చెన్నై: ముంబై ఇండియన్స్ బౌలర్ ఆకాశ్ మద్వాల్‌పై ప్రశంసలు జల్లు కురుస్తోంది. బుధవారం జరిగిన ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నోను తీవ్రంగా దెబ్బతీసిన మద్వాల్ బౌలింగ్‌ను మాజీ క్రికెటర్లు కొనియాడుతున్నారు. 3.3 ఓవర్లలో 5 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకున్న మద్వాల్ ఇప్పుడో స్టార్ బౌలర్ అయ్యాడు. భారత మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే సైతం మద్వాల్ బౌలింగ్‌ను మెచ్చుకున్నాడు. కుంబ్లేతో పాటు అనేక మంది మాజీ క్రికెటర్లు మద్వాల్ బౌలింగ్ ప్రతిభను విశేషంగా ప్రశంసిస్తున్నారు. లక్నోతో పాటు హైదరాబాద్ జట్టుపై అద్భుత ప్రదర్శన ఇచ్చిన అతన్ని కీర్తిస్తున్నారు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో 5 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసిన మద్వాల్‌ను… ముంబై జట్టు ఇండియాకు అందించినట్లు కైఫ్ తన ట్వీట్‌లో తెలిపాడు.