Friday, April 26, 2024
Friday, April 26, 2024

వారి విజయం చరిత్రలో నిలుస్తుంది

క్రీడామంత్రి అనురాగ్‌ ఠాకూర్‌
పారాలింపిక్స్‌ విజేతలకు ఘన సత్కారం

న్యూదిల్లీ : టోక్యో పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులను కేంద్రప్రభుత్వం సన్మానించింది. బుధవారం దిల్లీలో నిర్వహిం చిన కార్యక్రమంలో క్రీడామంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ క్రీడాకారులను ఘనంగా సత్కరిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వారి విజయం చరిత్రలో నిలిచిపోతుందనన్నారు. టోక్యో పారాలింపిక్స్‌లో మన అథ్లెట్లు చరిత్ర సృష్టించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 19 పతకాలు గెలుచుకున్నారు. దీంతో మన క్రీడాకారులపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయంటూ క్రీడా మంత్రి వ్యాఖ్యా నించారు. ‘వాళ్ల విజయం చరిత్రలో నిలిచిపో యింది. గతసారి 19మంది అథ్లెట్లు పోటీలకు వెళ్తే.. ఈసారి 19 పతకాలు తీసుకొచ్చారు. ఈ విషయమై మనందరం వారికి స్టాండిరగ్‌ ఓవేషన్‌ ఇవ్వాలి’ అని అన్నారు. దీంతో కార్యక్రమంలో ఉన్నవాళ్లందరూ నిలబడి, చప్పట్లతో పారాలింపిక్స్‌ విజేతలను అభినందించారు. సుమిత్‌ (జావెలిన్‌ త్రో), కృష్ణ నాగర్‌ (బ్యాడ్మింటన్‌), ప్రమోద్‌ భగత్‌ (బ్యాడ్మింటన్‌), మనీశ్‌ నర్వాల్‌, అవని లేఖరా (షూటింగ్‌) స్వర్ణ పతకాలు సాధించి దేశానికే గర్వకారణంగా నిలిచిన సంగతి విదితమే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img