Sunday, May 26, 2024
Sunday, May 26, 2024

డీకాక్‌ క్షమాపణలు

ఇకనుంచి మోకాళ్లపై కూర్చుంటా!!

దుబాయ్‌: దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌, మాజీ కెప్టెన్‌ క్వింటన్‌ డికాక్‌ ఎట్టకేలకు దిగొచ్చాడు. ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’ ఉద్యమానికి తాను మద్దతు తెలుపుతానని చెప్పాడు. జాత్యహంకారానికి వ్యతిరేకంగా నిలబడటం పాముఖ్యతను అర్థం చేసుకున్నానన్నాడు. ఒమన్‌, యూఏఈలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ 2021లో ఇకపై దక్షిణాఫ్రికా జట్టు ఆడే ప్రతి మ్యాచులో తాను మోకాళ్లపై కూర్చుని సంఫీుభావం తెలుపుతానని డికాక్‌ స్పష్టం చేశాడు. బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌ విషయంలో పొరపాటు చేసినందుకు తనను సహచరులు, అభిమానులు క్షమించాలని కోరాడు. ఈ మేరకు గురువారం ట్విటర్‌ ఖాతాలో డికాక్‌ ఓ పోస్ట్‌ చేశాడు.
ఎక్కడ మ్యాచ్‌ జరిగినా
గత ఏడాది మేలో అమెరికాలో నల్లజాతీయుడైన జార్జ్‌ ఫ్లాయిడ్‌.. శ్వేత జాతీయుడైన పోలీసు అధికారి కర్కశత్వానికి బలైన విషయం తెలిసిందే. ఈ ఘటన అందరినీ కదిలించింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’ తెరపైకి వచ్చింది. ఈ ఉద్యమానికి ప్రపంచవ్యాప్తంగా ఎందరో మద్దతు ఇచ్చారు. అన్ని రంగాల క్రీడాకారులు కూడా పెద్దఎత్తున ముందుకువచ్చారు. క్రికెట్లోనూ అది కొనసాగుతోంది. ఎక్కడ మ్యాచ్‌ జరిగినా ఏదో ఓ రూపంలో ప్లేయర్స్‌ అందరూ ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’ ఉద్యమానికి మద్దతు ఇస్తూనే ఉన్నారు.
ససేమేరా అన్న డికాక్‌
టీ20 ప్రపంచకప్‌ 2021లో కూడా ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’ ఉద్యమానికి ప్లేయర్స్‌ మద్దతుగా నిలిచారు. అన్ని జట్ల ఆటగాళ్లు తమకి తోచిన విధంగా మోకాళ్లపై కూర్చుని లేదా నిల్చొని సంఫీుభావం తెలుపుతున్నారు. కానీ దక్షిణాఫ్రికా స్టార్‌ ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ మాత్రం ససేమేరా అన్నాడు. నిజానికి ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి మ్యాచ్‌లోనూ ‘బ్లాక్‌ లైవ్‌ మ్యాటర్‌’కి సంఫీుభావం తెలిపేందుకు డికాక్‌ నిరాకరించాడు. మైదానంలోని సహచరులు మోకాళ్లపై కూర్చున్నా.. డికాక్‌ మాత్రం దిక్కులు చూస్తూ నిల్చొన్నాడు. దాంతో వెస్టిండీస్‌తో మ్యాచ్‌కి ముందు దక్షిణాఫ్రికా ఆటగాళ్లకి ఆ దేశ క్రికెట్‌ బోర్డు కచ్చితంగా సంఫీుభావం తెలపాలని హుకుం జారీ చేసింది. కానీ డికాక్‌ తిరస్కరించడంతో అతడ్ని వెస్టిండీస్‌తో మ్యాచ్‌ నుంచి తప్పించినట్లు తెలుస్తోంది.
క్షమాపణలు చెపుతున్నా
‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’ విషయంలో క్వింటన్‌ డికాక్‌పై సర్వత్రా విమర్శల వర్షం కురిసింది. దాంతో తప్పు తెలుసుకున్న డికాక్‌ అందకీి క్షమాపణలు చెప్పాడు. ‘ముందుగా నేను నా సహచరులకు, అభిమానులకు క్షమాపణలు చెపుతున్నా. నేను ఎప్పుడూ దీన్ని సమస్యగా మార్చాలనుకోలేదు. జాత్యాహంకారినికి వ్యతిరేకంగా నిలబడటం వెనక ఉన్న ప్రాముఖ్యతను నేను అర్థం చేసుకున్నాను. క్రీడాకారుల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడంలో ఉన్న బాధ్యతనూ తెలుసుకున్నాను. ఒకవేళ నేను మోకాళ్ల మీద కూర్చోవడం ద్వారా అది ఇతరులకు రేసిజం గురించి అవగాహన కల్పిస్తుందనుకుంటే ఆ బాధ్యతను నేను ఎంతో సంతోషంగా స్వీకరిస్తాను’ అని డికాక్‌ ట్వీట్‌ చేశాడు.
నా సోదరీమణుల రంగు కూడా నలుపే
‘వెస్టిండీస్‌ ఆటగాళ్లను అవమానించడం నా ఉద్దేశం ఏ మాత్రం కాదు. ఇది మంగళవారం ఉదయం జరగడం వల్ల అందరూ అలా అనుకుని ఉండొచ్చు. ఈ విషయాలపై నేను చాలా చింతిస్తున్నా. అందరికి ఓ విషయం చెప్పాలనుకుంటున్నా.. నేను మిశ్రమ జాతి కుటుంబం నుంచి వచ్చాను. నా పిన తల్లి నల్ల జాతీయురాలు. నా సోదరీమణుల రంగు కూడా నలుపే. అందరికీ హక్కులు, సమానత్వం చాలా ముఖ్యం. మనందరికీ హక్కులున్నాయని, అవి ముఖ్యమైనవని అర్థం చేసుకుంటూనే నేను పెరిగాను. బోర్డుతో నా సమావేశం చాలా ఎమోషనల్‌గా ముగిసింది. అందరూ నన్ను అర్ధం చేసుకున్నారనే అనుకుంటున్నా’ అని క్వింటన్‌ డికాక్‌ భావోద్వేగానికి గురయ్యాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img