Monday, August 15, 2022
Monday, August 15, 2022

మయాంక్‌ తలకు గాయం.. తొలి టెస్టుకు దూరం

లండన్‌ : టీమిండియా ఓపెనర్‌ మయాంక్‌ అగ ర్వాల్‌కు గాయమైంది. సిరాజ్‌ వేసిన బంతి తలకు తగి లింది. సోమవారం ప్రాక్టీస్‌ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. టీమ్‌ ఇండియా ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ తలకు గాయమైంది. భారత్‌`ఇంగ్లాండ్‌ క్రికెట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా బుధవారం నుంచి నాటింగ్‌హామ్‌లోని టెంట్‌ బ్రిడ్జి మైదానంలో తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఇందుకోసం రెండు జట్ల ఆటగాళ్లు నెట్స్‌లో కఠోర సాధన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రాక్టీస్‌ చేస్తుండగా మయాంక్‌ గాయపడ్డాడు. మహ్మద్‌ సిరాజ్‌ వేసిన బంతిని ఎదుర్కొనే క్రమంలో అగర్వాల్‌కు గాయమైంది. ఈ గాయం కారణంగానే ఇంగ్లాండ్‌తో తొలిటెస్టుకు మయాంక్‌ దూరమయ్యాడు. అయితే మయాంక్‌ స్థానంలో ఓపెనర్‌గా కేఎల్‌ రాహుల్‌ వచ్చే అవకాశం ఉంది. బంగాల్‌ ఓపెనర్‌ అభిమన్యు ఈశ్వరన్‌ కూడా ఈ వరుసలో ఉన్నాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img