Monday, May 20, 2024
Monday, May 20, 2024

సార్వత్రిక ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు సమస్యాత్మక గ్రామాలపై దృష్టి సారించండి

జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్
విశాలాంధ్ర – పార్వతీపురం : మన్యంజిల్లాలో మే నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు సమస్యాత్మక గ్రామాలపై దృష్టి పెట్టాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పిలుపునిచ్చారు.బుదవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నేరసమీక్షా సమావేశంను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ నిర్వహించారు.జిల్లాలోని డిఎస్పీలు, సిఐలు, ఎస్సైలతో బుదవారంనాడు పిబ్రవరి మాసాంతపు నేరసమీక్షా సమావేశంను నిర్వహించారు.పెండింగులో ఉన్న గ్రేవ్ మరియు నాన్ గ్రేవ్ కేసులు, మర్డర్, ప్రాపర్టీ, వాహనాలు దొంగతనం, 174 సి ఆర్ పి సి కేసులు, మిస్సింగ్, చీటింగ్ కేసులు, సైబర్ నేరాలు,ఇతర కేసులను సమీక్షించారు.పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగు కేసుల వివరాలు, ప్రస్తుత కేసుల స్థితిగతులు, నమోదైన కేసుల్లో నేరస్థుల అరెస్టు, కేసు దర్యాప్తు తీరుతెన్నులపై సంబంధిత పోలీస్ అధికారులతో ఆరాతీసి కేసుల ఫైల్స్, రికార్డులను పరిశీలించారు. కేసుల ఛేదించ డానికి,పరిష్కారానికి, నేర నియంత్రణకు దోహదంచేసే పలు సూచనలు అధికారులకు దిశా నిర్దేశాన్ని చేశారు.
మే నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు-2024 దృష్ట్యా ఎన్నికలను శాంతియుతంగా జరిపించేలా తగు చర్యలు సిద్దంచేసుకోవాలని,,ఇప్పటి నుండే సిద్దంగా ఉండాలని కోరారు .ఎన్నికలు సజావుగా సాగేందుకు ముందుగానే సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించి ఆప్రాంతాలను సెక్టార్ల ప్రకారం విభజించి ప్రత్యేక అధికారులను నియమించి, అక్కడ అనుసరించవలసిన కార్యాచరణ గురించి అధికారులకు దిశానిర్దేశం చేసారు. సార్వత్రిక ఎన్నికలకు బందోబస్తు విధులు నిర్వహించేందుకు వచ్చిన కేంద్రపోలీస్ దళo ఆర్.పి.ఎఫ్‌ ఫోర్సుతో జిల్లాలోఉన్న పోలీస్ స్టేషన్ల అధికారులు వారియొక్క పోలీస్ సిబ్బందితో కలిసి వారి పరిదిలోగల సెన్సిటివ్ మరియు హైపర్ సెన్సిటివ్ గ్రామాలలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాలని కోరారు.ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకునేందుకు పటిష్టమైన భద్రతా చర్యలు పోలీసు అధికారులు తీసుకుంటున్నారని,ఆర్.పి.ఎఫ్‌ ఫోర్స్ భరోసా ఉంటుందని,ఫ్లాగ్ మార్చ్,రూట్ మార్చ్ లు, తదితర విధులు ఎన్నికలు పూర్తయినంతవరకు నిర్వహించాలని తెలియజేశారు.అధికారులు ఎప్పటికప్పుడు సమస్యాత్మక గ్రామాలు అతి సమస్యత్మకగ్రామాలను విరివిగా సందర్శించి నిఘా పెడుతూ ముందస్తు సమాచారం సేకరించాలన్నారు.పోలీస్ స్టేషన్ పరిదిలో గల పోలింగ్ కేంద్రాలను అధికారులు సందర్శించి ,భద్రతా ఏర్పాటులను సమీక్షించాలన్నారు.గతంలో ఎన్నికల సందర్భంగా సమస్యాత్మక గ్రామాలు అతి సమస్యత్మక గ్రామాలలో గతంలో జరిగినటువంటి కేసులలో ఎవరెవరు ముద్దాయిలుగా ఉన్నారు వారిపై తీసుకున్నటువంటి చర్యలను గురించి ముందుగా సమాచారాన్ని సేకరించాలని ప్రతిఒక్కరిపై నిఘా ఉంచాలని తెలియజేసారు. ఎన్నికల దృష్ట్యా ఏర్పాటుచేసిన సరిహద్దు చెక్ పోస్టుల వద్ద ముమ్మర తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. అధికారులు సందర్శించి ,ఆకస్మికతనిఖీలు చేస్తూ అక్రమమద్యం, నగదు తరిలింపు లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని, 24గంటలు అప్రమత్తంగా ఉంటూ ప్రతివాహనాన్ని తనిఖీ చేయాలని ఆదేశాలు జారీచేశారు. ఎన్నికలకు సమాయత్వం అయ్యే సందర్భంగా మద్యం,డబ్బు మాదకద్రవ్యాల రవాణా జరిగే ప్రదేశాలను ముందుగా గుర్తించి ఒక మ్యాపింగ్ తయారు చేయాలన్నారు. ఎన్నికలకు సంభందించి ప్రచారానికి రాజకీయ పార్టీలు సువిధ యాప్లో పర్మిషన్ పొందాలని,అల పర్మిషన్లు పొందారో లేదో తెలుసుకోవాలన్నారు. సి విజిల్, ఈ ఎస్ ఎం ఎస్ ల గురించి మరియు ఎన్నికల ప్రవర్తనా నియమావళి నిభందనలు గురించి,నిర్వర్తించే విధివిదానల గురిండి తెలియజేసి ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.అదే విధంగా ఏజెన్సి ప్రాంతాలలో నిఘా ఉంచుతూ ఎప్పటికప్పుడు రోప్ నిర్వహించాలని ఆదేశాలు జారీచేసారు. ఈనేర సమీక్ష సమావేశంలో విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు మరియు సిబ్బందికి జిల్లా ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు.చినమేరంగి పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 44/2024 కేసులో హత్యచేసి పారిపొయిన ముద్దాయిని వెతికి పట్టికొని కేసు పురోగతి సాదించుటలో ప్రతిభ కనబర్చిన చినమేరంగి సర్కిల్ ఇన్స్పెక్టర్ బి.మంగ రాజు ,చినమేరంగి పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఇ.చిన్నంనాయుడు,జియ్యమ్మవలస పోలీస్ స్టేషన్ ఎస్ఐ పి.అనిష్ , పార్వతీపురం రూరల్ పోలీస్ స్టేషన్ పిసి బి.తిరుపతిరావు, పాచిపెంట పోలీస్ స్టేషన్ పిసిలకు ఎన్ఫోర్స్మెంట్ వర్క్ లో ప్రతిభ కనిబర్చినందుకుగాను ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు.
ఈనేరసమీక్షసమావేశంలోపార్వతీపురం
ఏ.ఎస్పీ సునీల్ షరోన్ ,దిశా డిఎస్పీ ఎస్.ఆర్.హర్షిత, పాలకొండ సబ్ డివిజన్ డిఎస్పీ జి.వి. కృష్ణారావు,ఎస్సి & ఎస్టి సెల్ డిఎస్పి జి .మురళీధర్,ఏఆర్ డిఎస్పి వెంకట అప్పారావు,ట్రైనీ డిఎస్పీ ఎస్.ఎమ్డి.అజీజ్,ఎస్బీ సిఐ సిఎచ్.లక్ష్మణ రావు,డిసిఆర్బి సిఐ బి.ఎం.డి.ప్రసాద రావు,ఏఆర్ ఆర్ఐ
శ్రీరాములు,శ్రీనివాసరావు, కార్యాలయ సూపరింటెండెంటులు కోటేశ్వర రావు, సూర్యకుమారిలు, జిల్లాల్లోని సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img