Wednesday, May 22, 2024
Wednesday, May 22, 2024

పేద ప్రజలకు కంటి చూపు ప్రసాదించడమే రోటరీ క్లబ్ కర్తవ్యం…

రోటరీ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు జయసింహ, నాగభూషణం.
విశాలాంధ్ర ధర్మవరం:: పేద ప్రజలకు కంటి చూపు ప్రసాదించడమే మా కర్తవ్యం అని రోటరీ క్లబ్ అధ్యక్షులు జయసింహ, కార్యదర్శి నాగభూషణ, ఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ శిబిరం రోటరీ క్లబ్, శంకరా కంటి ఆసుపత్రి-బెంగళూరు, జిల్లా అందత్వ నివారణ సంస్థ-అనంతపురం వారి సహకారంతో నిర్వహించడం జరిగిందని తెలిపారు. శిబిరా దాతలుగా కీర్తిశేషులు దాసరి నారాయణప్ప జ్ఞాపకార్థం సతీమణి దాసరి బసమ్మ ,కోడలు, కుమారుడు దాసరి లక్ష్మీదేవమ్మ అండ్ దాసరి రామచంద్ర అండ్ సన్స్, మనవాళ్లు దాసరి అభినవశ్రీ,అభినవ శ్రీరాం, దాసరి అభినవ లక్ష్మన్ వ్యవహరించడం పట్ల వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ శిబిరానికి 151 మంది రోగులు హాజరుకాగా, వీరందరికీ కంటి వైద్య పరీక్షలు నిర్వహించిన పిదప 111 మంది ఆపరేషన్కు ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. ఆపరేషన్కు ఎంపికైన వారందరినీ సోమవారం బెంగళూరుకు(రవాణా ఖర్చులు అండ్ ఆపరేషన్లు పూర్తి ఉచితం) పంపించి ఉచితంగా ఆపరేషన్లు చేయడం జరుగుతుందని తెలిపారు. దాతల సహాయ సహకారములతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం పట్ల దాతలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలను తెలుపుతూ వారు దాతలను ఘనంగా సత్కరించారు. వీరితో పాటు బెంగళూరు కంటి వైద్యులు డాక్టర్ హేమంత్, డాక్టర్ స్రవంతి, డాక్టర్ జనీల, శంకరా కంటి ఆసుపత్రి కోఆర్డినేటర్ శివప్రకాష్ లను కూడా ఘనంగా సత్కరించారు. నేటి ఈ శిబిరంలో రెటీనా ఫండస్ కెమెరాలతో ప్రత్యేకంగా వైద్య చికిత్సలను చేయించడం జరిగిందని తెలిపారు. కంటి నరాలు సమస్య ఉన్నవారు షుగర్ బీపీలు ఉన్నవారికి ఈ రెటీనా ఫండస్ కెమెరా చాలా ఉపయోగపడుతుందని తెలిపారు. ఇటువంటి పరీక్షలు ప్రైవేట్ ఆసుపత్రులలో చేయించుకోవాలంటే దాదాపు 45 వేల రూపాయలు ఖర్చవుతుందని, అటువంటి ఈ సేవా కార్యక్రమాన్ని కూడా ఉచితంగా అందించడం మాకెంతో తృప్తిని ఇచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి సుదర్శన్ గుప్తా, క్యాంపు చైర్మన్ శ్రీనివాసరెడ్డి, ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షులు నాగరత్న, అంబిక, రోటరీ సభ్యులు శివయ్య, కొండయ్య ,రమేష్ బాబు, తిరుమల్ల దాస్, మనోహర్ గుప్త,సత్రశాల ప్రసన్నకుమార్, కృష్ణమూర్తి, టీచర్ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img