Friday, April 26, 2024
Friday, April 26, 2024

రైతులపై దాడితో హర్యానా బీజేపీలో వణుకు

అరుణ్‌ శ్రీవాస్తవ

కర్నాల్‌లో జరిగిన ఘటన, ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీల కిరాతక చర్యకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై దేశవ్యాప్త ఉద్యమాన్ని నిర్వహించాలని తికైత్‌ పిలుపునిచ్చారు. రైతుల మహత్తర పోరాటం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ప్రపంచంలోనే అనేక ప్రాంతాల నుంచి రైతుల పోరాటానికి మద్దతు లభించింది. కొవిడ్‌`19 మహమ్మారి వల్ల అన్ని రంగాలు సంక్షోభంలో పడితే దేశ ప్రజలను ఒక్క వ్యవసాయ రంగమే కాపాడిరది. ఈ వాస్తవాన్నైనా మోదీ ఆయన మితవాద బీజేపీ ఇప్పటికైనా గ్రహించాలి.

అమృత్‌సర్‌లో పునర్నిర్మాణం చేసిన జలియన్‌వాలాబాగ్‌ కాంప్లెక్స్‌ను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభిస్తున్న సమయంలోనే ఆయన సన్నిహిత స్నేహితుడు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ ఆదేశాల మేరకు పోలీసులు రైతులపై దాడిచేసి చితక్కొట్టారు. రైతుల తలలు రక్తం చిందించాయి. వచ్చే ఏడాది జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై రైతుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని, తమకు వ్యతిరేకంగా రైతులు పనిచేస్తారని రాష్ట్ర బీజేపీ వణికిపోతున్నది. పోలీసుల హింసలో ఒక రైతు చనిపోగా, 20 మంది రైతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఖట్టర్‌ ముందుగా వేసుకున్న పథకం మేరకే ఈ హింస చోటు చేసుకున్నదని భావిస్తున్నారు. పోలీసుల దాడితో తనకేమీ ప్రమేయం లేదని ఖట్టర్‌ బొంకుతున్నారు. శాంతి భద్రతలను కాపా డేందుకు పోలీసులు కఠినంగానే వ్యవహరిస్తారని వారిని ఖట్టర్‌ సమర్థిస్తు న్నారు. రైతులు శాంతియుతంగా జరుపుతున్న ప్రదర్శనపైన పోలీసు అధికారి ఆధ్వర్యంలో పోలీసులు రైతులపై విరుచుకుపడ్డారు. హర్యానా బీజేపీ నాయ కులను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో రైతుల ప్రదర్శనలు, సమా వేశాలను జరగనివ్వకుండా చూడాలని ఖట్టర్‌ పథకం వేసుకున్నారు. పోరాటం చేస్తున్న రైతులు ఏనాడూ హింసకు పాల్పడలేదు.
కర్నాల్‌లో జరిగిన హింసాత్మక దాడికి ఖట్టర్‌ రూపొందించిన పథకమే కారణమని స్పష్టమైంది. ఆయన ఆదేశం మేరకు జూనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఎడిఎం రైతులను చితకబాదండి అని పోలీసులను ఆదేశిస్తున్న వీడియో క్లిప్పింగ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. తమకు రెండు రోజులుగా నిద్రలేదని కొంత విశ్రాంతి తీసుకున్న తర్వాత తగినంత పోలీసు బలగంతో వచ్చామని, రైతు ర్యాలీని ముందుకు వెళ్లనివ్వబోమని పోలీసు అధికారి, ఇతరులు మాట్లాడిన మాటలు వీడియోలో రికార్డయ్యాయి. ప్రదర్శన చేస్తున్న వారి తలలను పగలకొట్టేందుకు సీనియర్‌ ఐఎఎస్‌ అధికారే సాహసించడు. అలాంటిది జూనియర్‌ అధికారి ఈ పని చేశాడంటే నమ్మలేము. ఉప ముఖ్యమంత్రి దుష్యంత్‌ చౌతాలా రైతులపై దాడి తనను తీవ్రంగా బాధిం చిందని, ఇందుకు కారకుడైన అధికారిని ప్రభుత్వం శిక్షిస్తుందని చెప్పిన మాటలే దాడి వెనుక ఖట్టర్‌ ఉన్నాడని అర్థమవుతుంది. ఖట్టర్‌ మాట మారు స్తున్నాడు. చౌతాలా చెప్పిన దానిపై ఖట్టర్‌ మౌనం వహించాడు. అధికారిపై చర్య తీసుకోవాలంటే జిల్లా యంత్రాంగం జరిగిందేమిటో అంచనా వేయాలి, శాంతి భద్రతలను అజమాయిషీ చేసే డీజీపి ఈ అంశాన్ని పరిశీలిస్తున్నా డంటూ ఖట్టర్‌ తప్పించుకుంటున్నాడు. రైతులను చితకబాదిన ఘటన మరో జలియన్‌వాలాబాగ్‌ దుర్ఘటన లాంటిది. ఖట్టర్‌ మోదీతో కలసి ఆర్‌ఎస్‌ఎస్‌లో పని చేసేటప్పుడే ఇద్దరూ సన్నిహితంగా ఉండేవారు.
ప్రదర్శనల వల్ల ఏమీ ప్రయోజనం ఉండదని రైతులు తెలుసుకోవాలి అంటూ, రైతులపై కఠినమైన ఆంక్షలు పెట్టాలని వారి నుంచే తనకు ఫోన్‌లు వచ్చినట్లు ఖట్టర్‌ చెప్పుకుంటున్నారు. పైగా తాను సంయమనం పాటించినట్టు మాట్లాడుతున్నారు. రైతులను తప్పుదారి పట్టిస్తున్నదని పంజాబ్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు. నాకు స్వేచ్ఛ ఉందని ఎవరు ముక్కు మీదనైనా నేను కొడితే అది స్వేచ్ఛ అవుతుందా! అని ప్రశ్నిస్తున్నాడు. స్వేచ్ఛకు పరిమితులున్నాయని చెప్తూ రైతులపై ఆగ్రహం ప్రకటించాడు. నల్లజెండాలు ప్రదర్శించటానికి, తమ అభిప్రాయాలు చెప్పటానికి రైతులకు అవకాశం ఉంటుంది గాని హింసకు పాల్పడరాదని సూక్తులు చెబుతున్నాడు. రైతులు ప్రశాంతంగా ప్రద ర్శన చేశారనేది వాస్తవం. కర్నాల్‌లో తన హెలికాప్టర్‌ను దిగేందుకు కూడా అనుమతించలేదని చెప్పారు. అక్కడే హెలికాప్టర్‌ దిగాలని నేను పట్టుబట్టి నట్లయితే పోలీసులు తమ శక్తిని ఉపయోగించేవాళ్లు అప్పుడేమయ్యేది? అంటూ వాస్తవాలను మరుగు పరిచాడు. సుప్రీంకోర్టు వెల్లడిరచిన అభి ప్రాయాలను కూడా ఖట్టర్‌ పరిగణ లోకి తీసుకోలేదు. నిరసన తెలిపేందుకు ప్రజలకు హక్కు ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఖట్టర్‌ మాత్రం నియంతలా వ్యవహరిస్తున్నాడు. పోలీసులపై చేసిన దాడిని సమర్థించుకుంటున్నాడు.
మిక్కిలి ప్రతిష్ఠ కలిగిన నాయకుడు, గవర్నర్‌ సత్పాల్‌ మాలిక్‌ కూడా ఖట్టర్‌ చర్యను ఖండిరచారు. దాడికి ఆదేశించిన అధికారిపైన క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని సత్పాల్‌ మాలిక్‌ కోరారు. కార్యనిర్వాహక వర్గం చర్యను నిర్వచిస్తూ, ఎలా పరిపాలించాలనేది తనకే తెలిసినట్టుగా ఖట్టర్‌ మాట్లాడు తున్నాడు. రైతులను రెచ్చగొట్టి హింసను సృష్టించేందుకు ఖట్టర్‌ పథకం పన్నాడు. అయితే తెలివిగా ఆర్‌ఎస్‌ఎస్‌, ఖట్టర్‌ల వలలో పడకుండా రైతులు దూరంగా ఉన్నారు. తమపై దాడి చేసినందుకు నిరసనగా దేశంలో రైతులు తిరుగుబాటు చేసి ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉంటుందని ఒక విభాగం మీడియా ఆందోళన వ్యక్తం చేసింది. రైతు పోరాటాన్ని అణచివేయాలన్న లక్ష్యంతోనే ఖట్టర్‌ ఇలాంటి చర్యకు పాల్పడ్డాడు. సివిల్‌ అధికారి అయుష్‌సిన్హా రైతులపై దాడిచేసి వారి తలలు పగలకొట్టించారని ఆయన ‘‘ప్రభుత్వ తాలిబన్‌ కమాండర్‌గా’’ వ్యవహరించాడని రైతు నాయకుడు రాకేష్‌ తికైత్‌ విమర్శిం చారు. తమను ఖలిస్తానీలని పిలుస్తున్నారు, మమ్మల్ని ఖలిస్తానీలని మాట్లాడితే ప్రభుత్వ తాలిబన్‌లు ఈ దేశాన్ని ఆక్రమించుకున్నారని మేము చెప్పగలము అని తికైత్‌ అన్నారు. కర్నాల్‌లో జరిగిన ఘటన, ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీల కిరాతక చర్యకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై దేశవ్యాప్త ఉద్యమాన్ని నిర్వ హించాలని తికైత్‌ పిలుపునిచ్చారు. రైతుల మహత్తర పోరాటం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ప్రపంచంలోనే అనేక ప్రాంతాల నుంచి రైతుల పోరా టానికి మద్దతు లభించింది. కొవిడ్‌`19 మహమ్మారి వల్ల అన్ని రంగాలు సంక్షోభంలో పడితే దేశ ప్రజలను ఒక్క వ్యవసాయ రంగమే కాపాడిరది. ఈ వాస్తవాన్నైనా మోదీ ఆయన మితవాద బీజేపీ ఇప్పటికైనా గ్రహించాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img