Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

వైజాగ్‌లో సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ సెమీస్‌


విశాలాంధ్ర`శేరిలింగంపల్లి: రీలోడెడ్‌ ఉత్తేజకరమైన సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ (సీసీఎల్‌) 2023 లీగ్‌ సెమీఫైనల్స్‌, ఫైనల్స్‌కు చేరుకుంది. లీగ్‌ స్టేజ్‌లలో నాలుగు టాప్‌ జట్లు కర్ణాటక బుల్డోజర్స్‌, వాసవి తెలుగు వారియర్స్‌, భోజ్‌పురి దబాంగ్స్‌తో ముంబైతో తలపడడంతో ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది. వైజాగ్‌లోని డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి క్రికెట్‌ స్టేడియంలో ప్రతిష్టాత్మకమైన సీసీఎల్‌ 2023 ట్రోఫీ ఫైనల్స్‌ మార్చి 24, 25 తేదీల్లో జరగనున్నాయి. సీసీఎల్‌-2023 అనేది మెస్మరైజింగ్‌, ఎంటర్టైనింగ్‌ సీజన్‌ సరదాగా అత్యంతగా ఆకట్టుకునేలా అభిమానులను అలరిస్తున్నారు ఆటగాళ్లు. గ్రౌండ్‌లో ఎనిమిది చలనచిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖ సినీ ప్రముఖుల మధ్య అద్భుతమైన టాలెంట్‌ను ప్రదర్శించారు. సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ స్థాపకుడు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ విష్ణు వర్ధన్‌ ఇందూరి మాట్లాడుతూ ఈ సీజన్‌లో ప్రతి జట్టుకు 10 ఓవర్ల చొప్పున రెండు ఇన్నింగ్స్‌లతో కూడిన కొత్త ఫార్మాట్‌తో వీక్షకులకు మరింత వినోదాన్ని అందించారని, 10 ఓవర్ల ఇన్నింగ్స్‌లో జట్లు 150కి పైగా పరుగులు చేయడం, సినీ స్టార్లు సెంచరీ చేయడం, 10 ఓవర్ల ఇన్నింగ్స్‌లో అనేక హాఫ్‌ సెంచరీలు చేయడంతో సినీ తారల అద్భుతమైన క్రికెట్‌ నైపుణ్యాలను ప్రదర్శించడం, వినోదభరితమైన వినోదం మనం చూశామని ఆయన అన్నారు. సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ డైరెక్టర్‌ తిరుమల్‌ రెడ్డి మాట్లాడుతూ, సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ అనేది భారతదేశంలోని రెండు అతిపెద్ద అభిరుచులైన సినిమాలు, క్రికెట్‌ల కలయిక. ఇది దేశంలోనే అత్యుత్తమ క్రీడా-వినోద వేదిక’’అని అన్నారు. ఈ సందర్భంగా వాసవీ గ్రూప్‌ సీఎండీ ఎర్రం విజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ ఈ సంవత్సరం సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌లో వాసవి తెలుగు వారియర్స్‌కు స్పాన్సర్‌ చేయడం సంతోషంగా ఉంది. జట్టు బాగా ఆడిరదని, ఆట మొత్తంలో పటిష్టమైన రన్‌ రేట్‌ను కొనసాగించిందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని ఆయన అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img