London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Tuesday, October 22, 2024
Tuesday, October 22, 2024

ఎస్‌బీఐ కుంటిసాకు

నిత్య చక్రవర్తి

ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడిరచడానికి జూన్‌ 30వ తేదీ వరకు అనుమతి ఇవ్వాలని భారతీయ స్టేట్‌బ్యాంకు (ఎస్‌బీఐ) సుప్రీంకోర్టుకు చేసిన విజ్ఞప్తి ఆర్థిక మంత్రిత్వశాఖ, పాలకపార్టీని కాపాడేందుకు చేసిన ప్రయత్నం. ఎన్నికల బాండ్లు ప్రవేశపెట్టడమే నేరమని సుప్రీంకోర్టు తీర్పుచెప్పింది. ఆయా రాజకీయపార్టీలు బ్యాంకు నుంచి బాండ్ల ద్వారా తీసుకున్న డబ్బు వివరాలు మార్చి 6వతేదీ లోపు వెల్లడిరచాలని సుప్రీంకోర్టు ఎస్‌బీఐని ఆదేశించింది. అయితే గడువు పొడిగించాలని సుప్రీంకు ఎస్‌బీఐ చేసిన వినతి బీజేపీ ప్రభుత్వాన్ని రక్షించేందుకు బ్యాంకు వేసిన నీచమైన ఎత్తుగడ. అతి పెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్‌బీఐ. బ్యాంకింగ్‌ వ్యవస్థలో ఎస్‌బీఐకి గర్వించగదగిన డిజిటల్‌ వ్యవస్థ ఉంది. ఇంతవరకు కొనుగోలుచేసిన బాండ్ల వివరాలు మార్చి 6వ తేదీలోపు ఎన్నికల కమిషన్‌కు తెలియజేయాలని ఫిబ్రవరి 15వ తేదీన సుప్రీంకోర్టు ఎస్‌బీఐని కోరింది. అలాగే అన్ని వివరాలు ఈ సంవత్సరం మార్చి 13వ తేదీ నాటికి ఎస్‌బీఐ వెబ్‌సైట్‌లో ఉంచాలని సుప్రీంకోర్టు కోరింది. ఎన్నికల బాండ్ల పథకాన్ని 2017లో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇతర రాజకీయపార్టీలు ఎన్నికల బాండ్లను తిరస్కరించాయి. పెద్దనోట్ల రద్దును సైతం ప్రతిపక్షపార్టీలు వ్యతిరేకించాయి. తనకు కూడా తెలియదని రిజర్వుబ్యాంకు కూడా ప్రకటించింది. ప్రధాని మోదీ తమ ప్రభుత్వ ప్రయోజనంకోసం సొంతంగా నిర్ణయం తీసుకొని ప్రకటిస్తున్న విషయం ప్రజలకు తెలిసిందే. ఎన్నికల బాండ్ల కొనుగోలు పథకం రాజ్యాంగ నియమ నిబంధనలు ఉల్లంఘించినట్లవుతుందని సుప్రీంకోర్టు రద్దుచేసింది. అయితే ఎస్‌బీఐ కుంటిసాకుతో బాండ్లకు సంబంధించిన వ్యవహారాలు తెలియజేసేందుకు జూన్‌ 30వరకు గడువుకోరింది. ఆచరణాత్మకమైన ఇబ్బందులున్నాయని, డీకోడిరగ్‌ కార్యకలాపాలకు సమయం కావాలని, వివరాలు సక్రమంగా నిర్వహించలేదని, జూన్‌ 30వరకు సమయం కావాలని కోరింది. ఈలోపు ఏప్రిల్‌, మే నెలల్లో లోక్‌సభ ఎన్నికలు ముగిసిపోతాయి. మోదీకి కావలసిన పనులు అయిపోతాయి.
22,217 ఎన్నికల బాండ్లను కొనుగోలు చేశారు. వీటి వివరాలను 20రోజుల్లోపు అతిపెద్ద బ్యాంకింగ్‌ వ్యవస్థ కలిగిఉండికూడా తెలియజేయలేకపోవడం అత్యంతం హాస్యాస్పదం. వివరాలు తెలియజేయడానికి జూన్‌ 30వరకు అంటేదాదాపు 4నెలలు సమయం కావాలని కోరడంలో ఆంతర్యం ఏమిటో తెలియాలి. నరేంద్ర మోదీ ప్రభుత్వంలోని ఎస్‌బీఐ యాజమాన్యం ఆర్థికశాఖ కోరడం వల్లనే సమయం కావాలని కోర్టుకు విజ్ఞప్తి చేసిందని భావించాలి. జనవరి 30వ తేదీ బహుశ ఈ ప్రభుత్వానికి అలాగే బ్యాంకుకు గొప్ప పవిత్రదినం కాబోలు. బ్యాంకుకోరిన సమయానికి లోకసభ ఎన్నికలు పూర్తవుతాయి. అలాగే ఈ ఏడాది మే 3వ వారానికి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకూడా అయ్యే అవకాశం ఉంది. జూన్‌ 30నాటికి ప్రభుత్వ కార్యకలాపాలు కూడా ప్రారంభమవుతాయి. మార్చి 13వ తేదీనాటికి సుప్రీంకోర్టు కోరినట్లుగా బాండ్లు కొనుగోలు చేసినవారి పేర్లు వెబ్‌సైట్‌లో ఉంచినట్లయితే ఇచ్చిపుచ్చుకున్న వారి పేర్లు వెల్లడవుతాయి. బాండ్లు కొనుగోలుచేసిన సంపన్నులు ప్రభుత్వంనుంచి ప్రయోజనం పొంది ఉండవచ్చు. ఇలాంటి అవకాశం ఉండవచ్చునని కోర్టుకూడా వ్యాఖ్యానించింది. రాహుల్‌గాంధీ తన న్యాయయాత్రలో ఎన్నికల బాండ్లద్వారా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆశ్రిత పెట్టుబడిదారులకు మధ్య గట్టి బంధాలు ఏర్పడతాయి అని అన్నారు. మార్చి 13నాటికి బాండ్ల వివరాలు వెల్లడైనట్లయితే ఇండియాకూటమికి లోకసభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఎంతగానో ప్రయోజనం కలగవచ్చు. బీజేపీ కుట్రలు, కుయుక్తులపైన ఇండియా కూటమి తీవ్రంగా విమర్శించవచ్చు.
ఫిబ్రవరి 15వ తేదీన సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి బాండ్లు కొనుగోలు చేసినవారికి ఎన్నికల్లో పోటీకి సీట్లు దక్కి ఉండవచ్చు. బాండ్లు కొనుగోలు చేసినవారు ప్రభుత్వ విధానాలపైన ప్రభావం చూపించవచ్చు. ఆర్థిక సహాయం చేసిన వారు ప్రభుత్వం నుంచి సహాయం పొందవచ్చు. పాలకులకు, బాండ్ల కొనుగోలుచేసిన వారి మధ్య సన్నిహితమైన అక్రమ సంబంధాలు ఏర్పడి రెండుపక్షాల వారు ప్రయోజనం పొందుతారు. ఏమైనా ప్రభుత్వానికి ప్రయోజనం కలిగేవిధంగా వివరాలు తెలియజేయడానికి నాలుగు నెలల సమయం కావాలని కోరడం కుంటిసాకు మాత్రమే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img