Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ముగ్గురు బేహారుల గుప్పిట లక్షద్వీప్‌

సుశీల్‌ కుట్టి

లక్షద్వీప్‌ అనేక అందమైన దీవులతో కూడిన ద్వీపం. పగడపు జీవుల దిబ్బలు వందలు, వేల సంవత్సరాలుగా పర్యాటకులను అలరిస్తున్నాయి. అంతేకాదు, ఈ పగడాల దిబ్బలు పర్యావరణానికి ఎంతగానో తోడ్పడతాయి. అలాంటి అందమైన ప్రాంతాలను కాంక్రీట్‌ జంగిల్స్‌గా మార్చివేసేందుకు ముగ్గురు గుజరాతీ బేహారులు పూనుకున్నారు. ఈ దీవుల ప్రత్యేకతను పరిరక్షించుకునేందుకు ‘‘సేవ్‌ లక్షద్వీప్‌ ఫోరం’’ ఏర్పడిరది. తమ భవిష్యత్తును నాశనం చేయవద్దని ఇక్కడి ప్రజలు ఆందోళన చేసినప్పటికీ ఈ ప్రాంతాన్ని తనకి ఇష్టమైన ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు ప్రధాని మోదీ నిరంతరం ఆలోచిస్తూ ప్రజల గోడును మాత్రం పట్టించుకోవటం లేదు. సముద్ర జీవ శాస్త్రవేత్తలు పౌరుల విజ్ఞప్తులను వినిపించుకునే స్థితిలోనే లేరు. మూడు దీవులలో 370 సంచార విల్లాలను నిర్మించే ప్రాజెక్టును చేపట్టనున్నారని కొంతమంది సముద్ర జీవ శాస్త్రవేత్తలు వెల్లడిరచారు. ఇప్పటికే బలహీనంగా ఉన్న పగడాల దిబ్బలకు తీవ్ర ముప్పు కలుగనున్నది. పర్యావరణాన్ని ధ్వంసం చేసి అయినా వ్యాపార ప్రాజెక్టులను చేపట్టి లక్షద్వీప్‌ పాలకుడు ప్రఫుల్‌ఖోడా పటేల్‌ విల్లాలను నిర్మించేదాకా విశ్రమించే ఆలోచనలో లేరు. గుజరాత్‌ అవుట్‌ పోస్టుగా ఈ ప్రాంతాన్ని మార్చివేసేందుకు మోదీ, అమిత్‌షాలతో పాటు వారి సన్నిహితుడైన పటేల్‌ కలిసి పథకం వేసుకున్నారు.
కేరళ తీర ప్రాంతంలో ఉన్న మూడు పగడాల దీవులు వేల సంవత్సరాలుగా విధ్వంసం కాకుండా మనుగడ సాగిస్తున్నాయి. ఈ ప్రాంతాన్ని కొద్ది సంవత్సరాలుగా విధ్వంసానికి గురిచేసే యోచనలో బేహారులున్నారు. జమ్ము కశ్మీర్‌కు గల ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసేందుకు 370వ అధికరణను నిర్వీర్యం చేశారు. బహుశా 370ని నేటి పాలకులు మరచిపోలేకుండా ఉన్నారు. ఒకచోట రద్దు చేసి, మరోచోట దీన్ని అక్కడ ప్రజలపై రుద్దుతున్నారు. చాలా కాలంగా లక్షద్వీప్‌ వీరి కంటపడలేదు. చివరకు 2020 డిసెంబరులో ఈ దీవిపై వేటు పడనే పడిరది. ఈ ప్రాంతలో నివసిస్తున్న 70వేల మంది ఈ ప్రమాదాన్ని ఎలా నిరోధించాలి అని యోచిస్తున్నారు. ముగ్గురు గుజరాతీ బేహారులను ఉద్యమం ద్వారానే లొంగదీయాలని భావిస్తున్నారు. నిరసనలు తెలియజేశారు. ఆందోళన చేశారు. అయినా ఈ బేహారులు పట్టించుకోలేదు. ఎనిమిది నెలలకు పైగా పోరాటం చేస్తున్న రైతుల గోడును పట్టించుకోకుండా, సమస్య పరిష్కరించకుండా ఉన్న మోదీని రైతు ఉద్యమ నేత రాకేశ్‌ తికైత్‌ ఉదహరించారు.
ఈ బేహారుల నాయకుడికి చెవిటి మిషన్‌ను అందజేయాల్సిందే. అది కూడా జర్మనీలో తయారైనదాన్నే ఇవ్వాలి. ఎందుకంటే ఆ నాయకుడిని నాజీ హిట్లరుగా ప్రజలు పిలుచుకుంటున్నారు. ప్రజల భావన నిజమైనప్పటికీ జర్మనీ ఛాన్సలర్‌ అంగీకరించకపోవచ్చు. ప్రశాంతంగా జీవిస్తున్న ప్రజల జీవితాలను తీవ్ర అలజడికి గురిచేసిన ముగ్గురు బేహారులు సమస్యలను మాత్రం పరిష్కరించరు. ఈ ముగ్గురు ఈ ప్రాంత రూపురేఖలను మార్చివేసే ప్రణాళికను తయారు చేసుకున్నారు. 370 విల్లాలను నిర్మించేందుకు భారీ ‘‘షార్క్‌’’ చేపలు ఇక్కడ వాలిపోయే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ ‘‘షార్క్‌లు’’ డబ్బు కట్టలతో దిగుతాయి. త్వరలోనే అందమైన దీవులలో పచ్చని వాతావరణం ధ్వంసమై దుమ్ము, ధూళితో నిండిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. రకరకాల యంత్రాల రణగొణ ధ్వనులు ఇక్కడి జంతువులకు, పక్షులకు ప్రాణ సంకటంగా మారుతాయి. మినీకాయ్‌, కడ్మాట్‌, సుహేలీ దీవులలో ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంతో విల్లాలను నిర్మంచనున్నారు. ఇప్పటికైనా లక్షద్వీప్‌ అందచందాలను కాపాడుకొని ప్రజల ప్రశాంత జీవనాన్ని ధ్వంసం చేయకుండా నిలువరించేందుకు దేశ వ్యాప్త ఉద్యమం ఎంతైనా అవసరం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img