Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

ముగిసిన చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవ వేడుకలు

చివరి రోజు 11వ రోజున స్వామివారికి పుష్పయాగం, శయ నోత్సవం వేడుకలు

హాజరైన వందలాదిమంది భక్తాదులు స్వామివారిని దర్శనం చేసుకున్న వైనం

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవ వేడుకలు ఈనెల 15వ తేదీ నుండి 25వ తేదీ వరకు(11 రోజులు) ఆలయ ఈవో వెంకటేశులు, ఉభయ దాతలు, అర్చకులు, రథోత్సవ కమిటీ అధ్యక్షులు దాశెట్టి సుబ్రహ్మణ్యం, సభ్యులు ద్వారా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల వేడుకల్లో 11వ రోజు శనివారం రాత్రి అర్చకులు కోనేరాచార్యులు, మకరంద బాబు, భాను ప్రకాష్ ,చక్రధర్ వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు నడుమ పుష్పయాగము, సయ నోత్సవము (ఏకాంత సేవను) పురస్కరించుకొని స్వామివారికి తొలి పూజలు నిర్వహించారు. సాంప్రదాయ పద్ధతిలో ఉదయం పుష్పయాగము, రాత్రి శ యనోత్సవం నిర్వహించారు. ఉదయం పుష్ప యాగమును అర్చకులు సాంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొమ్మిది రకాల పొలాలతో ఉత్సవ విగ్రహాలకు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు నడుమ పూజలు చేశారు. అనంతరం అర్చకులు మాట్లాడుతూ గత పది రోజులుగా నిర్వహించిన బ్రహ్మోత్సవ వేడుకల్లో ఏవైనా దోషాలు, తప్పిదాలు జరిగి ఉంటే మన్నిస్తూ, స్వామివారికి పుష్ప యాగమును నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఉభయ దాతలుగా అన్నమయ్య సేవా మండలి పోరాల్ల పుల్లయ్య, పద్మావతి, కుమారుడు పుండరీకాక్ష, వారి శిష్య బృందం వ్యవహరించారు. అనంతరం రాత్రి 7 గంటలకు స్వామివారికి షయనోస్తవం, ఏకాంత సేవను అర్చకులు నిర్వహించారు. ఉభయ దాతలుగా అర్చకులు కోనేరాచార్యులు, మకరంద బాబు, భాను ప్రకాష్, చక్రధర్, వ్యవహరించారు.తదుపరి పద్మశాలి సంఘం వారిచే అమ్మవారికి చీర, సారే పసుపు, కుంకుమను సమర్పించారు. అర్చకులు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన దేవతలకు ఆయా లోకాలకు పంపించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, చెన్నకేశవ స్వామి పూర్తిగా శ్రమ పెరగడంతో వారికి సేద తీర్చడానికే ఏకాంత సేవను ఏర్పాటు చేస్తూ ప్రత్యేక పూజలు కూడా నిర్వహించడం జరిగిందని తెలిపారు. తదుపరి ఉత్సవ పీఠం మీద స్వామి వారిని పవళింపు సేవలో ఉంచడం జరిగిందని తెలిపారు. పవళింపు పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తదుపరి ఉభయ దాతల పేరిట అర్చకులు అర్చనలు, పూజలు నిర్వహించిన తర్వాత రథోత్సవ కమిటీ తరఫున అధ్యక్షులు దాశెట్టి సుబ్రమణ్యం, సభ్యులు కలసి ఘనంగా అర్చకుల వేదమంత్రాల నడుమ సత్కరించారు. ఆలయము వెలుపల, బయట విద్యుత్ దీపాలతో అలంకరణ, వివిధ పూలమాలతో అలంకరణ చేసిన వైనం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం రథోత్సవ కమిటీ వారు, అర్చకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మే నెలలో ఈ బ్రహ్మోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని, భక్తాదులందరికి అన్ని సౌకర్యాలు కూడా కల్పించి, వేడుకల్లో వివిధ వాహనాల్లో స్వామివారిని ఊరేగించడం జరిగిందన్నారు. ఈ వేడుకల్లో ఉభయ దాతల సహాయ సహకారములతోనే విజయవంతంగా ఈ బ్రహ్మోత్సవ వేడుకలు నడుస్తోందని, వారందరికీ పేరుపేరునా వారు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ బ్రహ్మోత్సవాలలో ప్రతిరోజు అన్నమయ్య సేవా మండలి అధ్యక్షులు పోరాళ్ల పుల్లయ్య బృందం, గోదా రంగనాథ మహిళా మండలి గురువు భవాని, అధ్యక్షులు మంజుల, వారి శిష్య బృందం ప్రదర్శించిన కోలాటం, అన్నమయ్య పాటలు ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు అందర్నీ ముగ్ధుల్ని చేయడం పట్ల ఆలయ ఈవో ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉభయ దాతలు, ఆలయ ఈవో వెంకటేశులు, ఆలయ సిబ్బంది రామశాస్త్రి, మల్లికార్జున, హరి, రథోత్సవ కమిటీ సభ్యులు,భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img