Friday, April 26, 2024
Friday, April 26, 2024

సెమీస్‌లో ఓడిన సింధు

డిస్కస్‌త్రో ఫైనల్లో కమల్‌ప్రీత్‌ కౌర్‌
వందన హ్యాట్రిక్‌..క్వార్టర్స్‌లో మహిళల హాకీ జట్టు
నిరాశ పరిచిన బాక్సర్లు

టోక్యో : భారత స్టార్‌ బ్యాడ్మింటర్‌ క్రీడా కారిణి పీవీ సింధు శనివారం జరిగిన సెమీస్‌ పోరులో ఓటమిపాలైంది. ప్రపంచ అగ్ర స్థాయి షట్లర్‌ తైజు యింగ్‌ చేతిలో ఆమె ఓడిరది. సింధు ఇక నేడు కాంస్యం కోసం పోటీపడనుంది. మహిళల డిస్కస్‌ త్రోలో కమల్‌ ప్రీత్‌కౌర్‌ ఫైనల్‌కు చేరగా, భారత మహిళల హాకీ జట్టు తమ ఆఖరి పూల్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. స్టార్‌ బాక్సర్‌ అమిత్‌ పంఘాల్‌, ఆర్చర్‌ అతానుదాస్‌ నిరాశపరిచారు.
కాంస్యం కోసం నేడు పోరు
ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌లో సెమీస్‌ పోరులో సింధుకు ప్రపంచ నెంబర్‌ వన్‌ తైజు యింగ్‌ అడ్డుపడిరది. శనివారం జరిగిన సెమీఫైనల్స్‌లో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ఓటమిపాలైంది. చైనీస్‌ తైపీ క్రీడాకారిణి తైజు యింగ్‌ చేతిలో 18-21, 12-21 తేడాతో వరుస సెట్లలో పరాజయం చెందింది. మ్యాచ్‌ ప్రారం భంలో కొంత ఆధిపత్యం చెలాయించిన సింధు.. గేమ్‌ తొలి విరామం అనంతరం వెనకంజ వేసింది. అనూహ్యంగా పుంజుకున్న తైజు తర్వాత సింధూకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా తనదైన ఆటతీరుతో గట్టి పోటీ ఇచ్చి తొలి గేమ్‌ను 1821 తేడాతో గెలుచుకుంది. ఇక రెండో గేమ్‌లో దూకుడు పెంచిన తైజు సింధూకు మరో అవకాశం ఇవ్వకుండా 816 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. చివరికి సింధు 12`21 తేడాతో రెండో గేమ్‌ను కోల్పోయి ఓటమిని మూట గట్టుకుంది. ఆదివారం సాయంత్రం 5 గంటలకు సింధు కాంస్యం కోసం చైనా క్రీడాకారిణి హి బింగ్జియావోతో తలపడనుంది.
మహిళల డిస్కస్‌త్రో.. ఫైనల్‌కు కమల్‌ప్రీత్‌ కౌర్‌ అర్హత
ఒలింపిక్స్‌ మహిళల డిస్కస్‌త్రో ఈవెంట్‌లో భారత్‌కు పతకం ఖాయమయ్యేలా కనిపిస్తోంది. తుదిపోరుకు నిర్వహించిన క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో శనివారం ఉద యం కమల్‌ప్రీత్‌ కౌర్‌ అద్భుత ప్రదర్శనతో రెండో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించి పతకం పై ఆశలు రేపింది. మరో వైపు భారీ అంచనాలతో బరిలో దిగిన సీమా పూనియా 16వ స్థానంలో నిలిచి నిరాశగా వెనుదిరిగింది. ఇక అమెరికా క్రీడాకారిణి వలరీ అల్మన్‌ 66.42 మీటర్లతో అగ్రస్థానంలో నిలిచింది. కమల్‌ప్రీత్‌ 64 మీటర్లతో రెండో స్థానం సంపాదించింది. ఫైనల్‌ పోటీ ఆగస్టు 2న జరగనుంది. ఫైనల్లో మొత్తంగా 12 మంది పోటీపడనున్నారు. క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో కమల్‌ప్రీత్‌ తొలి ప్రయత్నంలో 60.29 మీటర్లు విసరగా రెండో ప్రయత్నంలో 63.97 మీటర్లు డిస్కస్‌ త్రో చేసింది. చివరికి మూడోసారి 64 మీటర్లు విసిరి ఫైనల్‌కు అర్హత సాధించింది. 16వ స్థానంలో నిలిచి ఇంటిముఖం పట్టిన పూనియా 60.57 మీటర్లే త్రో చేయగలిగింది.
వందన హ్యాట్రిక్‌…
ఒలింపిక్స్‌ మహిళల హాకీ పోటీల్లో భారత జట్టు గ్రూప్‌-ఏలో చివరి లీగ్‌ మ్యాచ్‌ గెలిచింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 4-3 తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో వరుసగా రెండు విజయాలు సాధించి ఆరు పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. అయితే మరో లీగ్‌ మ్యాచ్‌లో గ్రేట్‌ బ్రిటన్‌ ఐర్లాండ్‌ను ఓడిరచడంతో భారత్‌ పాయింట్ల తేడాతో క్వార్టర్స్‌కు అర్హత సాధించింది. ఉత్కఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో వందన కటారియా హ్యాట్రిక్‌ గోల్స్‌ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. భారత్‌ తరపున ఒలింపిక్స్‌లో ఈ ఘనత సాధించిన తొలి హాకీ ప్లేయర్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. 4, 17, 49వ నిమిషాల్లో వరుసగా గోల్స్‌ నమోదు చేసింది. మరోవైపు నేహా గోయల్‌ 32వ నిమిషంలో మరో గోల్‌ సాధించింది. వందన 49వ నిమిషంలో చివరి గోల్‌ సాధించడంతో భారత్‌ విజయం నమోదైంది. శుక్రవారం తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లోనూ భారత్‌ ఐర్లాండ్‌పై 1-0 తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే.

బాక్సింగ్‌లో నిరాశే
భారత స్టార్‌ బాక్సర్‌, ప్రపంచ నంబర్‌ వన్‌ అమిత్‌ పంఘాల్‌ 52 కేజీల విభాగం ప్రీ క్వార్టర్‌ ఫైనల్స్‌లో ఓటమిపాలయ్యాడు. రియో ఒలింపిక్స్‌ రజత పతక విజేతగా నిలిచిన యుబెర్జెన్‌ మార్టినెజ్‌ చేతిలో అమిత్‌ 1-4 తేడాతో పరాజయం పాలయ్యాడు. తొలిసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న అమిత్‌పై భారీ అంచనాలు ఉండగా.. తొలి రౌండ్‌లో ఫర్వాలేదనిపించినా.. ఆపై పూర్తిగా తేలిపోయాడు. ఇక రెండో రౌండ్‌లో మార్టినెజ్‌ పూర్తి ఆధిపత్యం చెలాయించి భారత బాక్సర్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. అప్పర్‌ కట్స్‌తో ఎదురుదాడి చేసిన మార్టిసెజ్‌ అమిత్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు. ఇక మహిళల (6975కేజీల) విభాగంలో పోటీ పడ్డ పూజారాణి క్వార్టర్స్‌లో ఓటమిపాలైంది. చైనాకు చెందిన లి క్వైన్‌ చేతిలో 05 తేడాతో ఓటమిచెంది పోటీ నుంచి నిష్క్రమించింది.
అతాను ఓటమి..
ఒలింపిక్స్‌ ఆర్చరీ పురుషుల విభాగంలో భారత స్టార్‌ ఆర్చర్‌ అతాను దాస్‌ నిరాశపరిచాడు. శనివారం జిరిగిన ప్రీ క్వార్టర్‌ ఫైనల్స్‌లో అతాను జపాన్‌ ఆర్చర్‌ తకహరు ఫురుకవా చేతిలో 4-6 తేడాతో ఓటమిపాల య్యాడు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో అతాను స్వల్ప తేడాతో ఓటమి చెందాడు. ఈ మ్యాచ్‌లో దాస్‌ నాలుగుసార్లు 10 పాయింట్లు సాధించినా 8వ రింగ్‌లో అన్నేసార్లు మిస్‌ఫైర్‌ అయ్యాడు. దాంతో వరుసగా రెండోసారి ఒలింపిక్స్‌లో ప్రీ క్వార్టర్స్‌ నుంచే నిష్క్రమించాడు. 2016 రియో ఒలింపిక్స్‌లోనూ దాస్‌ 4-6 తేడాతో కొరియన్‌ ఆర్చర్‌ లీ సింగ్యన్‌ చేతిలో ఓడిపోయాడు. ఇక షూటింగ్‌లోనూ భారత అథ్లెట్ల పరాజయం కొనసాగుతోంది. మహిళల 50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్‌ ఈవెంట్లో షూటర్లు తేజస్వినీ సావంత్‌, అంజుమ్‌ మౌడ్గిల్‌ టాప్‌ 8లో క్వాలిఫై కాలేకపోయారు. లాంగ్‌ జంప్‌ ఈవెంట్‌లోనూ భారత అథ్లెట్‌ శ్రీశంకర్‌ టాప్‌ 8లోకి క్వాలిఫై కాలేపోయాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img