London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Friday, October 18, 2024
Friday, October 18, 2024

భారతీయ పురాణ పాత్రల మూలాలు ఈజిప్టులో ఉన్నాయా?

డాక్టర్‌ దేవరాజు మహారాజు

సృష్టి మొదలైన నాటి నుంచి వేద సంస్కృతి ఈ పవిత్ర భారత దేశంలో పరిఢవిల్లుతూ ఉందని, ఈ దేశం ప్రపంచానికి జ్ఞానాన్ని ప్రసాదించిందని చెప్పుకునే మాటలు కాసేపు పక్కనపెట్టి ఆలోచిద్దాం. ఈ దేశం ప్రపంచానికి ఇచ్చిందా లేక ప్రపంచం నుంచి ఈ దేశమే కొన్ని సంగతులు గ్రహిస్తూ వచ్చిందా విశ్లేషించుకుందాం. ప్రపంచమంతా ఒకటే అయినప్పుడు, కొన్ని విషయాలు అటు నుంచి ఇటు, మరికొన్ని ఇటు నుంచి అటూ వెళ్ళి ఉంటాయి. ఎవరైనా సరే, ముందు ఆ విషయం ఒప్పుకుని తీరాలి. మన సింధూ నాగరికతకు ముందు, సమాంతరంగా ప్రపంచంలో అనేక నాగరి కతలు వర్థిల్లాయి. కాల విభజన ప్రకారం ఏది ఎప్పుడు పరిఢవిల్లిందో సులభంగానే గ్రహించుకోవచ్చు. ఇబ్బంది లేదు. నైలునది పరివాహక ప్రాంతంలో ఉన్న ఈజిప్టు దేశంలో 3100 బిసిఇ నుంచే నాగరికత ప్రారంభమైంది. మరో రెండు, మూడు వందల సంవత్సరాల తర్వాత గానీ, ఈ దేశంలో సింధూ నాగరికత (33001300 బిసిఇ) ప్రారంభం కాలేదు. ప్రపంచానికి జ్ఞానాన్ని అందించామని చెప్పుకునే వేద సంస్కృతి 1500500 బిసిఇ మధ్యకాలంలో వెలుగులోకి వచ్చింది. సరే, ఇక ఇప్పుడు ఒకసారి ప్రాచీన ఈజిప్టు సంస్కృతిలోకి వెళ్ళి, ఆనాటి వారి విశ్వాసాలు, భావనలు ఎలా ఉండేవో చూద్దాం! వారు రూపకల్పన చేసుకున్న దేవుళ్ళు, మన దేశంలోని వైదిక ప్రభోదకులకు ఏమైనా ఉపయోగపడ్డాయో లేదో గమనిద్దాం! అతి పురాతన ఈజిప్టు దేవుళ్ళలో ముఖ్యమైనవాడు ‘రా’ .. ఒక్కోసారి ‘రే’ అని కూడా పిలుస్తారు. క్రీ.పూ. 2524 శతాబ్దాలలో రూపకల్పన జరిగిన వాడు. ఆకాశాన్ని, భూమిని సకల చరాచర జగత్తును పాలించేవాడుగా గుర్తించారు. రాఅంటే సూర్యుడు. ఆకాశ దేవుడి పేరు హారస్‌. బహుశా ‘హారిజన్స్‌’ అనే పదం హారస్‌ నుండే వచ్చి ఉంటుంది. అలాగే సృష్టికర్త అయిన ‘రా’ వైదిక ధర్మంలో ‘బ్రహ్మ’గా మారి ఉంటుంది. ఒక్కోసారి రాహారస్‌లు కలిపి రాహారక్షిగా వ్యవహరించారు. అన్ని జీవరాసులు రా వల్లనే ఉద్భవించాయనీ, మనుషులు రాస్వేదంతోను, కన్నీళ్ళతోనూ పుట్టారని ఆనాటి ఈజిప్టు ప్రజలు భావించారు. అందుకే తమను తాము ‘సూర్యుడి పశువులు’ (జa్‌్‌శ్రీవ శీట Ra) గా భావించుకుంటూ ఉండేవారు. ఇలా అనేక కల్పనలు, భావనలు వారికి ఉండేవి. తమనూ, ఇతర ప్రాణులనూ సూర్యుడే (రా) పుట్టించాడన్న ఈజిప్షియనుల భావాన్ని మన పూర్వీకులు కూడా అనుసరించారు. మన సంప్రదాయ కవులు రాసిన ‘ఎవ్వనిచే జనించు జగమెవ్వని’ పద్యం ఒక ఉదాహరణ! రా దేవతల రారాజుగా భావించుకున్న ఈజిప్షియన్లు అతనిని ఒక మనిషి ఆకారంలోనే ఊహించుకున్నారు. మనిషికి గద్ద జాతికి చెందిన ఒక పక్షి తల ఉన్నట్లుగా భావించుకున్నారు. మనిషిలాగా ఉన్న భాగాన్ని అటుమ్‌ (A్‌బఎ) అని, పక్షి ఆకారపు తలను ఖెప్రి (ఖష్ట్రవజూతీఱ) అని అనేవారు. బహుశా వైదిక ధర్మంలోని ‘ఆత్మ’ ఈ అటుమ్‌ అనే శబ్దం నుండే రూపొందించుకుని ఉండొచ్చు. పక్షి తల మీద గుండ్రటి సోలార్‌ డిస్క్‌ ఉండి మళ్ళీ దాని పైన తాచుపాము ఉంటుంది. గ్రహణ సమయంలో సూర్యుణ్ణి చంద్రుణ్ణి పాము మింగేస్తుందన్న ఆలోచన, వైదిక ధర్మబోధకులకు ‘రా’ చిత్రపటం చూసిన తర్వాత కలిగి ఉంటుంది. రాషు (గాలి దేవుణ్ణి), టెప్నట్‌ (తేమ దేవతని) ఇంకా ఇతర దేవతల్ని సృష్టించాడు. రా కు ముగ్గురు కుమార్తెలు 1.బాస్పెట్‌ 2.హథోర్‌ 3.షెక్‌మెట్‌. వీరిలో షెక్‌మెట్‌ను మండే సూర్యనేత్రంగా భావించేవారు. రా ఆధిపత్యాన్ని అంగీకరించని వారిని లేదా తప్పులు చేసినవారిని రాతన షెక్‌మెట్‌తో కాల్చేయిస్తాడు. రక్షించాలన్నా, శిక్షించాలన్నా షెక్‌మెట్‌ చేయాల్సిందే. రా మెత్తబడి ఎవరినైనా దయా దాక్షిణ్యాలతో కరుణించాలంటే తన కూతురు హథోర్‌ ద్వారా చేసేవాడు. ఆమె ప్రేమకు ప్రతినిధి. ఇక బాస్టెట్‌ ఒక కారుణ్యమూర్తి. రా (సూర్యుడు) మిలియన్‌ సంవత్సరాల పడవలో ప్రయాణిస్తూ ఉంటాడు. ఇందులో మళ్ళీ రెండు పడవలుంటాయి. ఉదయపు పడవ, రాత్రి పడవ. రాత్రి పడవలో ప్రయాణిస్తున్నప్పుడు దాన్ని ‘అండర్‌ వరల్డ్‌ ఆఫ్‌ ఈజిప్టు’గా ఈజిప్షియన్లు భావిస్తారు. ఈ పడవలో రా ప్రయాణిస్తున్నప్పుడు అతనితో పాటు ఇతర దేవ తలు కూడా వెంట ఉంటారు. సియా (ూవతీషవజ్‌ూఱశీఅ), హు, హెకా (జశీఎఎ aఅస) మొదలైనవారు. ఎపోఫిస్‌ (ప్రళయం సృష్టించే దేవుడు) పెద్ద సర్పాకారంలో ఉంటాడు. ప్రతిరోజూ రాత్రి సూర్యుడి పడవకు అడ్డుపడతాడు. సూర్యుడు కనబడ కుండా పోయినప్పుడు ఆయన కింది లోకంలో ఉండి, దుష్టశక్తులతో పోరాడు తుంటాడని ఈజిప్షి యన్లు భావిస్తారు. అప్పుడు ఆయనను ఎఫ్‌ (Aట) అనిగానీ, ఎఫూ (Aటబ) అని గాని పిలుచుకుంటారు. కింది లోకంలో ఉన్నప్పుడు రా ఒసిరిస్‌ (ూంఱతీఱం) తో ఐక్యమయ్యాడని తలుస్తారు. ఒసిరిస్‌ అంటే మృత్యు దేవత. ఏది ఏమైనా, పన్నెండు గంటల తర్వాత సూర్యుడు మళ్ళీ జన్మిస్తాడు. సూర్యోదయాన్ని వాళ్ళు అలా ‘సూర్యుడు మళ్ళీ జన్మించాడన్నట్టుగా భావిస్తారు.
ఈజిప్షియనుల భావనలు, విశ్వాసాలు అంత మామూలుగా ఏమీ లేవు. చాలా సంక్లిష్టంగా ఉన్నాయి. అయినా కొంత సారాంశాన్ని గ్రహించడానికి కొన్ని ముఖ్యమైన విషయాలు ఎత్తి చెప్పాను. అప్పటికి ఇంకా శతాబ్దాలు, దశాబ్దాలు, సంవత్సరాలు వంటి పదాలు రూపొందలేదు. కానీ, వారు కాల విభజనని సూర్యుడి మొదటి డైనాస్టీ, రెండో డైనాస్టీ అంటూ విభజించుకుంటూ పోయారు. కాలం గడుస్తున్న కొద్దీ పిరమిడ్లు, సమాధులు రూపొందుతూ వచ్చాయి. సమాధుల మీద రాతలు రాయడం ఎక్కువైంది. సర్వశక్తి సంపన్నుడైన సూర్యుడు (రా) తమ విన్నపాల్ని ఎప్పుడో చనిపోయిన తమ పూర్వీకులకు చేరవేస్తాడని వారి భావన. సూర్యుడు రాత్రి పడవనెక్కి ప్రతిరోజూ కింది లోకాలు తిరిగి, మళ్ళీ తూర్పున జన్మి స్తున్నాడు కదా! అందుకని, ఎవరు ఏ లోకంలో ఉన్నా అందరినీ రా కలుపు కుంటాడని వారి నమ్మకం. తమ సందేశాల్ని తమ పూర్వీకులకు అందిస్తాడని ఆశ. పిరమిడ్ల మీద, సమాధుల మీద రాసే రాతలు అందుకే. లండన్‌లో పెట్రీ మ్యూజి యం ఆఫ్‌ ఈజిప్షియన్‌ ఆర్కియాలజీలో అతి పురాతన ఈజిప్టు శిలలు భద్రపరిచి ఉన్నాయి. వాటిమీద ఆనాటి చిత్రాలు, రాతలు అలాగే ఉన్నాయి. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి, పరిశోధించిన పరిశోధకులు అనేక విషయాలు తెలియ జేశారు. వాటిలో ఏవో కొన్నిమాత్రమే నేనిక్కడ ప్రస్తావించాను. ఆసక్తి ఉన్నవారు అంతర్జాలంలో వెతికి మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు. వేదకాలం నాటికివిగ్రహారాధనలో సూర్యునికి ఆధారం ఈజిప్టు సంస్కృ తిలో లభించింది. సూర్యుణ్ణి ప్రకృతి ప్రసాదించిన ఒక శక్తిగా గుర్తించారు. ఆ శక్తిని ప్రసన్నం చేసుకోవడానికి ఇక్కడ వీరు సంధ్యా వందనం ప్రారంభిం చారు. రామ్‌ అంటే సూర్యుని వలన పుట్టినవాడు అని అర్థం. సీత్రే అంటే సూర్యుని పుత్రిక అని అర్థం. బౌద్ధుల జాతక కథల ప్రకారం దశరథుడు కాశీకి రాజు. అయోధ్యకు కాదు. రామ, లక్ష్మణ, సీత ముగ్గురూ దశరథుడి మొదటి భార్యకు పుట్టిన తోబుట్టువులు. రెండవ భార్య గయ్యాళి. ఆమె నుంచి తన మొదటిభార్య పిల్లలను రక్షించుకోవడానికి దశరథుడు వారిని హిమా లయాలకు పంపిస్తాడు. 12 సంవత్సరాల తర్వాత వారు రాజ్యానికి తిరిగి వస్తారు. సీతాపహరణం ఈ కథలో లేదు జాతక కథలలో వలె, ఉన్నది ఉన్నట్టుగా కాక, పాత్రలు, వాటి విధానాలు, నడవడీ కొద్దిగా మార్చుకుంటూ మనువాద హిందూ పురాణాలు రాసినట్లు ఆధారాలు దొరుకుతున్నాయి. ఈజిప్టు కథల్లోని పాత్రలకు, భారతీయ హిందూ పురాణ పాత్రలకూ పోలికలు ఉన్నాయి. వరాహావతారాన్ని పోలిన పాత్ర ఈజిప్టు పురాతన గాథలలో ఉంది ‘సేథ్‌’ ఒక భారీ వరాహ రూపాన్ని తీసుకుని రే ముందుకువస్తాడు. యుద్ధంలోరే(సూర్యుడు) హారస్‌ కళ్ళల్లోకి చూస్తున్నప్పుడు, సేథ్‌, హారస్‌ కంటిని గాయ పరుస్తాడు. హారస్‌(ఆకాశదేవుడి) కన్ను బంగారురంగు లోకి మారుతుంది. అప్పుడు ‘హిరణ్యాక్షుడు’ అని అంటారు. అంటే బంగారు కన్ను గలవాడు అని అర్థం! పురాణాల్లోని విష్ణుమూర్తికి, ఈజిప్టు దేవుడు ‘నన్‌’కు పోలికలున్నాయి. రిచర్డ్‌ విల్కిన్సన్‌ ప్రకారం ప్రళయం నుంచి భూగోళాన్ని ఎత్తే ఈజిప్ట్‌ దేవుడు ‘నన్‌’ను, హిందువుల వరాహావతారంతో పోల్చవచ్చునన్నాడు. రిచర్డ్‌ హెచ్‌. విల్కిన్సన్‌ అమెరికన్‌ రచయిత, ఈజిప్టు తవ్వకాలపై 25 ఏళ్ళు పరిశోధనలు చేసిన ఆర్కియాలజిస్ట్‌సృష్టి కొనసాగించడానికి అంతరాయం ఏర్పడుతుంది. భూమి సముద్రంలో మునిగిపోతుంది. అప్పుడు ఈజిప్టు దేవుడు భూమిని పైకి తీస్తాడు. మునిగిపోతున్న పడవను పైకెత్తుతాడు. ఇది మహా విష్ణువు మత్స్యావతారానికి దగ్గరగా ఉంది. ‘సేషత్‌’ ` ప్రాచీన ఈజిప్టు దేవత. రచన, సంగీతం, ఊహాశక్తి, గణితం, ఖగోళశాస్త్రం, నిర్మాణ శాస్త్రం వంటివన్నీ ఆమె ఆధీనంలో ఉంటాయని అక్కడి జనుల విశ్వాసం. ఆమె మధురంగా శ్రావ్యంగా గానం చేసినప్పుడు భూమి దేవుడు చలించిపోయి, పారవశ్యంలో కరిగినప్పుడు భూగర్భ జలాలు ఏర్పడ్డాయని ఈజిప్షియనుల నమ్మకం. ఈ ఈజిప్టు ‘సేషత్‌’కు భారతీయ వైదికధర్మంలోని చదువుల తల్లి సరస్వతికి చాలా దగ్గరి పోలికలు కనిపిస్తున్నాయి.ఈజిప్టు సంస్కృతి,నాగరికతలు అతి పురాతనమైనవి. వారి సంస్కృతీ సంప్రదాయాలు, పురాణాలు భారతీయ హిందూపురాణాల కన్నా పాతవి. అలాగే పాళీభాషలో ఉన్న బౌద్ధుల రచనలన్నీ సంస్కృతంలో రాసిన హిందూ పురాణాల కన్నా పాతవి. అంటే ఈ విషయాల వల్ల తేలేది ఏమిటీ? పాత వాటి ప్రభావం తరవాత వచ్చిన వాటి మీద తప్పకుండా ఉంటుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. ప్రపంచమంతాఒక్కటి. మానవజాతిఅంతా ఒక్కటే గనక, ఒక ప్రాంతపు ప్రభావం మరోప్రాంతంపై పడడమన్నదిసహజం. అలా దేవుళ్ళను రూపొందించు కోవడంలో కూడాజరిగే ఉంటుంది. అందులో ఆశ్చర్యం లేదు. నిజాయితీగా ఒప్పుకోవడంతోనే మానవీయ విలువలకు గౌరవం పెరుగుతుంది. ఆదిమజాతుల విశ్వాసాలు, భావనలు ఏ ప్రాంతానివి అయినా ప్రాథమికంగానే ఉంటాయి. అక్కణ్ణించి మనిషిఎదుగుతూ వస్తున్నాడు. సమాజాన్ని ముందుకు తెస్తున్నాడు. ఎదిగినసమాజంలో ఇంకా కొందరుఎదగకుండా మిగిలిపోతున్నారు. అలాంటి వారుఎప్పుడూ మనకు ఆదర్శంకాదు. ఎదుగుతున్న మనిషే మనకు ఆదర్శం!!
వ్యాస రచయిత సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img