Friday, May 3, 2024
Friday, May 3, 2024

నేనే రాజు నేనే మంత్రి

  • నా బైకులకు పార్కింగ్ ఇక్కడే
    విశాలాంధ్ర – నాగులుప్పలపాడు :- మండలంలోని ఉప్పుగుండూరు గ్రామ కార్యదర్శి హరిబాబు తీరు నేనేరాజు నేనే మంత్రి అన్నతీరుగా మారింది. ఇప్పటికే వివిదస్పద ఉద్యోగిగా పేరు తెచ్చుకున్న ఆయన తాజాగా సరికొత్త వివాదానికి తావిచ్చారు. పార్కింగ్లో ఉంచుకోవాల్సిన తన బైకును ఏకంగా ఉప్పుగుండూరు పంచాయతీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో పార్క్ చేశారు. దీనిపై సిబ్బంది, స్థానికులు సైతం విస్మయం వ్యక్తం చేశారు. శుక్రవారం ఉప్పుగుండూరులో ఒక మోస్తారు వర్షం పడడంతో ఆయన బండిని కార్యాలయం లోనికి తీసుకొచ్చారు. తీసుకొచ్చి బయట వరండాలో పార్కు చేశాడా..? అంటే అదీ లేదు. ఏకంగా కంప్యూటర్ గది పక్కన ఉన్న సమావేశ మందిరంలో పార్కింగ్ చేశారు. ఇక్కడ పంచాయతీ సమావేశాలు జరగడం, కార్యాలయానికి వచ్చే వారు వేచిచూస్తూ పత్రికలు చదడం చేస్తుంటారు. ఈయన మాత్రం ఏకంగా ఈ బైకుకు దీన్ని పార్కింగ్ స్థలంగా మార్చేవాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img