London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Tuesday, October 22, 2024
Tuesday, October 22, 2024

విలువలకు కమలం పాతర… గెలుపే లక్ష్యం…

పతకమూరు దామోదర్‌ ప్రసాద్‌

రాజ్యసభకు ఇటీవల జరిగిన ఎన్నికలలో హిమాచల్‌ ప్రదేశ్‌, యూపీలలో కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పారీ ఎమ్మెల్యేలకు డబ్బు, పదవులు ఎరవేసి బీజేపీ రెండు స్థానాలను అదనంగా గెలుచుకోవడం కమలనాథుల నైతిక విలువల పతనానికి పరాకాష్ట. దేశం కోసం, ధర్మం కోసం అంటూ ధర్మోపన్యాసాలు ఇచ్చే బీజేపీ నేతలు అధికారంకోసం ఎంతకైనా తెగిస్తారని మరోసారి స్పష్టమైంది. ఉత్తరాది రాష్ట్రాలలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్‌లో హస్తం పార్టీని చిత్తుచేయడానికి బీజేపీ పకడ్బందీ వ్యూహాన్ని రచించి కాంగ్రెస్‌ అధిష్ఠాన వర్గానికి దిగ్భ్రాంతి కలిగించింది. హిమాచల్‌ నుంచి కాంగ్రెస్‌ స్థానిక నేతలను కాదని ప్రముఖ న్యాయవాది అభిషేక్‌ సింఫ్వీుని రాజ్యసభ అభ్యర్థిగా నిలపడం అసంతృప్తికి కారణమైంది. ఆరుగురు కాంగ్రెస్‌ శాసనసభ్యులు, ముగ్గురు స్వతంత్ర అభ్యర్థుల క్రాస్‌ ఓటింగ్‌తో బీజేపీ సునాయాసంగా రాజ్యసభ స్థానాన్ని తన ఖాతాలో వేసుకుంది. పార్టీలో పెరుగుతున్న అసంతృప్తిని సకాలంలో గుర్తించి దిద్దుబాటు చర్యలు తీసుకోవడంలో శాసనసభాపక్షం, రాష్ట్ర నాయకత్వం, అధిష్ఠానం విఫల మయ్యాయి. మొత్తం 68మంది సభ్యులున్న హిమాచల్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు సొంతంగా 40మంది ఎమ్మెల్యేలున్నారు. ముగ్గురు స్వతంత్రులు కూడా హస్తం పార్టీ మద్దతు దారులే. కాగా ప్రధాన ప్రతిపక్షం బీజేపీికి 25మంది శాసన సభ్యులున్నారు. ఏరకంగా చూసినా కాంగ్రెస్‌ అభ్యర్థి అభిషేక్‌ సింఫ్వీు రాజ్యసభకు అవలీలగా ఎన్నిక కావలసిన పరిస్థితి. అయితే కాంగ్రెస్‌లో సహజంగా ఉండే గ్రూపు రాజకీయాలు, అసమ్మతి కారణంగా చేజేతులా రాజ్యసభ స్థానాన్ని పోగొట్టు కున్నది. సుప్రీం కోర్టులో కాంగ్రెస్‌కు, ఇండియా కూటమి పార్టీల కేసులను ప్రతిభావంతంగా వాదించే అభిషేక్‌ సింఫ్వీు వంటి సుప్రసిద్ధ న్యాయవాదిని రాజ్యసభకు పంపడంలో కాంగ్రెస్‌ ఘోరంగా విఫలమైంది. సింఫ్వీు కూడా జాగ్రత్తపడక పోవడం ఆయన వ్యక్తిగత ప్రతిష్ఠకు కూడా లోటే. ఈ ఓటమి కాంగ్రెస్‌కు అవమానకరమైనదేనని మాజీ సీఎం వీరభద్ర సింగ్‌ తనయుడు విక్రమాదిత్య సింగ్‌, పీసీసీి అధ్యక్షురాలు ప్రతిభాసింగ్‌ అభిప్రాయపడ్డారు. ఇందుకు నైతిక బాధ్యత వహించి వారు తమ పదవులకు రాజీనామా చేయగా పార్టీ అధిష్ఠానం అంగీకరించలేదు. వీరభద్ర సింగ్‌ కుటుంబం తరతరాలుగా కాంగ్రెస్‌కు వీరవిధేయులుగా ఉన్నది. అయినా అట్టి మేటి నేత విగ్రహాన్ని సిమ్లాలో నెలకొల్పడంలో సిఎం సుక్కు విఫలమయ్యారనే అసంతృప్తి వారి కుటుంబం సభ్యులలో, కాంగ్రెస్‌ శ్రేణులలో బలంగా ఉంది. కమలం పార్టీకి ఓటేసిన ఆరుగురు కాంగ్రెస్‌ శాసనసభ్యులపై స్పీకర్‌ అనర్హత వేటువేయడంతో అసెంబ్లీ సభ్యుల సంఖ్య 62కు, కాంగ్రెస్‌ బలం34కు పడిపోయింది. కాంగ్రెస్‌ అసమ్మతివాదులు, స్వతంత్ర ఎమ్మెల్యేలను కూడగట్టినా హస్తం, కమలం పార్టీలకు సమాన ఓట్లు రావడంతో టాస్‌ వేయగా ఆ స్థానం బీజేపీకి దక్కింది. ప్రతిష్ఠాత్మకమైన రాష్ట్ర బడ్జెట్‌ ఆమోదానికి స్పీకర్‌ 15మంది బీజేపీి శాసనసభ్యులను సస్పెండ్‌ చేశారు. వీరితో బాటు అనర్హతవేటు పడిన కాంగ్రెస్‌ సభ్యులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. కోర్టులు ఏ నిర్ణయం వెల్లడిస్తాయో వేచి చూడాలి. అయితే కాంగ్రెస్‌ను ఉత్తరాదిలో లేవకుండా దెబ్బతీయడానికి కంకణం కట్టుకున్న కమలనాథులు ఇంతటితో ఊరు కుంటారా? హిమాచల్‌లో ప్రస్తుతానికి కాంగ్రెస్‌ గండం నుంచి గట్టెక్కినా, లోక్‌సభ ఎన్నికలలోగానే మరింత మంది కాంగ్రెస్‌ శాసన సభ్యులకు డబ్బు, పదవులు ఎరవేసి ఉత్తరాదిలో ఏకైక కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కమలనాథులు కూలదూస్తారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. యూపీలో 10రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగ్గా బీజేపీ 8స్థానాలు గెలిచింది. ప్రతిపక్ష సమాజ్‌వాది పార్టీకి చెందిన ఏడుగురు శాసనసభ్యులను డబ్బు తదితర ప్రలోభాలతో ఒక రాజ్యసభ స్థానం కమలం పార్టీ అదనంగా సాధించింది. హిమాచల్‌ ప్రదేశ్‌, యూపీలో రెండు రాజ్యసభ స్థానాలను అదనంగా గెలవడానికి కమలనాథులు అనుసరించిన నీతిమాలిన రాజకీయాలు సర్వత్రా విమర్శలకు గురయ్యాయి. కాగా కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న కర్నాటకలో కాంగ్రెస్‌, బీజేపీ తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి పోటా పోటీగా వ్యూహాలు పన్నాయి. ఒక బీజేపీ ఎమ్మెల్యే కాంగ్రెస్‌కు ఓటేయగా మరొకరు ఓటింగ్‌లో పాల్గొనలేదు. గతంలో కాంగ్రెస్‌ పార్టీ కూడా ఇలాంటి పద్ధతులే అనుసరించినా, వారికంటే కమలనాథులే ఘనులనే కుఖ్యాతి సాధిం చారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో కాంగ్రెస్‌ ముక్త భారత్‌ నినాదంతో కమలంపార్టీ కేంద్రం ఆధీనంలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, ఆదాయపు పన్ను శాఖ, సీబీఐలను ప్రయోగించి ప్రతిపక్ష నేతలను బెదిరించి వివిధ రాష్ట్రాలలో పార్టీలను చీల్చడం తెలిసిందే. 48 లోక్‌సభ స్థానాలు గల మహారాష్ట్రలో మహావికాస్‌ అఘధి ప్రభుత్వాన్ని శివసేనలో సీఎం పదవి ఆశతో ఉన్న ఏకనాథ్‌ షిండేను పావుగా వాడుకున్నారు. తర్వాత కూటమిలో మరో పెద్ద పార్టీ ఎన్‌సీపీని చీల్చి వేశారు. ఎన్‌సీపీి సంస్థాపకుడు శరదపవార్‌కు వ్యతి ంకంగా ఆయన అన్న కుమారుడు అజిత్‌ పవార్‌ను ఉసిగొల్పి ఆ పార్టీని ముక్కలు చేశారు. రానున్న ఎన్నికలలో ఎక్కువ స్థానాల సాధనకే కమలం ఈ కుతంత్రం. గతంలో అసోంలో హిమంత బిస్వ శర్మ, మధ్యప్రదేశ్‌ నుంచి జ్యోతిరాదిత్య సింధియా వంటి కాంగ్రెస్‌ విభీషణులు సీఎం పదవిపై ఆశతో ఉన్న సంగతి కనిపెట్టి, వారితో కాంగ్రెస్‌ను చీల్చి నిర్వీర్యం చేసిన విషయం విదితమే. కర్నాటక, మధ్యప్రదేశ్‌లో ఆపరేషన్‌ కమలం అమలు చేసి, డబ్బు, పదవులు ఎరవేసి కాంగ్రెస్‌ ప్రభుత్వాలను కుట్రలద్వారా కూల్చిన ఘనత కమలం నేతలది. జార్ఖండ్‌లో ఇటీవల ఈడీ ద్వారా బెదిరించి అప్పటి ముఖ్య మంత్రి హేమంత్‌ సోరేన్‌ను గద్దె దించారు. బీహార్‌లో తరచూ కూట ములు మార్చే ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ను దువ్వి జేడీయూ, జేడీఎస్‌, కాంగ్రెస్‌లతో కూడిన మహా గట్భందన్‌ ప్రభుత్వాన్ని దింపి మళ్లీ ఆయనను ఎన్డీయేలో చేరు ్చకుని హెచ్చు లోక్‌సభ స్థానాలు గెలిచే వ్యూహాన్ని మోదీ అమలు చేశారు. వరుసగా మూడోసారి ప్రధాని కావడానికి మోదీ, పరివారం చేయ వలసింది అంతా చేస్తున్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగా 370 స్థానాలు సాధిస్తామని కమలనాథులు చెబుతున్నా 210కి మించక పోవచ్చనే అభిప్రాయాలూ వున్నాయి. దక్షిణాదిలోని 130స్థానాలలో గత ఎన్నికలలో గెలిచిన సీట్లు 29. అందులో కర్నాటకలో గెలిచిన ఎంపీ స్థానాలు 25. ఈసారి అరడజను స్థానాలకు తగ్గుతాయంటున్నారు. స్వాతంత్య్రానంతరం మన రాజకీయాలను పరిశీలిస్తే 1947 నుంచి 1967 వరకు ఒకే వ్యక్తి (నెహ్రూ), ఒకే పార్టీ (కాంగ్రెస్‌) గుత్తాధిపత్యం సాగిందనేది స్పష్టం. ఇప్పుడు మోదీ ప్రధానిగా బీజేపీని బలీయంగా మార్చడానికి చేస్తున్న ప్రయత్నాలు అలాంటివే. బీజేపీకి దక్షిణాదిలో కర్నాటక మినహా ఇతర రాష్ట్రాల్లో పెద్దగా బలం లేదు. వివిధ రాష్ట్రాల్లో అక్కడ బలీయంగా వున్న సామాజిక వర్గాలను, దళితులను, బీసీిలను ఆకట్టు కోవడానికి కమలం పార్టీ గట్టి ప్రయత్నాలే చేస్తున్నది. తమిళ నాడులో డీఎంకే, అన్నా డీఎంకేకు దీటుగా కమలం ఎదగడానికి మాజీ ఐపీఎస్‌ అధికారి అన్నామలైనీ రంగంలోకి దింపారు. పశ్చిమబెంగాల్‌, త్రిపురలో కమలం ప్రాబల్యం పెంచడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ గత ఎన్నికలలో తెలంగాణాలో 4స్థానాలు గెలిచినా ఈసారి అంతకంటే పెరగక పోవచ్చునంటున్నారు. రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నో జనాకర్షక సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలుచేసి ప్రజాదరణ పొందుతున్నది. ఈసారి డజను లోక్‌సభ స్థానాలు గెలవాలనేది హస్తం లక్ష్యం. పదేళ్లు తెలం గాణను పాలించిన కేసీఆర్‌ నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌ ఈసారి చతికిల బడ వచ్చుననే అంచనాలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్‌ అప్పులుతెచ్చి జనం ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్నా, ఉద్యోగ,ఉపాధి కల్పన లేనందున ప్రజలు మార్పు కోరుతున్నారన్న అభిప్రాయాలున్నాయి. అరశాతం ఓట్లు కూడా లేని బీజేపీ కేంద్రంలో తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఏకకాలంలో జగన్‌నేతృత్వం లోని వైసీపీ, చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీని కట్టడిచేస్తూ తమకు అనుకూలంగా ఉండేలా చూసుకుంటున్నది. బీజేపీి, కాంగ్రెస్‌ మాత్రమేఉన్న రాష్ట్రాల్లో హస్తం పార్టీని దెబ్బతీసేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మరో రెండేళ్లలో ప్రధాని మోదీకి 75ఏళ్లు నిండుతాయి. ఇప్పటి వరకు పాటించిన వయో పరిమితి మేరకు మోదీ వైదొలగాలి. ఆయన అంత తేలిగ్గా అధికారం వదులుకుంటారా? పరివారపు పెద్దల వైఖరి ఏమిటి. తర్వాత నాయకుడు ఎవరు? అన్నది వేచి చూడాలి. సీనియర్‌ జర్నలిస్ట్‌ ఫోన్‌: 9440990381

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img