Monday, May 20, 2024
Monday, May 20, 2024

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సన్నాహాలు: సిఐ రవికుమార్

విశాలాంధ్ర,సీతానగరం: సర్కిల్ పరిధిలోని సీతానగరం, బలిజిపేట,పార్వతీపురం గ్రామీణ, కొమరాడ పోలీస్ స్టేషన్ల పరిధిలోని 256పోలింగు కేంద్రాల్లో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని, దీనిలో భాగంగానే ఆయా గ్రామాల్లో ప్రజలతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు పార్వతీపురం గ్రామీణ సీఐ కె.రవికుమార్ తెలిపారు. మంగళవారం మండలంలోని పలుగ్రామాల్లో పోలింగు కేంద్రాలను ఎస్ఐ రాజేష్ తో కలిసి సందర్శన చేశారు. ఆయనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. జిల్లాఎన్నికల అధికారయిన జిల్లా కలెక్టర్,జిల్లా ఎస్పీ అదేశాలు, సూచనలు మేరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.తన సర్కిల్ పరిధిలో నాలుగుమండలాల్లో 23 సమస్యాత్మక పోలింగుకేంద్రాలున్నాయని చెప్పారు. సమస్యాత్మక గ్రామాల్లో నిఘా పెట్టామని చెప్పారు.కొమరాడ మండలంలోని పూడేసు,పార్వతీపురంమండలంలోని చందలింగి,ఆడారు, బట్టివలస పోలింగు కేంద్రాలు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నట్లు తెలిపారు. కొమరాడ మండలంలోని కూనేరు,పార్వతీపురం మండలంలోని ఆడారు, ఆర్ కె బట్టివలసల వద్ద చెక్ పోస్టులను ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి తూచ తప్పకుండా పాటించాలని తెలియజేసారు. వాటిని అమలుచేసేందుకు ప్రతీమండలంలో ఎం.సి.సి టీం, మూడు ఎఫ్ ఎస్ టీములు 24గంటలపాటు పనిచేస్తున్నాయని చెప్పారు.గ్రామాల్లో మధ్యం డంపింగ్, డబ్బులు సరఫరా, కానుకల సరాపరా వంటి వాటిపై నిరంతరం నిఘా పెట్టామని చెప్పారు.గ్రామాల్లో ఎటువంటి గొడవలు, తగాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే పెద్ద ఎత్తున బైండోవర్ కేసులను కూడా నమోదు చేసినట్లు తెలిపారు.గ్రామాల్లో సచివాలయం మహిళా పోలీస్ సిబ్బందికి కూడా అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవడంపై దృష్టి పెట్టామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img