Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

‘ఏపీపీఎస్సీ’ ముట్టడి

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని కోరుతూ డీవైిఎఫ్‌ఐ, నిరుద్యోగ సంఘాల నాయకులు సోమవారం ఏపీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడిరచారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. విజయవాడ బందరురోడ్డులో ఉన్న ఏపీపీఎస్సీ కార్యాలయానికి నిరుద్యోగులతో కలిసి ఏఐవైఎఫ్‌ నేతలు చేరుకోవడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులు, యువజన నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీ సుల చర్యల్ని విద్యార్థి, యువజన సంఘాల నేతలు ఖండిరచారు. అనంతరం డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు రామన్న, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.రాము, నేతలు ఎన్‌. నాగేశ్వరరావు, పి.కృష్ణ, నిజామ్‌లను పోలీసులు అరెస్టు చేసి విజయవాడలోని గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్‌కు తర లించారు. అంతకుముందు డీవైిఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు రామన్న మాట్లాడుతూ.. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ఖాళీ ఉద్యాగాలన్నింటినీ భర్తీ చేయకుండా జాబ్‌ క్యాలెం డర్‌ విడుదల చేయడం నిరుద్యోగ యువతను మోసగిం చడమేనని విమర్శిం చారు. రాష్ట్రప్రభుత్వ శాఖల్లో రెండు లక్షలకుపైగా ఖాళీలు ఉండగా, సీఎం విడుదల చేసిన క్యాలెండరులో కేవలం 10,144 పోస్టులనే పేర్కొనడం దుర్మార్గ మన్నారు. కాగా యువజన నాయకుల అరెస్టులను వివిధ రాజకీయ పక్షాలు, విద్యార్థి, యువజన సంఘాలు తీవ్రంగా ఖండిరచాయి.
అరెస్టయిన యువజన నేతలకు రామకృష్ణ పరామర్శ
యువజన నేతల అరెస్టును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తీవ్రంగా ఖండిరచారు. ఆయన గవర్నర్‌ పేట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి అరెస్టయిన డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు రామన్న తదితరులను పరామర్శించి, యువత చేపట్టిన ఆందోళనకు మద్దతు తెలిపారు. రామకృష్ణతో పాటు ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.రాజేంద్రబాబు, ఎన్‌.లెనిన్‌బాబు, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి. సుబ్బారావు, రాష్ట్ర నాయకులు జాన్సన్‌బాబు, సాయి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ఉద్యోగాలివ్వమని కోరిన యువజన నేతలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం తగదన్నారు. వైసీపీ ప్రభుత్వం యువతను కేవలం ఓట్లు వేసే యంత్రాలుగానే చూస్తున్న దనీ, రెండేళ్ల పాలన తదుపరి మొక్కుబడిగా 10,143 ఉద్యోగాల భర్తీకి ఆర్భాటంగా సీఎం జగన్‌ జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసి చేతులు దులుపుకోవడం దుర్మా ర్గమన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీని జగన్‌మోహన్‌రెడ్డి విస్మరించారన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.35 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. వలంటీర్లను ఉద్యోగస్తు లుగా ప్రకటించిన సీఎం..వారికి కనీస వేతనాలి వ్వమంటే ‘సేవకులు’గా వ్యాఖ్యానించడం కప్పదాటు వైఖరికి నిదర్శనమన్నారు. లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలపై నీళ్లుచల్లిన ప్రభుత్వ వైఖరిపై యువత కన్నెర్ర జేసే సమయం ఆసన్నమైందన్నారు.
నేడు నిరుద్యోగ, యువజన, విద్యార్థి సంఘాలతో ముఖాముఖి
జాబ్‌ క్యాలెండర్‌పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణతో నిరుద్యోగులు, యువజన, విద్యార్థి సంఘాల నేతలు మంగళవారం ముఖాముఖి కార్యక్రమం నిర్వహిం చనున్నారు. జూమ్‌ యాప్‌ ద్వారా నిర్వహించే ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి నిరుద్యోగ, యువజన, విద్యార్థి నేతలు పాల్గొంటారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img