విశాలాంధ్ర ధర్మవరం:: ఈనెల 21వ తేదీ నాడు శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా స్థానిక వివేకానంద కేంద్రం యోగా ఆర్గనైజర్ పి నర్సింహులు ఆధ్వర్యంలో యోగా ర్యాలీ పట్టణ ప్రజలు యోగా మీద అవగాహన కోసం( యోగ అవేర్నెస్ కోసం) బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది అని యోగ ఆర్గనైజర్ నరసింహులు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ జూన్ 21వ తేదీ యోగ డే సందర్భంగా పట్టణంలోని యోగ సెంటర్లు సంయుక్తంగా ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నందు ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల 30 నిమిషాల వరకు కామన్ యోగ ప్రోటోకాల్ ప్రకారం యోగా నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆధ్యాత్మిక యోగ కేంద్రం ప్రెసిడెంట్ గుర్రం వేణుగోపాల్ , టీచర్ నాగరాజు, సుబ్బయ్య శెట్టి, మోహన్ రెడ్డి, నాగభూషణ్ రెడ్డి, సూర్య నారాయణ, కమిటీ సభ్యులు పాల్గొంటారని తెలిపారు. యోగా మీద ఆసక్తి ఉన్నవారు, పట్టణ ప్రజలు అందరూ పాల్గొనాలని విజయవంతం చేయాలని వారు కోరారు.