Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

ధర్మవరం అభివృద్ధికి ఆ దేవుని ఆశీస్సులు కూడా కావాలి…

ఉమ్మడి ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్
విశాలాంధ్ర ధర్మవరం:: ధర్మవరం నియోజకవర్గ అభివృద్ధికి ఆ దేవుని ఆశీస్సులు కూడా కావాలని, అభివృద్ధి చేయుటలో తాను కృత నిశ్చయంతో ఉన్నానని టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా శ్రీరామనవమి పండుగ సందర్భంగా నియోజకవర్గంలోని పలు దేవాలయాలలో వారు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణంలోని సిద్దయ్య గుట్టలో గల శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో జరిగిన సీతారాముల కళ్యాణోత్సవములో వారు పాల్గొన్నారు. ఆలయ కమిటీ అధ్యక్షురాలు జయశ్రీ, తదితర కమిటీ సభ్యులు సత్య కుమార్ యాదవ్కు ఘన స్వాగతం పలికారు. అనంతరం సత్య కుమార్ యాదవ్ పేరిటన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా సీతారాములకు సత్య కుమార్ యాదవ్ పట్టు వస్త్రాలను సమర్పించారు. ధర్మవరం ప్రజలు సుఖశాంతులతో సౌభాగ్యాలతో సుభిక్షంగా ఉండాలని సకాలంలో వర్షాలు పడి పసిడి పంటలు పండాలని స్వామివారిని కోరడం జరిగిందని తెలిపారు. అనంతరం ధర్మవరం పట్టణ ప్రజలకు వారు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. తదుపరి మండల పరిధిలోని గొట్లూరు గ్రామములోని శ్రీ సీతారామాంజనేయ ఆలయము, ముదిగుబ్బ మండలములోని పాతూరు ఆంజనేయస్వామి దేవాలయంలో కూడా జరిగిన కళ్యాణ మహోత్సవములో కూడా సత్య కుమార్ యాదవ్ పాల్గొని అక్కడ కూడా పట్టు వస్త్రాలను సమర్పించి తీర్థప్రసాదాలను పుచ్చుకోవడం జరిగిందని తెలిపారు. అనంతరం సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ శ్రీరామనవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తాదులు అత్యంత వైభవంగా నిష్టతో జరుపుకుంటారని, అటువంటి శ్రీరాముని యొక్క ఆలయాన్ని ప్రధానమంత్రి మోడీ అయిదు సంవత్సరాలు తర్వాత వారి ఆధ్వర్యంలో గుడి ఏర్పాటు చేయడం నిజంగా ఓ పెద్ద గొప్ప విజయం అని తెలిపారు. తదుపరి సిద్దయ్య గుట్టలో వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణానికి తాను కూడా భాగస్వామ్యం అవుతానని తనవంతుగా విరాళాల విరాళాన్ని త్వరలో అందజేస్తానని తెలిపారు. తదుపరి ఆలయ అధ్యక్షురాలు జయ శ్రీ మాట్లాడుతూ 50 సంవత్సరాల తర్వాత ధర్మవరం నియోజకవర్గానికి బిజెపి అభ్యర్థి సత్య కుమార్ యాదవ్ ద్వారా ఎమ్మెల్యే అభ్యర్థి కావడం నిజంగా గర్వించదగ్గ విషయమని, శ్రీరామ ఆశీస్సులు కూడా తప్పక లభిస్తాయి అని తెలిపారు. తాను కూడా ధర్మవరం పట్టణ ప్రజలకు శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండగ రోజున మనం వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మంచి వాళ్ళని ఆదరించి గెలిపించుకోవలసిన బాధ్యత ప్రజలపై ఉందని తెలిపారు. సత్య కుమార్ యాదవ్ స్వర్ణ ధర్మారం గా మారుస్తారని, రూపురేఖల్ని కూడా మారుతాయని ఈ సువర్ణ అవకాశాన్ని నియోజకవర్గ ప్రజలు ఉపయోగించుకోవాలని తెలిపారు. బీసీ వర్గానికి చెందిన సత్య కుమార్ యాదవ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా రావడం సంతోషించదగ్గ విషయమని వారు తెలిపారు. ధర్మవరం అభివృద్ధికి దోహదపడాలంటే ఇటువంటి వ్యక్తి అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. అనంతరం జయశ్రీ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు అర్చకుని వేదమంత్రాల నడుమ సత్య కుమార్ యాదవ్ను ఘనంగా పట్టు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తాదులు, బిజెపి, టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img