Friday, May 3, 2024
Friday, May 3, 2024

ఉప్పుగుండూరు అధికార పార్టీలో చిత్రమైన పరిస్థితి

విశాలాంధ్ర – నాగులుప్పలపాడు : ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో సొంత పార్టీ నాయకులు నుండే నిరసన సెగ తగిలింది. మండలంలోని అతిపెద్ద రాజకీయ చైతన్యం కలిగిన గ్రామయిన ఉప్పుగుండూరులో బుధవారం అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలు విచిత్రంగా కనిపించాయి. ఓవైపు ఎమ్మెల్యే టిజెఆర్ సుధాకర్ బాబు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభించి కొనసాగిస్తుండగా అదే పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు ఎమ్మెల్యే కార్యక్రమాన్ని బహిష్కరించి ఆయన తీరును నిరసిస్తూ నాయకులు మహిళా కార్యకర్తలు సైతం నల్ల బ్యాడ్జీలు జండాలు ఫ్లకార్డులు పార్టీ జెండాలను పట్టుకొని వైయస్సార్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం కొనసాగించారు .వివరాల్లోకెళితే గత కొద్దిరోజుల నుంచి ఉప్పుగుండూరులో నిర్వహించ తలపెట్టిన గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ఎట్టకేలకు ఈనెల 26 నుండి ప్రారంభం కాగా ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ఉప్పుగుండూరు పరబీడు కాలనీలో నిర్వహిస్తుండగా గ్రామానికి చెందిన సీనియర్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దిసాని నాగేశ్వరరావు ఇమ్మిశెట్టి బాలకృష్ణ తోపాటు పలువురు నాయకులు కార్యకర్తలు గడపగడపకు కార్యక్రమంలో పాల్గొనలేదు ఎమ్మెల్యే సుధాకర్ బాబు నిజమైన పార్టీ నాయకులు కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నాడని భుజాలపై జెండాలు మోసిన వారికి అవమానాలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ జోరు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నల్ల జెండాలు ఫ్లకార్డులు పార్టీ జెండాలు చేతబట్టి దిన్నె మీదనున్న వైయస్సార్ విగ్రహం వద్ద నుండి బస్టాండ్ సెంటర్లోని వైయస్సార్ విగ్రహం వద్దకు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించి ఎమ్మెల్యే సుధాకర్ బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమం కొనసాగించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గడచిన ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కష్టపడి స్థానికుడు కాకపోయినప్పటికిని సుధాకర్ బాబును ఎమ్మెల్యేగా గెలిపించుకున్నామన్నారు అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ అభివృద్ధి నాయకులు కార్యకర్తల సంక్షేమాన్ని గుర్తిస్తాడని ఎంతో ఆశగా ఎదురు చూశామన్నారు కానీ ఎమ్మెల్యే అయిన సుధాకర్ బాబు సొంత పార్టీ నాయకుల పట్టించుకోకపోగా ఎన్నికల సమయంలో ఆయనకు వ్యతిరేకంగా పనిచేసిన వారిని తెచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నాడన్నారు నిజాయితీ కలిగిన పార్టీ నాయకులు కార్యకర్తలను మరింత అణగదొక్కే ప్రయత్నం చేశాడన్నారు ఇదేమి అన్యాయం అని అడిగితే పార్టీ కార్యకర్తల పైన అక్రమ కేసులు బనాయించడం జరిగిందన్నారు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలను నిర్వహిస్తూ తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పార్టీ సిద్ధాంతాలను ఏమాత్రం పట్టించుకోకుండా పార్టీ మనుగడకే ముప్పు తీసుకొచ్చాడన్నారు. రెక్కాడితే గాని డొక్కాడని పేద కార్యకర్తలకు సైతం జగనన్న కాలనీలో సెంటు స్థలం ఇవ్వకపోగా తనకి ఇష్టం వచ్చిన వారికి స్థలాలు కేటాయించుకోవడం జరిగిందన్నారు ఇదేమి న్యాయమని అడిగిన సొంత పార్టీ వారిపై అక్రమ కేసులు బనాయించి పైశాచికానందం పొందాడన్నారు. దోచుకోవటం దాచుకోవడమే పనిగా పనిచేస్తున్నాడన్నారు. ఇప్పటికే అనేకసార్లు ఉప్పుగుండూరులో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం వాయిదా పడిందన్నారు గ్రామంలో నెలకొన్న సమస్యలను, నాయకుల మధ్య విభేదాలను ఏమాత్రం పరిష్కరించకుండా ఒంటెద్దు పోకడగా ఎమ్మెల్యే వ్యవహరించడం సరికాదన్నారు. వ్యాపారస్తులు పార్టీ అధికారంలో ఉన్నన్నాళ్లే ఉంటారని తర్వాత వారి దారి వారు చూసుకుంటారని నిజమైన పార్టీ నాయకులు కార్యకర్తలే మనకు ముఖ్యమని ఎన్నోసార్లు ఎమ్మెల్యేకు నచ్చచెప్పిన పెడచెవిన పెట్టాడన్నారు. గతంలో అనేకసార్లు పార్టీ కార్యక్రమాలు నిర్వహించినప్పుడు అడ్డకూలీలను తీసుకువచ్చి కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సిన పరిస్థితి ఎదురైందన్నారు ఏరా ఇప్పుడు కూడా ఇంత పెద్ద మేజర్ పంచాయతీలో ఎంతో పెద్ద మొత్తంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకు ఉండగా మళ్లీ అద్దె కూలీలని తీసుకొచ్చి గడపగడప కార్యక్రమం చేసుకోవడం ఎమ్మెల్యే దిక్కుమాలిన పరిస్థితికి నిదర్శనం అన్నారు పార్టీకి పట్టుకొమ్మలైన కార్యకర్తలపై నమోదు చేసిన అక్రమ కేసులు తొలగించాలని డిమాండ్ చేశారు అర్హులైన పార్టీ కార్యకర్తలకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలన్నారుకార్యక్రమంలో నంబూరు నాగయ్య, అత్తంటి వినోద్, కొలకలూరి సాంసంన్, గురజాల పౌలు పాదర్తి శివ కత్తి నాగార్జున,కొలకలూరి ప్రసాదు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img