Sunday, August 14, 2022
Sunday, August 14, 2022

టోక్యో ఒలింపిక్స్‌లో మేరీకోమ్‌ ఓటమి..

మహిళల బాక్సింగ్‌లో ఆరుసార్లు వరల్డ్‌ ఛాంపియన్‌గా నిలిచిన మేరీకోమ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. టోక్యో ఒలింపిక్స్‌లో మేరీకోమ్‌ ప్రీక్వార్టర్స్‌లోనే ఇంటిముఖం పట్టింది. గురువారం మహిళల 51 కేజీల ప్రిక్వార్టర్స్‌లో కొలంబియా బాక్సర్‌ వాలెన్సియా చేతిలో 2-3 తేడాతో పరాజయాన్ని చవిచూసింది. టోక్యో ఒలింపిక్స్‌లో మొత్తం 9 మంది భారత బాక్సర్లు బరిలోకి దిగారు. ఒలింపిక్స్‌కి అర్హత పొందిన తర్వాత మేరీకోమ్‌తో పాటు బాక్సర్లందరూ ఇటలీకి వెళ్లి మరీ శిక్షణ తీసుకున్నారు. టోక్యోకి కూడా అక్కడి నుంచే మేరీకోమ్‌ వెళ్లడం విశేషం. ఈ ఒలింపిక్స్‌లో పతకం గెలవడం ద్వారా ఘనంగా కెరీర్‌కి వీడ్కోలు పలకాలని మేరీకోమ్‌ ఆశించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img