Friday, May 3, 2024
Friday, May 3, 2024

ఒంగోలు జాతి పశు సంపదను సంరక్షించుకోవాలి

విశాలాంధ్ర – నాగులుప్పలపాడు :- ఒంగోలు జాతి పశుసంపదను కాపాడుకోవాలని పశుసంవర్ధక శాఖ జిల్లా సంయుక్త సంచాలకులు జే బేబీ రాణి సూచించారు. రాష్ట్రీయ గోకుల్ మిషన్,ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ మరియు పశుగణాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో కృత్రిమ గర్భధారణ సౌకర్యము సకాలములో అందుబాటు అవకాశం లేని ప్రకాశం జిల్లా పశ్చిమ మండలాలు యర్రగొండపాలెం, పుల్లలచెరువు, చంద్రశేఖర పురం రైతులకు చదలవాడ పశుక్షేత్రంలో అభివృద్ధి చేసిన మేలు జాతి ఒంగోలు కోడె దూడలను పశుసంవర్ధక జె డి ఏ బేబీ రాణి ఉచితంగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జె డి ఏ మాట్లాడుతూ చదలవాడ పశుక్షేత్రంలో మేలైన ఒంగోలు జాతి పశుసంపదను అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు . డిడి రవికుమార్ ఒంగోలు జాతి పశు సంపద అభివృద్ధికి కృషి చేస్తున్నాడని అభినందించారు ఒంగోలు జాతి పశు సంపద కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు దేశ విదేశాల్లో మన దేశ ఖ్యాతిని చాటుతున్నాయన్నారు అనంతరం సుమారు 20,000 విలువచేసే ఒక్కో కోడె దూడను 16 మంది రైతులకు ఉచితంగా ఇవ్వడంతో పాటు వాటి పోషణ మరియు ఆరోగ్య సంరక్షణ కొరకు ఒక్కో కోడె దూడకు 9400 ప్రభుత్వం అందించటం జరుగుతుందన్నారు. రైతులు వాటిని తమ మందలలో చక్కగా పోషించుకుని సహజ సంపర్కం అవసరముల కొరకు వినియోగించుకుని ఒంగోలు జాతిని పశు సంపదను అభివృధి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పశుగణాభివృద్ధి సంస్థ కార్యనిర్వాహణ అధికారి షేక్ కాలేశా పశుక్షేత్ర ఉపసంచాలకులు డాక్టర్ బి రవి పశుసంవర్ధక శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img