప్రభుత్వరంగ సంస్థలను, మౌలిక సదుపాయాలను, అన్యాయంగా, తక్కువ ధరలకు ప్రైవేటీకరించడం. లీజుకు ఇవ్వడంవల్ల, ఈ సామాజిక ఆస్తుల్లో 80 శాతం వాటా కలిగిన హిందువులకు ఎక్కువ నష్టం జరుగుతుంది. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ, ప్రధానంగా, ఎస్సీ,ఎస్టీ,ఒబిసిల ఉపాధిని దెబ్బతీస్తుంది. ఎందుకంటే, కొనుగోలుచేసే ప్రైవేటు సంస్థలకు ఉద్యోగాలలో రాజ్యాంగ బద్ధంగా నిర్దేశించిన రిజర్వేషన్లను అమలు చేయాల్సిన బాధ్యత ఉండకపోవచ్చు. తద్వారా బీజేపీ హిందువుల జీవనోపాధికి తీవ్రమైన హాని చేస్తుంది.
ప్రభుత్వరంగ బ్యాంకుల నుంచి పెట్టుబడిదారులు తీసుకున్న రూ.15.4 లక్షల కోట్ల రుణాలను బీజేపీ ప్రభుత్వం మాఫీ చేసింది. ఈ మొత్తాలు దిగువ, మధ్య తరగతి, వేతనజీవుల కష్టార్జితం. అంతేకాకుండా, నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులకు పన్ను చెల్లింపుదారుల సొమ్ముతో మూలధనాన్ని సమ కూర్చింది. ఈ రెండు చర్యలవలన నష్టపోయిన వారిలో 80శాతం ప్రజలు హిందువులే. ‘‘నోట్ల రద్దు’’ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగాన్ని, చిన్న వ్యాపారాలను నాశనం చేసింది. లక్షలాది దిగువ, మధ్యతరగతి, పేద ప్రజలు ఉద్యోగాలు కోల్పోయారు. అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్నారు. వారిలో 80శాతం మంది హిందువులు. అయితే, ఈ ప్రక్రియ వలన ‘‘నల్ల ధనం’’ వెలికి తీయలేదని రద్దు చేసిన నోట్లన్నీ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకి తిరిగి రావడంవలన నిరూపణ జరిగింది. దేశంలోని ఎక్కువసాగు భూమి హిందూ రైతుల యాజమాన్యంలో ఉంది, లక్షలాది హిందూ కౌలు రైతులే సాగు చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వ ‘‘నల్ల వ్యవసాయ చట్టాలు’’ హిందూ రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టి కార్పొ రేట్‌లకు లబ్ధి చేకూర్చే లక్ష్యంతో ఉన్నాయి. పెరిగిన ముడి సరుకుల ఖర్చులు, సరిపోని రుణ సదుపాయాలు, ప్రకృతి వైపరీత్యాలు, సహాయపడని బీమా పథకం, ధరల అస్థిరత హిందూ రైతుల ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. ప్రభుత్వం కార్పొరేట్‌ పన్నులను 30శాతం నుండి 22శాతానికి తగ్గించటం వలన పెట్టుబడిదారులకు లాభం, ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం జరిగింది. అయితే, అదనపు పెట్టుబడులుగాని, కొత్త ఉద్యోగాల కల్పనగాని జరగలేదు తద్వారా, యువత అనేక విధాలుగా నష్టపోయింది. బీజేపీ ప్రభుత్వం జీఎస్‌టీ పరిధిని, రేట్లను పెంచి దోపిడీ పన్ను విధానం అవలంబిస్తోంది. ఆరోగ్యం, విద్యా రంగాలను విస్మరించిందిబీ పేదల ఉపాధి పథకాలకు నిధులను తగ్గిం చింది. కొత్త లేబర్‌ కోడ్‌లతో పారిశ్రామిక వేత్తలకు సహాయంచేసి కార్మికులకు హాని కలిగించింది. నిత్యావసర వస్తువులైన కిరాణా, ఇంధనం, గ్యాస్‌, వివిధ సేవలైన రవాణా, విద్యుత్‌ ధóరలను పెంచి మధ్య, దిగువ, పేద వర్గాలను దెబ్బతీసింది. మైనారిటీలు, దళిత మహిళలపై నేరాలు పెరిగాయి. పైన వివ రించిన ప్రభుత్వ చర్యల బాధితుల్లో 80శాతం హిందువులే. పైన వివరించిన బీజేపీ ప్రభుత్వచర్యలు, సంపన్నులను మిన హాయించి, మైనారిటీలకు అన్ని రకాలుగా దేశ జనాభాలో 80% ఉన్న హిందువులలోని ప్రతి వర్గానికి ఆర్ధికంగా, తీవ్రమైన హాని కలిగించింది. అయితే, బీజేపీ యావత్‌ ప్రపంచానికి తమ పార్టీ ‘‘హిందూ అనుకూల పార్టీ’’ అని చెప్పుకుంటోంది. ఈ నేపథ్యంలో, హిందువులు మాత్రమే అధికారంలోఉన్న బీజేపీ (బీజేపీలో ముస్లింలు అధికార స్థానాల్లో లేరు) హిందువులకే అపారమైన హానిని కలిగిస్తున్న విషయం దిగ్భ్రాంతికరం. తద్వారా, బీజేపీ ‘హిందూ వ్యతిరేక’ పార్టీ అని నిస్సందేహంగా నిర్ధారణ అయింది. కాబట్టి, బీజేపీ ప్రభుత్వ ఫాసిజానికి, మతతత్వానికి, ‘‘హిందూ వ్యతిరేక తత్వానికీ’’ వ్యతిరేకంగా శక్తివంతంగా కలిసి పోరాడుదాం, మన దేశాన్ని, ప్రజలను, కుల మత వివక్ష లేకుండా కాపాడు కుందాం. విద్యావంతులు, మేధావులు, దేశభక్తులు, పౌర సమాజ సమూహాలు, ప్రతిపక్ష పార్టీలు ఈ ప్రయత్నంలో ఒక ముఖ్య భూమిక పోషించవలసిన అవ సరముంది.1984లో జార్జ్‌ ఆర్వెల్‌ చిత్రీకరించిన డిస్టోపియన్‌ సమాజంగా మన ప్రియమైన భారతదేశం మారకుండా చూసుకుందాం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img