Monday, September 26, 2022
Monday, September 26, 2022

కోహ్లీ సంచలనం టీ20 కెప్టెన్సీకి గుడ్‌బై!

న్యూదిల్లీ : టీమిండియాకు మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా ఉన్న విరాట్‌ కోహ్లీ సంచలన ప్రకటన చేశాడు. తాను టీ20 ప్రపంచకప్‌ తర్వాత పొట్టి ఫార్మాట్‌ కెప్టెన్సీ నుంచి తప్పు కోనున్నట్లు సామాజిక మాధ్యమం ద్వారా తెలిపాడు. పని ఒత్తిడి వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోహ్లీ స్పష్టం చేశాడు. దీంతో టీ20 జట్టుకు రోహిత్‌ శర్మను సారథిగా నియమించే అవకాశం ఉంది. మరోవైపు విరాట్‌ తీసుకున్న నిర్ణ యంతో అభిమానులు షాక్‌కు గురయ్యారు. ‘భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించడం అదృష్టంగా భావిస్తున్నా. సారథిగా నా ప్రయాణంలో అండగా ఉన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. జట్టు సభ్యులు, సహాయక సిబ్బంది, సెలక్షన్‌ కమిటీ, కోచ్‌లు, ప్రతి భారతీయుడి ప్రార్థనలతోనే ఇదంతా సాధించా. 8-9 ఏళ్లుగా మూడు ఫార్మాట్లకు ఆడుతున్నా. ఐదారేళ్లుగా 3 ఫార్మాట్లకు కెప్టెన్‌గా ఉన్నా. పని ఒత్తిడి కారణంగా ఇప్పుడు తప్పుకొంటున్నా టెస్టు, వన్డేలలో జట్టును సమర్థవంతంగా ముందుకు నడిపించేందుకు ఇది దోహదపడుతుంది. టీ20 కెప్టెన్‌గా నా కెరీర్‌లో జట్టుకు కావాల్సిన ప్రతిదీ చేశా. టీ20 బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతాను. ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం పట్టింది. రవిభాయ్‌, రోహిత్‌తో ఎన్నో సుదీర్ఘ చర్చలు జరిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నా. ఈ విషయం గురించి బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, సెక్రటరీ జైషా, సెలక్టర్లతో మాట్లాడాను. నా వంతుగా జట్టుకు అత్యుత్తమ సేవలందిస్తా’ అందిస్తానంటూ కోహ్లీ వివరిం చాడు. కోహ్లీ టీమిండియాకు 45 టీ20 మ్యాచ్‌ లకు సారథ్యం వహించాడు. వీటిలో 29 మ్యాచ్‌ల్లో టీమిండియా గెలవగా.. 13 మ్యాచ్‌ల్లో ఓడిపో యింది. రెండు మ్యాచ్‌ల్లో ఫలితాలు తేలలేదు. కోహ్లీ విజయ శాతం 65.11గా ఉంది.
కోహ్లీ నిర్ణయం గురించి తెలుసు : బీసీసీఐ
కోహ్లీ తన నిర్ణయాన్ని ప్రకటించే అరగంట ముందు మాత్రమే తమకు చెప్పినట్లు బీసీసీఐ తెలిపింది. దానికి తాము అంగీకారం తెలిపినట్లు కూడా వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img