Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Tuesday, October 1, 2024
Tuesday, October 1, 2024

ఏరువాక కార్యక్రమం జయప్రదం చేయండి…

ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జే. వి. రమణ పిలుపు
విశాలాంధ్ర బత్తలపల్లి/ధర్మవరం:: ఏరువాక పౌర్ణమి (వ్యవసాయ పండుగ )సందర్బంగా ఆంధ్రప్రదేశ్ రైతుసంగం పిలుపులో భాగంగా శ్రీ సత్య సాయి జిల్లాలోని బత్తలపల్లి మండలం పొలాల్లో ట్రాక్టర్ తో మడకలు దున్ని ఏరువాక కార్యక్రమం నిర్వహించడ జరిగింది .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగాపాల్గొన్న జేవీ రమణ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కే. కాటమయ్య, వ్యవసాయ కార్మి క జిల్లా సహా కార్యదర్శి మాల్యావంతం కుల్లాయప్ప, సిపిఐ మండల కార్యదర్శి బండల వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జె.వి రమణ మాట్లాడుతూ రైతులకు ,ప్రజలకు అనేక రకాలుగా నష్టాలు, ఇబ్బందులు కలిగే విధంగా భూ హక్కుల చట్టం అమలు చేసేందుకు గత ప్రభుత్వం ప్రయత్నం చేసినదని ,ఆ యొక్క చట్టం వలన రైతులకు ,ప్రజలకు అనేక రకాలుగా ఇబ్బందులు ఉంటాయని మొదటగా ఏపీ రైతు సంఘం రాష్ట్ర సమితి గుర్తించి ఆ చట్టాన్ని రద్దు చేయాలని, లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు ,నిరసనలు నిర్వహిస్తామన్నారు. గతంలో ప్రభుత్వానికి అనేక రూపాలలో విజ్ఞప్తులు చేయడం జరిగినది .కానీ గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం చేసిన విజ్ఞప్తులను పెడ చెవిన పెట్టినది అని మండిపడ్డారు.
ప్రతిపక్షంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ వలన రైతులు, ప్రజలు ఇబ్బందులు పడతారని గుర్తించి, ఎన్నికల ప్రచారంలో భాగంగా మేం అధికారంలోకి రాగానే ఆ చట్టాన్ని రద్దు చేస్తామని హామీ ఇవ్వడం జరిగినది అని తెలిపారు. అధికారంలోకి రాగానే
ల్యాండ్ టైటాలింగ్ యాక్ట్ రద్దు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగాస్మార్ట్ మీటర్లు, విద్యుత్ సవరణ బిల్లు రద్దు చేస్తూ అసెంబ్లీలో చట్టం చేయాలనీ డిమాండు చేశారు.
ముఖ్యంగా బ్యాంకులలో ఉన్న అన్ని రకాల రైతుల అప్పులను మాఫీ చేయాలని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, సాగు కోసం అధనంగా అప్పులు చేస్తున్నారని, సాగు కోసం ప్రతి రైతు వారికున్న బంగారం బ్యాంకులలో తాకట్టు పెట్టడం జరుగుతున్నదని , పంటలకు గిట్టుబాటు ధరలు లేక బ్యాంకులలో ఉన్న బంగారంను విడుదల చేసుకోలేక వారి పిల్లలకు వివాహాలు చేయలేక మానసికంగా, ఆందోళనలకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కావున ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులు వలసలు వెళ్లకుండా, ఆత్మహత్యల పరంపర కొనసాగకుండా ఉండడానికి చర్యలు చేపట్టాలని ,రైతులకు అవసరమైన ఉచిత విద్యుత్తును అందించి ,విత్తనాలను ,ఎరువులను డ్రిప్ ఇరిగేషన్ సిస్టం 90 శాతముసబ్సిడీతో సబ్సిడీ అందించి రైతులను అన్ని రకాలుగా అందుకోవాలని, బ్యాంకులలో రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని, అదేవిధంగా డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫారసు అమలు చేసి రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, 50 సంవత్సరాలు పూర్తయిన ప్రతి రైతుకు పదివేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని, ప్రభుత్వం ప్రతి రైతుకు సంవత్సరానికి 20వేల రూపాయలు సాగు సాయం చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం జరిగినది అని తెలిపారు. ఆ విధంగా కాకుండా సాగు సాయం కింద ప్రతి ఎకరంనకు 15 వేల రూపాయలు సాయం చేయాలని, పెండింగ్ లో ఉన్న పాసుబుక్కులను ప్రతి రైతుకు అందించాలని, ప్రకృతి పరమైన వ్యవసాయానికి ప్రభుత్వ సహకరించాలని, ఉపాధి హామీ పథకమును రైతులుకు అనుసంధానం చేయాలని ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం లో రైతు సంఘం మండల అధ్యక్షులు సత్తప్ప, కార్యదర్శి సాకే రామకృష్ణ , సిపిఐ మండల సహాయ కార్యదర్శి బి. నాగభూషణ, గోగుల సూరి, , ఆదెప్ప,సాకే దేవ సాయి, నారాయణ, డేరంగుల రామంజి, రామదాసు బోయపాటి రామప్ప, మహబూబ్ బాషా, ముత్యాలప్ప, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img