Friday, April 26, 2024
Friday, April 26, 2024

పోరాడిన భారత్‌..

పోరాడిన భారత్‌.. సౌతాంప్టన్‌ : ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ తొలి రోజు ఆట వర్షం కారణంగా పూర్తిగా రద్దుకాగా, రెండో రోజు వెలుతురు లేమి కారణంగా రెండు సెషన్ల ఆటే సాధ్యమైంది. ఇక మూడో రోజు సైతం వాతావరణం కారణంగా ఆట కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. అయితే భారత్‌ ఆరంభంలోనే వరుసగా వికెట్లు కోల్పోయినా రహానె బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడడంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులు చేయగలిగింది. న్యూజిలాండ్‌ బౌలర్‌ జేమిసన్‌ ఐదు వికెట్లతో రాణించాడు.
పరిస్థితులకు అనుగుణంగా…
146/3 ఓవర్‌నైట్‌ స్కోర్‌ మూడో రోజు ఆటను కొనసాగించిన భారత్‌ ఓవర్‌నైట్‌ స్కోర్‌కు ఒక్క పరుగు కూడా జోడిరచకుండానే కోహ్లి వికెట్‌ కోల్పోయింది. హాఫ్‌ సెంచరీ ముంగిట కెప్టెన్‌ విరాట్‌ కోహ్ల్లి(132 బంతుల్లో 44) ఎల్బీగా వెనుదిరిగాడు. జేమిసన్‌ వేసిన అద్భుత బంతికి విరాట్‌ పెవిలియన్‌ చేరాడు. రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోయింది. పిచ్‌ నుంచి లభిస్తున్న సహకారాన్ని న్యూజిలాండ్‌ బౌలర్లు పూర్తిగా సధ్వినియోగం చేసుకున్నారు. క్రీజులోకి రిషభ్‌ పంత్‌ రాగా.. వైస్‌ కెప్టెన్‌ అజింక్యా రహానేతో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు కొనసాగించేలా కనిపించాడు. వీరిద్దరూ స్వింగ్‌ అవుతున్న బంతులను వదిలేస్తూ డిఫెన్స్‌కే ప్రాధాన్యత ఇచ్చారు. ఈ క్రమంలో జేమిసన్‌ వేసిన 74వ ఓవర్‌లో పంత్‌ బౌండరీతో తన ఖాతాను తెరిచాడు. అయితే అదే ఓవర్‌లో పంత్‌ (4) స్లిప్స్‌లో క్యాచ్‌ ఇవ్వడంతో భారత్‌ 156 పరుగుల వద్ద ఐదో వికెట్‌ కోల్పోయి కష్టాల్లో పడిరది. ఈ దశలో జడేజా రహానేకు అండగా నిలవడంతో రహానే వేగం పెంచాడు. అందిన బంతులకు బౌండరీలతో పాటు డబుల్స్‌ సాధిస్తూ వీరిద్దరూ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో రహానే అర్ధశతకానికి దగ్గరయ్యాడు. అయతే అనూహ్యంగా రహానె (49) వ్యతిగత స్కోరు వద్ద వాగ్నర్‌ బౌలింగ్‌లో పాయింట్‌లో క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. దీంతో భారత్‌ రహానే రూపంలో 182 పరుగుల వద్ద ఆరో వికెట్‌ చేజార్చుకుంది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన అశ్విన్‌ వేగంగా ఆడాడు. జడేజా క్రీజులో నిలదొక్కుకునేందుకే ప్రాధాన్యత ఇవ్వగా అశ్విన్‌ మూడు బౌండరీలు బాదాడు. దీంతో భారత్‌ 200 మార్కుని అందుకుంది. అయితే సౌథీ వీరిద్దరి భాగస్వామ్యాన్ని విడదీశాడు. అశ్విన్‌ (22) వ్యక్తిగత స్కోరు వద్ద స్లిప్స్‌లో క్యాచ్‌ ఇచ్చి ఔట్‌ కావడంతో 205 వద్ద భారత్‌ ఏడో వికెట్‌ కోల్పోయింది. టెయిలెండర్ల సాయంతో ఇన్నింగ్స్‌ను నడిపే బాధ్యతను జడేజా తీసుకున్నాడు. లంచ్‌ విరామానికి భారత్‌ ఏడు వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది. రెండో సెషన్‌ ప్రారంభమైన కొంత సమయాకే భారత్‌ మిగిలిన వికెట్లు కోల్పోయింది. ఇషాంత్‌ (4)ని జేమిసన్‌ వెనక్కి పంపాడు. తర్వాతి బంతికే బుమ్రా(0)ను సైతం జేమిసన్‌ ఔట్‌ చేయడంతో భారత్‌ 213 పరగులకు 9 వికెట్లు కోల్పోయింది. అదే ఓవర్లో క్రీజులోకి వచ్చిన షమీ బౌండరీ బాదాడు. బౌల్ట్‌ వేసిన తర్వాతి ఓవర్‌ తొలి బంతికే జడేజా (15)ను ఔట్‌ చేయడంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌కు తెర పడిరది. కివీస్‌ బౌలర్లలో కైల్‌ జేమిసన్‌ ఐదు వికెట్లతో మెరవగా బౌల్ట్‌, వాగ్నర్‌ రెండేసీ వికెట్లు, సౌథీ ఒక వికెట్‌ దక్కించుకున్నారు.
కివీస్‌ ఆచితూచి..
న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు టామ్‌ లాథమ్‌, కాన్వే ఆరంభించారు. పరిస్థితులు, వికెట్‌ భóారత బౌలర్లకు అనుకూలంగా ఉన్నా వారిని సమర్ధవంతంగా ఎదుర్కొంటూ కివీస్‌ ఓపెనర్లు ఇన్నింగ్స్‌ను కొనసాగించారు. 19 పరుగుల వద్ద ఆటకు వర్షం కొంత సమయం ఆటకం కలిగించిన వెంటనే తిరిగి ఇన్నింగ్స్‌ ప్రారంభమైంది. కివీస్‌ ఓపెనర్లు మాత్రం ఆత్మరక్షణకే ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగగా, టీ విరామానికి 21 ఓవర్లు ముగిసే సమయానికి న్యూజిలాండ్‌ వికెట్‌ నష్టపోకుండా 36 పరుగులు చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img