Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఇవ్యర్థం.. ఒలింపిక్‌ పతకం

టోక్యో : ఇటీవల ముగిసిన ఒలిపింక్స్‌2020 క్రీడల్లో విజేతలకు అందించిన బంగారు, వెండి, కాంస్య పతకాలు ఎలా తయారయ్యా యో తెలిస్తే షాకవుతారు.. ఆ పతకాలన్నీ ఎలక్ట్రానిక్‌ వ్యర్థాల నుంచి తయారైనవే. పాత ఎలక్ట్రానిక్‌ పరికరాల్లో బంగారం, వెండి వంటి లోహాలుంటాయి. వీటిని విడగొట్టి, సంగ్రహించ గలిగితే బోలెడంత బంగారాన్ని, వెండిని వెలికి తీయొచ్చు. అందుకే ఒలింపిక్స్‌ విజేతలకు బహూకరించే పతకాలన్నింటినీ ఇ-వ్యర్థాల నుంచే తయారు చేయాలని జపాన్‌ సంకల్పించి ంది. ఇందుకోసం రెండేళ్ల పాటు బృహత్తర ఉద్యమమే నడిపించింది. పాత ఎలక్ట్రానిక్‌ పరికరాలను దానం చేయాలని కోరటం ప్రజలనూ ఆలోచింపజేసింది. ఒలింపిక్‌ క్రీడల్లో తామూ భాగస్వామ్యం అవుతున్నామనే భావనతో సమరోత్సాహంతో పెద్ద సంఖ్యలో ప్రజలు తమ పాత మొబైళ్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లను ఇచ్చేశారు. ఈ విధంగా పోగుపడ్డ సుమారు 80 టన్నుల వ్యర్థాలను విడగొట్టి, శుద్ధిచేస్తే 32 కేజీల బంగారం, 3,492 కేజీల వెండి, 2,199 కేజీల కాంస్యం (కంచు) లభించింది. మొత్తం ఒలింపిక్‌ పతకాల న్నింటినీ వీటితోనే తయారు చేశారు. ఇలా మొత్తం ఒలింపిక్‌ పతకాలన్నింటినీ పునర్వినియోగ లోహాలతోనే రూపొందించిన మొట్టమొదటి దేశంగా జపాన్‌ చరిత్రలో నిలిచింది. రియోలో 2016లో జరిగిన ఒలింపిక్‌ క్రీడల సందర్భంగా కూడా కారు విడిభాగాలు, అద్దం ఉపరితలాల నుంచి వెండిని సేకరించారు. దీంతోనే 30% పతకాలు తయారు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img