Friday, May 31, 2024
Friday, May 31, 2024

జైస్వాల్‌, మహిపాల్‌ మెరుపులు

రాజస్థాన్‌ 185 పరుగులకు ఆలౌట్‌

దుబాయ్‌: ఐపీఎల్‌లో భాగంగా రాజస్థాన్‌ రాయల్స్‌`పంజాబ్‌ కింగ్స్‌ జట్ల మధ్య ఇక్కడ జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ బ్యాట్స్‌మెన్‌ రాణించారు. టాస్‌ గెలిచిన పంజాబ్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోవడం బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ జట్టు 20 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌట్‌ అయింది. ప్రత్యర్థి పంజాబ్‌కు ముందు భారీ విజయ లక్ష్యాన్ని ఉంచింది. యశస్వి జైస్వాల్‌ ఒక్క పరుగుతో అర్ధ సెంచరీ చేజార్చుకున్నాడు. 36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 49 పరుగులు చేయగా, మహిపాల్‌ లోమ్రోర్‌ క్రీజులో ఉన్నంత సేపు చెలరేగాడు. 17 బంతుల్లోనే 2 ఫోర్లు, 4 సిక్సర్లతో విరుచుకుపడడంతో స్కోరు బోర్డు ఒక్కసారిగా పరుగులు పెట్టింది. లివింగ్‌ స్టోన్‌ కూడా తన వంతుగా 17 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌తో 25 పరుగులు చేశాడు. ఇక ఓపెనర్‌ ఎవిన్‌ లూయిస్‌ చక్కగా ఆడాడు. బౌలర్లకు దొరక్కుండా అనువైన బంతులను బౌండరీలకు పంపిస్తూ జట్టు భారీ స్కోరుకు పునాది వేశాడు. మొత్తంగా 21 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో 36 పరుగులు చేశాడు. మిగతా వారిలో ఎవరూ పది పరుగులు కూడా చేయలేకపోయారు. పంజాబ్‌ బౌలర్లలో అర్షదీప్‌ ఐదు వికెట్లు పడగొట్టి రాజస్థాన్‌ బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించాడు. షమీ మూడు వికెట్లు తీసుకోగా, ఇషాన్‌ పోరెల్‌, హర్‌ప్రీత్‌ బ్రార్‌ చెరో వికెట్‌ తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img