Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

21న ‘శాయ్‌’లో ప్రవేశాలు

విశాలాంధ్ర`విజయవాడ స్పోర్ట్స్‌ : పది నుంచి పదహారు సంవత్సరాల మధ్య వయసు గల ప్రతిభావంతులైన క్రీడాకారులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించడానికి ప్రత్యేక శిక్షణనిచ్చేందుకు స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (శాయ్‌) ట్రైనింగ్‌ సెంటర్‌, విశాఖపట్నం వారు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్ర ప్రదేశ్‌ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌) వైస్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరక్టర్‌ డాక్టర్‌ ఎస్‌.ప్రభాకర్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. స్కౌటింగ్‌, నర్ట్యురింగ్‌ లక్ష్యంగా క్రీడాకారులకు శాయ్‌ అత్యంత నిష్ణాతులైన శిక్షకులు, తగు పౌష్టిక ఆహారం, అత్యాధునిక సదుపాయాలు కలిగిన కిట్‌, విద్యా ఖర్చులు, వైద్యం, బీమా సౌకర్యాలు అందిస్తున్నట్లు తెలిపారు. శాయ్‌, విశాఖపట్నం శిక్షణ కేంద్రంలో ఈ నెల 23, 24 వ తేదిన బాక్సింగ్‌ విభాగం (బాలురు, బాలికల రెసిడెన్షియల్‌ మరియు నాన్‌-రెసిడెన్షియల్‌)లో, 21, 22 తేదీలలో వాలీబాల్‌ విభాగం (బాలురు.. 190 సెం.మీ . అంతకు మించి ఎత్తు ఉన్నవారు.. బాలికలు 170 సెం.మీ, ఆ పైన ఎత్తు ఉన్నవారికి మాత్రమే)లో ఎంపికలు నిర్వహిస్తారని వివరించారు.
ఎంపిక సమయంలో సమర్పించాల్సిన పత్రాలు

  1. జనన ధృవీకరణ పత్రం ఒరిజినల్‌ 2. స్పోర్ట్స్‌ పార్టిసిపేషన్‌ సర్టిఫికేట్లు 3. విద్యార్హత సర్టిఫికెట్‌ల నకలు. 4. ఆరు పాస్‌ పోర్ట్‌ సైజు ఫోటోలు. 5. ఆధార్‌ కార్డు. 6. మెడికల్‌ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌. ఇతర వివరాలకు ఫోన్‌ నంబర్లు : 8247443921 (బాక్సింగ్‌), 9440587614 (వాలీబాల్‌) నందు సంప్రదించాల్సిందిగా కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img