Wednesday, May 22, 2024
Wednesday, May 22, 2024

సబ్ జైలును జిల్లా న్యాయ అధికారి ఆకస్మిక తనిఖీ


విశాలాంధ్ర ధర్మవరం:: చట్టపరంగా ఖైదీలు జీవిస్తూ, మంచి ప్రవర్తన కలిగి ఉండాలని జిల్లా న్యాయ అధికారి శ్రీనివాస్ తెలిపారు. పట్టణంలోని సబ్ జైలును వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సబ్ జైల్లోని రికార్డులను ప్రతి గదిని వారు క్షుణ్ణంగా పరిశీలించారు. తదుపరి కొద్దిసేపు ఖైదీలతో మాట్లాడుతూ భోజనము, వసతులపై వారు ఆరా తీశారు. ఖైదీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఖైదీలకు ఉచితంగా న్యాయవాదులను ఏర్పాటు చేస్తామని, తద్వారా తమ సమస్యలకు న్యాయం జరిగే అవకాశం ఉందని వారు తెలిపారు. ఖైదీలకు న్యాయవాదులు అవసరమైతే సబ్ జైలు సూపర్డెంట్ బ్రహ్మీరెడ్డికి సమాచారాన్ని అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సీనియర్ సివిల్ జడ్జ్ గీతావాణి, జూనియర్ సివిల్ జడ్జ్ రమ్య సాయి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img