విశాలాంధ్ర-ధర్మవరం:: పట్టణంలోని ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ హోమ్ లో కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో గత కొన్ని నెలలుగా కార్యదర్శి బదిలీ కావడంతో, ఆ పోస్టును తాడిమర్రి తాసిల్దారుగా పనిచేస్తున్న సి. భాస్కర్ రెడ్డిని ఏకగ్రీవంగా కార్యవర్గం ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ నాకిచ్చిన ఈ పదవిని బాధ్యతగా స్వీకరిస్తూ ఉద్యోగుల సమస్యలపై పోరాటం చేస్తూ పరిష్కరిస్తానని తెలిపారు. అనంతరం నూతన ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్, స్థానిక ఎమ్మెల్యే, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులకు అన్ని రకాలుగా అండగా ఉండాలని వారు కోరారు. అనంతరం భాస్కర్ రెడ్డిని ఎన్జీవో హోం కార్యవర్గం ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్జీవో హోం సభ్యులు పాల్గొన్నారు.