Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

వేగంగా మారిన పంజాబ్‌ రాజకీయాలు

కళ్యాణీ శంకర్‌

అమరేందర్‌ సింగ్‌ను అవమానకర రీతిలో కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠాన వర్గం పదవి నుండి తప్పించడానికి ముందు రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్‌ గెలుపొందే అవ కాశాలు మెండుగా ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలహీనంగా ఉంది. కొత్త ముఖ్య మంత్రి ఛన్నీ రాష్ట్రంలో క్రమశిక్షణ లేని గ్రూపు తగాదాలలో మునిగి ఉన్న పార్టీని నియంత్రించి విజయం పొందటం అంత తేలికైన పనికాదు. అంతే కాకుండా ఈసారి ఎన్నికల అనం తరం నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ ముఖ్యమంత్రి అవుతారని ఛన్నీని తాత్కాలికంగానే ఆ పదవిలో ఉంచుతారని బలంగా వినిపిస్తున్న మాటలు.

పంజాబ్‌ రాజకీయ ముఖచిత్రం అత్యంత వేగంగా మారిపోయింది. రెండు నెలల కాలంలోనే కాంగ్రెస్‌ పరిస్థితి తీవ్రమైన ఒడిదొడుకులకు లోనైంది. ఇటీవల వరకు ముఖ్యమంత్రిగా ఉన్న కెప్టెన్‌ అమరేందర్‌ సింగ్‌ను మార్చివేసి కొత్త ముఖ్య మంత్రిగా ఛన్నీని సాధారణ మంత్రి స్థాయి నుంచి ప్రమోట్‌ చేశారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బహుముఖ పోటీ తప్పదని ప్రస్తుత పరిణామాలు తెలియజేస్తున్నాయి. ఈ పరిస్థితి కొనసాగినట్లయితే ఏ పార్టీకీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మెజారిటీ రాకపోవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు. పార్టీల మధ్య పొత్తులు కూడా సందేహాస్పదంగానే ఉన్నాయి. ఎన్నికలకు ముందు పొత్తులు లేకపోయినా ఎన్నికలు జరిగి ఫలితాలు వెలువడిన తరవాత ప్రభుత్వం ఏర్పాటుకు ఎవరికి ఎవరు సహకరిస్తారో, ఏఏ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి అన్న అంశాలు ప్రస్తుతానికి ఊహాగానాలే.
ఇప్పటివరకు కాంగ్రెస్‌, శిరోమణి అకాలీదళ్‌లు ఒక పార్టీ తర్వాత మరో పార్టీ అధికారంలో ఉంటూ వస్తున్నాయి. 2017లో ఆమ్‌ఆద్మీ పార్టీ ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రయత్నించి విఫలమైంది. అమరేందర్‌ సింగ్‌ నాయకత్వంలో కాంగ్రెస్‌ గణనీయమైన సీట్లను గెలుచుకుంది. ఈసారి రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. గత ఏడాది అకాలీదళ్‌ వ్యవసాయ చట్టాలపై విభేదించి ఎన్‌డీఏ సంకీర్ణ ప్రభుత్వం నుండి వైదొలగింది. ఇప్పటికీ ఆప్‌ రాష్ట్రంలో విస్తరించేందుకు కృషిని కొనసాగిస్తూనే ఉంది. అకాలీదళ్‌ బీఎస్పీతో పొత్తు పెట్టుకొన్నది. అమరేందర్‌ సింగ్‌ కొత్త పార్టీ ఏర్పాటు చేసి బీజేపీతో పొత్తు పెట్టుకుంటానని ప్రకటించారు. అకాలీదళ్‌కు చెందిన కొన్ని యూనిట్లు కూడా ఈ కూటమిలో భాగస్వామి కానున్నవి
అమరేందర్‌ సింగ్‌ను అవమానకర రీతిలో కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠాన వర్గం పదవి నుండి తప్పించడానికి ముందు రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్‌ గెలుపొందే అవ కాశాలు మెండుగా ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలహీనంగా ఉంది. కొత్త ముఖ్యమంత్రి ఛన్నీ రాష్ట్రంలో క్రమశిక్షణ లేని గ్రూపు తగాదాలలో మునిగి ఉన్న పార్టీని నియంత్రించి విజయం పొందటం అంత తేలికైన పనికాదు. అంతే కాకుండా ఈసారి ఎన్నికల అనంతరం నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ ముఖ్యమంత్రి అవు తారని ఛన్నీని తాత్కాలికంగానే ఆ పదవిలో ఉంచుతారని బలంగా వినిపిస్తున్న మాటలు. రాహుల్‌ గాంధీ, ప్రియాంకగాంధీలు సిద్ధును రాష్ట్ర కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. సిద్ధుకు, అమరేందర్‌ సింగ్‌కు సయోధ్యలేదు. సిద్ధు నియామకం నాటినుంచికాంగ్రెస్‌లో లుకలుకలు ప్రారంభమయ్యాయి. ఈ పరిస్థి తులే కాంగ్రెస్‌ను బలహీనపరిచాయి. సిద్ధు ఎప్పుడు ఏంచేస్తారో ఊహించలేని పరిస్థితి.
అమరేందర్‌ సింగ్‌ కొత్త పార్టీ ఏర్పాటు చేయటం ఇది మొదటిసారి ఏమీ కాదు. 1984లో స్వర్ణ దేవాలయం పైన సైన్యం దాడి చేసిన సందర్భంగా కాంగ్రెస్‌ నుండి బయటకు వెళ్లి అకాలీదళ్‌ పార్టీలో చేరారు. 1992లో అమ రేందర్‌ సింగ్‌ అకాలీదళ్‌ (పాంథిక్‌) పేరుతో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1997లో ఈ పార్టీని కాంగ్రెస్‌లో కలిపేశారు. ఆనాటి నుంచి అమరేందర్‌ కాంగ్రెస్‌లోనే ఉన్నారు. 2002`07 మధ్య కాలంలో మొదటి సారి, 2017 తర్వాత రెండోసారి అమరేందర్‌ ముఖ్యమంత్రి అయ్యారు. రెండోసారి పదవీకాలం ముగియక ముందే అమరేందర్‌ను పదవి నుంచి తప్పించారు. దీంతో ఆయన పార్టీ నుంచి వెళ్లిపోయి, ప్రస్తుతానికి కొత్త పార్టీ ఏర్పాటు చేసి బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించారు. అమరేందర్‌ కాంగ్రెస్‌ నుంచి వెళ్లిపోవటం ఆ పార్టీని నష్టపరచటమే అవుతుంది. రానున్న ఎన్నికల్లో ఆ పార్టీ అవకాశాలు దెబ్బతింటాయి. అమరేందర్‌ తాను అనుకున్నది సాధించేందుకు ఎవరి సహాయాన్ని అయినా తీసుకోవాలని నిర్ణయించారు.
మరోవైపు పంజాబ్‌ రైతులు మోదీ ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ 11 నెలలుగా మహత్తర ఉద్యమం చేస్తున్నారు. ఈ ఉద్యమానికి కాంగ్రెస్‌ తోడ్పాటు ప్రకటించింది. రైతుల సమస్య త్వరగా పరిష్కారం అయితే బాగుంటుందని అమరేందర్‌ కోరుకుంటున్నారు. అంతేకాదు రైతులకు, మోదీ ప్రభుత్వానికి మధ్య చర్చలు జరిగేలా చూసి పరిష్కరించాలని కూడా యోచిస్తున్నారు. ఏదో విధంగా రైతుల సమస్యను పరిష్క రించి ఇంతకాలం పట్టించుకోకుండా తృణీకరిస్తున్న మోదీ ప్రభుత్వం తన పరువు కాపాడుకోవాలని భావిస్తున్నది. ఈ విషయంలో బీజేపీకి అమరేందర్‌ సహక రించాలనుకుంటున్నారు. ఎన్నికల లోపు రాష్ట్రంలో శాంతి భద్రతలను మెరుగు పరచాలన్నదే అమరేందర్‌ మొదటి రాజకీయ పథకం. కొత్తగా పొత్తు పెట్టుకున్న బీజేపీకి తగినన్ని సీట్లు రాకపోయినా, ఆయన పార్టీకి 5 శాతం ఓట్లు వచ్చినా కాంగ్రెస్‌కు నష్టం జరుగుతుంది. రాష్ట్రంలో ప్రతిపక్షాలన్నీ బహుశా ఇదే కోరుకుంటున్నాయి. ప్రజల సంక్షేమం కంటే రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసమే ఎక్కువగా పనిచేస్తున్నారు.
ఎన్నికలలో గెలుపొందితే తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని బీజేపీని అమరేందర్‌ కోరుతున్నట్లు తెలుస్తోంది. భద్రతా అంశాలలో కేంద్రానికి ఆయన మద్దతు పలుకుతున్నారు. ఉదాహరణకు పుల్వామాలో టెర్రరిస్టు దాడుల తర్వాత ‘‘సర్జికల్‌ దాడుల’’ విషయంలో కేంద్రాన్ని సమర్థించారు. ఇటీవల సరిహద్దు భద్రతా దళాల పరిధిని విస్తరించినప్పుడు అనేక రాష్ట్రాలు వ్యతిరేకించినప్పటికీ అమరేందర్‌ కేంద్రానికి వంత పలికారు. అసెంబ్లీకి దాదాపు నాలుగు నెలలు గడువు ఉన్నది. ఈలోపు అమరేందర్‌ వేసుకున్న ప్రణాళికలను అమలు చేసి ఫలితాలు సాధించటం అలాగే ఇతర పార్టీలను దెబ్బకొట్టడం సాధ్యమవుతుందా? రానున్న రోజుల్లో ఆయనకు మరిన్ని సవాళ్లు ఎదురవుతాయి. తాను విజయాన్ని మాత్రమే కోరుకుంటానని దానికి అవసరమైన భూమికను రూపొందించుకుంటా నని అమరేందర్‌ అంటున్నారు. రాష్ట్రంలో బీజేపీ ఉనికి అత్యల్పం. అమరేందర్‌ కాంగ్రెస్‌ నుంచి బయటకు రావటం తనకు ఊహించని బోనస్‌గా బీజేపీ భావి స్తున్నది. మహారాజా కుటుంబీకుడైన అమరేందర్‌ బీజేపీ మెజార్టీవాద రాజకీయా లకు తగినట్టుగానే ఉండొచ్చు. కొత్త పార్టీని నిర్మించే సమయమేమీ లేదు. దళిత వర్గాలను ఛన్నీ ఆకట్టుకోగలరని కాంగ్రెస్‌ ఆశిస్తున్నది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img