Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

సింధు ‘కాంస్య’ భేరి

చైనా షట్లర్‌ బింగ్జియావోపై ఘన విజయం
టోక్యో ఒలింపిక్స్‌ లో భారత్‌కు మరో పతకం

భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు ఒలింపిక్స్‌`2020లో సత్తా చాటింది. కాంస్య పతకం కోసం ఆదివారం జరిగిన పోటీలో ఏ దశలోనూ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా దూకుడుగా స్మాష్‌ షాట్లు, క్రాస్‌ షాట్లు, డ్రాప్‌ షాట్లను ఆడుతూ.. చైనా క్రీడాకారిణిపై ఘన విజయం సాధించింది. ఒలింపిక్స్‌ చరిత్రలో భారత్‌ తరఫున మహిళల వ్యక్తిగత విభాగంలో వరుసగా రెండు పతకాలు గెలిచి కొత్త రికార్డు నెలకొల్పింది.

టోక్యో : ఒలింపిక్స్‌లో తెలుగు తేజం పీవీ సింధు కాంస్య పతకం సొంతం చేసుకుంది. వరసగా రెండో ఒలింపిక్స్‌లోనూ పతకం సాధించి సింధు రికార్డు నెలకొల్పింది. 2016 రియో ఒలిపింక్స్‌లో రజత పతకం సాధించిన సింధు.. ఈసారి కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. పతకం అంచనాల ఒత్తిడి మధ్య బరిలో దిగిన సింధు… ఎక్కడా తడబాటు లేకుండా చైనా క్రీడాకారిణి ప్రపంచ తొమ్మిది ర్యాంకు క్రీడాకారిణి బింగ్జియావోను వరుస గేముల్లో మట్టికరిపించింది. మహిళల షటిల్‌ బ్యాండ్మింటన్‌ సింగిల్స్‌ ఈవెంట్‌లో ఆదివారం కాంస్య పతకం కోసం జరిగిన పోరులో పీవీ సింధు ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించింది. తిరుగులేని సత్తాతో తొలి గేమ్‌ను 21-13తో సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో సింధుకు బింగ్జియావో గట్టిపోటీ ఇచ్చింది. చివరకు 21-15 తేడాతో చైనా క్రీడాకారిణిపై సింధు విజయం సాధించి భారత్‌ ఖాతాలో మరో పతకాన్ని చేర్చింది. శనివారం జరిగిన బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో సింధు… చైనీస్‌ తైపేకి చెందిన వరల్డ్‌ నెంబర్‌ వన్‌ తై జు యింగ్‌ చేతిలో ఓటమి చెందింది. అయితే కాంస్యం కోసం జరిగిన పోరులో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా జాగ్రత్తగా ఆడిరది. పూర్తి ఎనర్జీతో, మంచి ఫుట్‌వర్క్‌తో కనిపించింది. చివరి వరకు అదే ఊపు కొనసాగించి విజయ కేతనంతో కోట్లాది భారతీయుల ముఖాల్లో ఆనందం నింపింది. కాగా, వెయిట్‌ లిఫ్టింగ్‌ లో మీరాబాయిచాను రజతం నెగ్గిన తర్వాత భారత్‌ కు టోక్యో ఒలింపిక్స్‌ లో ఇది రెండో పతకం.
రాష్ట్రపతి, ప్రధాని ప్రభృతుల అభినందనలు
ఒలింపిక్స్‌లో వరుసగా రెండుసార్లు పతకాలు గెలుచుకున్న పీవీ సింధుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ సింధును ప్రశంసిస్తూ ట్వీట్లు చేశారు. భారత్‌కు సింధు గర్వకారణమని, దేశ అత్యుత్తమ ఒలింపియన్లలో సింధు ఒకరని ప్రధాని ట్వీట్‌ చేశారు. ‘‘పీవీ సింధు.. రెండు ఒలింపిక్స్‌లో వరుసగా పతకాలు సాధించిన భారత తొలి మహిళ. స్థిరత్వం, అంకిత భావంలో ఆమె కొత్త ప్రమాణాలు నెలకొల్పింది. భారతదేశానికి కీర్తి తీసుకొచ్చిన ఆమెకు నా హృదయపూర్వక అభినందనలు’’ అని రాష్ట్రపతి ట్వీట్‌ చేశారు. భారతదేశం గర్వించేలా సింధు విజయం సాధించిందని కేంద్ర క్రీడామంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ అన్నారు. రెండు పతకాలు సాధించిన రెండో అథ్లెట్‌ ఆమె అని చెప్పారు. మీరాబాయ్‌, సింధు పతకాలు గెల్చుకున్నారు. బాక్సర్‌ లవ్లీనా కూడా పతకం గెలుస్తుందని ఆశిస్తున్నట్లు అనురాగ్‌ తెలిపారు.
ఒత్తిడిని అధిగమించింది..
తీవ్ర ఒత్తిడిని సైతం అధిగమించి పీవీ సింధు విజయం సాధించిందని ఆమె తండ్రి రమణ అన్నారు. దేశం మొత్తం సింధుకు అండగా నిలిచిందన్నారు. దేశానికి పతకం సాధించడం గర్వంగా ఉందన్నారు. వరుసగా రెండు పతకాలు సాధించడం ఆనందంగా ఉందని తెలిపారు. నిన్నటి ఓటమి గురించి మరిచి.. ఈరోజు ఆటమీద దృష్టి పెట్టాలని చెప్పానని, వ్యక్తిగత ఈవెంట్‌లో దేశానికి రెండు మెడల్స్‌ తీసుకురావడం గర్వించదగ్గదన్నారు. సింధు పతకం సాధించడం ఆనందంగా ఉందని.. సింధు తల్లి విజయ అన్నారు. సింధు మ్యాచ్‌ను చివరి నిమిషం వరకు ఉత్కంఠగా చూశానని విజయ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img