Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

కళాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వం, ప్రజలది… :కళాకారిణి జయశ్రీ

విశాలాంధ్ర ధర్మవరం:; కళాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వములతో పాటు ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని కళాకారిని జయశ్రీ తెలిపారు. ఈ సందర్భంగా ప్రపంచ కళా దినోత్సవం ను పురస్కరించుకొని పలు విషయాలను వారు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తాను కళాకారుని గా తెలుపుకొనుటకు గర్వపడుతున్నానని తెలిపారు. ఈ చిత్రకళ భగవంతుడు నాకు ఇచ్చిన వరంగా భావిస్తున్నానని తెలిపారు. నాలాంటివారు ప్రపంచంలో వివిధ కళలతో జీవనం కొనసాగిస్తున్నారని, మరి కొంతమంది తమ జీవితాలను దుర్భర పరిస్థితుల్లో గడుపుతున్నారని తెలిపారు. నేటి కళాకారులు తమ కలలతో సమాజంలో జరుగుతున్న మంచి, చెడులను చిత్ర లేఖనం, సందేశాల, కళారూపాల ద్వారా తెలుపుతున్నారని, సమాజ అభివృద్ధికి దోహదపడుతున్నారని తెలిపారు. వ్యక్తిగత వికాసానికి ,సమన్వయానికి ఈ కళాకారులు దోహదపడుతున్నారని తెలిపారు. రాబోయే భవిష్యత్ తరాలు కూడా ఈ కళ అనగా చిత్రకళ, శిల్పకళ, తదితర కళలను అందజేయాల్సిన బాధ్యత అందరిమీద ఉందని తెలిపారు. పూర్వకాలంలో రాజుల వద్ద కళాకారులను పోషించేవారని, ఆ కళ లను ఆలయాల్లో ప్రతిష్టించే వారిని తెలిపారు. నేడు కూడా కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ కళాకారులను ప్రోత్సహించి, వారి జీవన అభివృద్ధిని మెరుగుపరచాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని వారు తెలిపారు. భారతదేశ సంస్కృతి కలలను కళాకారులే తెలియపరుస్తారని తెలిపారు. అందుకే ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా కళాకారులను గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఈ కళాకారుల జీవన అభివృద్ధిని మెరుగుపరచడానికి మున్ముందు సమాజంలో కూడా కళాకారులు పుట్టుకు రావాలని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి కళాకారులను ప్రోత్సహిస్తూ, వయసు మళ్ళిన కళాకారులకు పెన్షన్ పంపిణీ చేయాలని వారు తెలిపారు. అంతేకాకుండా కళాకారుల అభివృద్ధికి ఆర్థికంగా సహాయం చేస్తూ, మెరుగుపరిచిన నాడే దేశంలో కళాకారులకు మంచి గుర్తింపు, మన్ననలు ప్రజల, ప్రభుత్వాల ద్వారా లభిస్తాయని సంతోషాన్ని వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img