Friday, April 26, 2024
Friday, April 26, 2024

హాకీలో భారత్ విజయాలు ఎంత అపురూపమంటే ?

ఒలింపిక్స్  హాకీలో ఒకప్పుడు భారత్ది స్వర్ణయుగం. దిగ్గజ ఆటగాడు ధ్యాన్చంద్ ఉన్నప్పుడు భారత్ది ప్రపంచ దేశాలపై అందెవేసిన చేయి.. ఆ తర్వాత కూడా కొన్నాళ్ల పాటు భారత్ ప్రపంచ హాకీ పోటీల్లో తనదైన ముద్రవేసింది. అయితే ఈ చరిత్రకు చెదలు పట్టేసి ఏకంగా నాలుగు దశాబ్దాలు దాటుతోంది. భారత్ చివరిసారిగా 1980 మాస్కో ఒలింపిక్స్లో పతకం గెలిచింది. ఆ తర్వాత భారత్ ఎప్పుడూ తొలి రౌండ్లోనో లేదా రెండో రౌండ్లోనే వెనక్క వచ్చేయడం కామన్ అయిపోయింది. ఇక చాలా రాష్ట్రాల్లో ఉన్న హాకీ స్టేడియాలు కాస్తా క్రికెట్ స్టేడియాలు అయిపోయాయి. మధ్యలో కొన్ని తరాల యువత అయితే హాకీ అన్న ఆటే మర్చిపోయింది. ఎంత దారుణం అంటే భారత జాతీయ క్రీడగా ఉన్న హాకీకి ఈ దుస్థితి వస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు.రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతోన్న క్రికెట్ దెబ్బకు హాకీ కునారిల్లుతూనే ఉంది. ఇక ఉన్నంతలో ఒక్క పంజాబ్ మాత్రమే ప్రతి యేటా క్రమం తప్పకుండా హాకీ ప్లేయర్లను తయారు చేస్తోంది. అందుకే భారత హాకీ జట్టులో ఎక్కువుగా పంజాబ్ ప్లేయర్లే మనకు దర్శనం ఇస్తారు. అలాంటి దయనీయ స్థితి నుంచి ఒక్కసారిగా భారత హకీ వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఒలింపిక్స్లో మన పురుషుల మహిళల జట్ల ప్రదర్శన చూస్తుంటే మనకు మళ్లీ ప్రపంచ స్థాయిలో పూర్వవైభవం వస్తుందన్న నమ్మకాలు కలుగుతున్నాయి.ఇక తాజా ఒలింపిక్స్లో 40 సంవత్సరాల తర్వాత మన పురుషుల హాకీ టీం ఓ పతకం కోసం పోటీ పడే స్టేజ్లో ఉంది. ఇది నిజంగా కోట్లాది మంది భారతీయులు గర్వించదగ్గ విషయమే.. !  అటు పురుషుల హాకీ టీంతో పోటీ అన్నట్టుగా మన మహిళల హాకీ జట్టు కూడా సెమీస్కు చేరుకుని సంచలనాలు నమోదు చేసింది. ఈ రెండు టీంలు కూడా సెమీఫైనల్స్లో పటిష్టమైన జట్లతో ఆడుతున్నాయి. పురుషుల జట్టు హాకీ ప్రపంచ చాంఫియన్ బెల్జిడంతో ఆడుతుంటే.. మరో బలమైన జట్టుతో సెమీస్ ఆడనుంది. విచిత్రం ఏంటంటే గ్రూప్ స్టేజ్లో ఐదు వరుస విజయాలతో దూసుకుపోతోన్న ఆస్ట్రేలియాను క్వార్టర్ ఫైనల్స్లో మన మహిళల టీం చిత్తు చేసి సెమీస్కు చేరుకుంది. ఏదేమైనా ఈ మ్యాచ్లలో భారత జట్లు గెలవచ్చు…. ఓడిపోవచ్చు. కానీ ఇన్నేళ్ల తర్వాత మాత్రం మన జాతీయ క్రీడకు మాత్రం మంచి స్ఫూర్తిని ఇచ్చారు. గంటల తరబడి క్రికెట్ మ్యాచ్లు చూసే యువత 60 నిమిషాల పాటు ఉండే హాకీ మ్యాచ్ను కూడా చూడడానికి అలవాటు పడితే హాకీకి కూడా భవిష్యత్తులో ఆదరణ పెరుగుతుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img