విశాలాంధ్ర -ధర్మవరం:: పట్టణంలోని తొగట వీధిలో గల శ్రీ శాంత కళా చౌడేశ్వరి దేవి ఆలయానికి బెంగళూరుకు చెందిన జయప్రకాష్ వారి సతీమణి రమ్య నాగమణి అనే దంపతులు కేజీ విలువైన వెండి ఆభరణ వస్తువులను ఆలయ కమిటీకి అందజేశారు. తదుపరి ఆలయ కమిటీ వారు ఆ దంపతులను పేరిట అర్చనలు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఘనంగా సత్కరించారు. తదుపరి ఆలయ జ్ఞాపకార్థం అమ్మవారి విగ్రహాన్ని దంపతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సిరివెళ్ల రాధాకృష్ణ, బండి నాగరాజు, పెద్దకోట్ల విజయ్, పెద్ద కోట్ల భాస్కర్, చందా జయ చంద్ర తదితరులు పాల్గొన్నారు.