Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

డిగ్రీ కళాశాల ఫైనల్ ఇయర్ విద్యార్థులకు వీడ్కోలు ఇవ్వడం ఆనవాయితీ.. కర్రీస్పాండెంట్ చాంద్ భాషా

విశాలాంధ్ర – ధర్మవరం : డిగ్రీ కళాశాలలో ఫైనల్ ఇయర్ విద్యార్థులకు వీడ్కోలు ఇవ్వడం ఆనవాయితీ తోపాటు అత్యంత ఆనందదాయకమైన పండుగని కరెస్పాండెంట్ చాంద్ బాషా, అధ్యక్షులు పోలా ప్రభాకర్, కళాశాల ప్రిన్సిపాల్ ఫణి కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ సాయి డిగ్రీ కళాశాలలో ఫైనల్ ఇయర్ విద్యార్థులకు జూనియర్ విద్యార్థులు ఘనంగా వీడ్కోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కళాశాల కరస్పాండెంట్ చాంద్ భాషా తో పాటు పోలా ప్రభాకర్ డైరెక్టర్లు బండ్లపల్లి రంగనాథ్, డాక్టర్ బి వి. సుబ్బారావు, రమణ, అక్రమ్, ప్రిన్సిపాల్, ఫణి కుమార్ పాల్గొన్నారు. అనంతరం కరెస్పాండెంట్, డైరెక్టర్లు, ప్రిన్సిపాల్ మాట్లాడుతూ పట్టణంలోనే ప్రథమ స్థానంతో ఉన్న మా కళాశాల పేరును మంచి ఫలితాలను తీసుకువచ్చి అందరూ నిలబెట్టాలని వారు కోరారు. బీటెక్ కోర్సులకు దీటుగా డిగ్రీ కోర్సులను డిజైన్ చేశారని, డిగ్రీ విద్యార్థులు ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవడంలో బీటెక్ విద్యార్థులకు ఏమాత్రం తీసిపోరని తెలిపారు. ప్రతి విద్యార్థి కష్టపడి, ఇష్టపడి చదివినప్పుడే మంచి ఫలితాలతో పాటు మంచి భవిష్యత్తు కూడా ఉంటుందని తెలిపారు. తల్లిదండ్రుల యొక్క కష్టాలను గుర్తిరిగి తమ జీవితాలను చదువు అనే ఆయుధంతో ముందుకు వెళ్లాలని తెలిపారు. తదుపరి విద్యార్థినీ విద్యార్థుల యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థిని, విద్యార్థులు, తల్లిదండ్రులు, కళాశాల కమిటీ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img