Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

విచారణకు రాని ఎన్నికల బాండ్లు

నిత్య చక్రవర్తి
ఎన్నికల బాండ్ల వ్యవహారం ఎటూ తేలకుండా ఇంకా సుప్రీంకోర్టులోనే ఉన్నది. 2022 జులై 110 తేదీల వరకు 21వ సారి ఎన్నికల బాండ్ల విక్రయం జరిగిపోయింది. ఎన్నికల బాండ్లను సవాలు చేస్తూ ఏప్రిల్‌లో దాఖలయిన పిటీ షన్‌ను ఇంతవరకు విచారణకు చేపట్టలేదు. విచారణకు పిటీషన్‌ను స్వీకరించిన తరవాత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌.వి.రమణ ఈ కేసును మూడు నెలల తరువాత విచారణ చేస్తామని హామీ ఇచ్చారు. ఇంతవరకు విచారణ జరగలేదు. గత ఏప్రిల్‌ 1 నుంచి 10వ తేదీ వరకు కూడా ఎన్నికల బాండ్ల విక్రయం జరిగింది. తాజాగా జరిగిన విక్రయంతో సహా పాలక పార్టీ బీజేపీ బాండ్ల విక్రయం ద్వారా వచ్చే మొత్తంలో 75 శాతానికి పైగా దక్కించుకుంటోంది. ఈ మొత్తాన్ని ఎన్నికల్లో గెలవ డానికి లేదా ఇతర పార్టీల ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఉపయోగిస్తున్నారని సర్వత్రా విమర్శ ఉన్నది. ఇందుకు తాజా ఉదాహరణ మహా రాష్ట్ర. గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర స్థాయి పార్టీలు 20202021 వార్షిక ఆడిట్‌ నివేదికలను సమర్పించాయి. 201718 నుండి లభించిన ఎన్నికల బాండ్ల విక్రయ సమాచారాన్ని గమనిస్తే 20202021లో మాత్రమే బాండ్ల విక్రయం తక్కువగా జరిగింది. ఈ సంవత్సరంలో బీజేపీ అత్యధికంగా ఎన్నికల బాండ్ల విక్రయం వల్ల ప్రయోజనం పొందింది. మొత్తం 6,900 కోట్లు బీజేపీికి లభించిందని వెల్లడయ్యింది. బీజేపీి తర్వాత వైఎస్‌ఆర్‌సీపీ, డీఎంకెే, బీజేడీ పార్టీలు ఉన్నాయి. ప్రధాన న్యాయ మూర్తి సుప్రీంకోర్టు రాజ్యాంగానికి బద్దమై ఉంటుందని ఇటీవల శాన్‌ఫ్రాన్సిస్‌కోలో మాట్లాడుతూ చెప్పారు. ఈ స్ఫూర్తిని తీసుకుని ఎన్నికల బాండ్లను సవాలు చేస్తూ దాఖలయిన పిటీషన్‌ను వేగంగా విచారణ జరపాలి. లేకపోతే ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేసేందుకు పాలక పార్టీ దీన్ని అవకాశంగా తీసుకుంటుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img