Friday, October 25, 2024
Friday, October 25, 2024

వైద్య ఆరోగ్య శాఖామంత్రిగా సత్య కుమార్ యాదవ్ పదవీ బాధ్యతలు స్వీకరణ..

నియోజకవర్గ నాయకులు, బిజెపి, టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తల హర్షం వ్యక్తం చేసిన వైనం

విశాలాంధ్ర ధర్మవరం:: శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ సత్య కుమార్ యాదవ్ ఎన్ డి ఏ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఎంపిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు వెలగపూడి సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కుటుంబ సభ్యుల నడుమ, ఎన్ టి ఏ కూటమి పార్టీ నాయకుల నడుమ బాధ్యతలను సంతకం చేసి స్వీకరించారు. తొలుత కుటుంబ సమేతంగా ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా నన్ను నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, అదేవిధంగా మా రాజకీయ గురువు ప్రధానమంత్రి మోడీ ఆశీస్సుల మేరకు అందరికీ వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ ఆసుపత్రుల కన్నా మెరుగైన వైద్యం అందిస్తానని, ప్రతి పేదవానికి వైద్య విషయంలో అందుబాటులో ఉంటూ వారి ఆరోగ్యమే మా ప్రధాన లక్ష్యంగా తాను పనిచేస్తానని తెలిపారు. ఎన్డీఏ పాలనలో అభివృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపిస్తానని తెలిపారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పక బాధ్యతగా నా విధులు నిర్వర్తిస్తానని తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో అక్రమాలు జరిగాయని, ఆరోగ్యశ్రీ అవకతవకలపై శ్వేత పత్రం విడుదల చేస్తామని, నిదుల వినియోగంపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం రాష్ట్ర అధికారులు, బంధుమిత్రులు, ధర్మవరం నియోజకవర్గం ఎన్డీఏ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img