Friday, May 3, 2024
Friday, May 3, 2024

విద్యతోనే బంగారు భవిష్యత్తు

పాఠశాల కరస్పాండెంట్ కిరణ్ కుమార్

విశాలాంధ్ర- ఉరవకొండ : విద్యతో ఏదైనా సాధించవచ్చని, నేటి ప్రపంచంలో విద్యకు ఎంతో ప్రాముఖ్యత ఉందని స్థానిక జ్యోతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల కరస్పాండెంట్ కిరణ్ కుమార్ అన్నారు. మంగళవారం పాఠశాలలో చివరి రోజు అన్యువల్ డే ను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని పాఠశాల కరస్పాండెంట్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తమపై ఎంతో ఉందన్నారు. చదువు మనిషి ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులు చిన్నతనం నుంచి ఏకాగ్రతతో విద్యనభ్యసించాలన్నారు. చిన్నతనం నుంచే లక్ష్యాలను నిర్దేశించుకుని ఆ దిశగా కృషిచేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఎన్నో ఆశలు ఆశయాలతో తమ పాఠశాలలో విద్యార్థులను చేర్పించిన తల్లిదండ్రుల యొక్క లక్ష్యాలకు అనుగుణంగా తాము పని చేస్తామని తెలిపారు. రాబోయే విద్యా సంవత్సరంలో తాము అమలు చేసే విద్యా ప్రమాణాలు విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే విధంగా ఉంటాయన్నారు. నైతిక విలువలతో, క్రమశిక్షణతో కూడిన విద్యను తాము అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా పదవ తరగతి పరీక్షలలో అత్యంత ప్రతిభ కనపరిచిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం మరియు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అభినందించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు స్వరూప రాణి మరియు అధ్యాపక బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img